. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, May 27, 2013

గుండె చప్పుళ్ళు ....నీకు వినిపించని నిశ్శబ్దాలు

1) నీ ఊహలకు నా మనసు ఎలా బానిస అయ్యిందో చెప్పలేను కాని నా ప్రతి కదలికా నీ కోసమే

2) కారే కన్నీటికి అలుసైపోయాను . . .నీ కోసం ఎదురు చూసి అలసిపోయాను

3) నీ జ్ఞాపకాలను మరవాలని ప్రయత్నిస్తున్నా ఈ ఒంటరితనం నిన్ను ప్రతి క్షణం గుర్తుచేస్తూనే ఉంది

4) భారమైతే చెప్పు దూరమవుతాను

5) అబిమానం కలవాన్ని ఆదరించకపోయినా పర్లేదు ప్లీజ్ అవమానించకు ..?

6) ఎవరు చూసారు గనుక....జారుతున్న కన్నీటిలో రేపటి స్వప్నాలు ఉన్నాయని

7) మనసుకేమోమరుపే లేదు కంటికేమో కునుకే రాదు .

8) నీతో మాట్లాడలనుకునే మాటలని గుండెల్లోనే అదిమిపెడుతుంటే
నాకు తెలీకుండా కన్నీరై కన్నుల్లో ఉన్న నీరూపాన్నే అభిషేకిస్తున్నాయి


9) గొంతులో పలికే భావాన్ని విని మనసులోని అలజడి తెలుసు కుంటావనుకున్నాను

10 ) నీ ప్రేమతో నిండిన మనసేమో మారం చేస్తుంది నేనేలా ఉండగలను మాట్లాడకుండా
నాదైన గొంతుని ఆపగలిగాను కాని నాది కాని ఈ మనసుని ఎలా ఆపగలను 


11) ఘడియ చాలు నీ గుండె సవ్వడి తెలుసుకోవటానికి,క్షణము చాలు నీ కంటిపాపలో నన్ను చూసుకోవటానికి 

12 ) కొత్త స్నేహితుల్ని పెంచుకునే తొందర్లో..పాత స్నేహితుల్ని మరువకండి..!! 

13) నాకోసం ఎవరూ లేని ఈలోకంలో ఓ నేస్తానివై స్వాగతిస్తావా...మరోసారి జన్మించేందుకు ఈ క్షణమే మరనించేందుకు నేను సిద్దం 

14 ) నీ మాటల గారడీలో నలిగిన నిజాలనేరుకుంటూ..
ఎదురు చూపుల్లో ఎండి వాలిన రెప్పలు చాటున రాలకుండా
కళ్ళలో మిగిలిన నా కన్నీటి సాక్షిగా నీకోసం ఎదురు చూస్తూనే ఉంటా


15) నీ మనసు గుట్టు విప్పకుండా ...నీవు బందించిన నా జ్ఞాపకాల సాక్షిగా నా మాటలను గుండెల్లో బంధించి భారమైన నాగుండె భాద నీవు తెల్సుకునే దెలా...?

16) రాత్రి కొమ్మల మీద పేర్చిన నల్లటి మబ్బులు తమ కలల గుండెల్లో నీళ్ళు తోడి పోస్తున్నాయి సొగసు తుంపరలు తమనిండా నింపుకొని నీకోసం ఎదురు చూస్తున్నాయి   

17) నా మరణశయ్య పక్కనుండి నువ్వెళుతున్నప్పుడు వో పుష్ప గుఛ్చాన్ని వుంచుతావేమోనని ఆరాటపడ్డాను.నీ స్పర్శతో పునరుజ్జీవనడవుతాననే ఆశతో నీ వైపు దీనంగా చూశాను 

18) నా పిచ్చి గుండెకు గాయం చేసి వేణువులా మ్రోగమంటూ తిరిగి బ్రతికిన జ్ఞాపకానికి ఏమని చెప్పను

19) కొవ్వొతి ఆశగామారి చుట్టూ చీకటిబాధను పలుకరించింది ..
బ్రతుకు పండుతుందేమో అని ఆ నింగి ఉదయం కోసం ఎదురు చూస్తూ ..?
 


20 ) నిద్ర లేచిన పగలు, రాత్రి దుప్పటి లాగుతుంటే
ఒళ్ళుమండిన సూరీడు బద్ధకంగా నిద్ర లేచి తన కోపంతో కిరణాలను బైటికి తీసి గుచ్చుతున్నాడు ఒక్కొక్కటిగా