నిన్నకి నేటికి మధ్య
ఇరుకుసందులో, ఒదిగిన పాత
జ్ఞాపకాలు, బరువుగా వాలిన
నీ కను రెప్పల శబ్దానికి చెదిరి ఎగిరి
నీ జ్ఞాపకాలు కందిరీగల్లా కమ్ముకున్నాయి
గుండెను చిల్లులు పడేలా కుట్టేస్తున్నాయి
కనుల కొలను కొలుకుల్లో పూసిన
నీ చిరునవ్వుల ముత్యాల కలువలు,
నీ చెక్కిళ్ళు కూర్చిన కలల పంటై
కళ్ళలో దాగని కన్నీరు ధారల దారాల్లో
ఇమడక, జారి, నీ పెదవి విరుపుల్లో
కరిగి మాయమవుతున్నాయి ప్రియా
విధి విసిరిన వేగానికి రెక్కలు
విరిగిన మనసు, నీకోపాన్ని అడ్డుకోలేక
నా మనస్సుకు అధారమవలేక, అలసి
సొలసి నీకోసం అవేదనగా నీరీక్షిస్తున్నా ప్రియా
ఇరుకుసందులో, ఒదిగిన పాత
జ్ఞాపకాలు, బరువుగా వాలిన
నీ కను రెప్పల శబ్దానికి చెదిరి ఎగిరి
నీ జ్ఞాపకాలు కందిరీగల్లా కమ్ముకున్నాయి
గుండెను చిల్లులు పడేలా కుట్టేస్తున్నాయి
కనుల కొలను కొలుకుల్లో పూసిన
నీ చిరునవ్వుల ముత్యాల కలువలు,
నీ చెక్కిళ్ళు కూర్చిన కలల పంటై
కళ్ళలో దాగని కన్నీరు ధారల దారాల్లో
ఇమడక, జారి, నీ పెదవి విరుపుల్లో
కరిగి మాయమవుతున్నాయి ప్రియా
విధి విసిరిన వేగానికి రెక్కలు
విరిగిన మనసు, నీకోపాన్ని అడ్డుకోలేక
నా మనస్సుకు అధారమవలేక, అలసి
సొలసి నీకోసం అవేదనగా నీరీక్షిస్తున్నా ప్రియా