నీ మనసు విప్పే ప్రయత్నం చేస్తాను
ఆశగా అమాంతం గా
నీ లోనికి చొరబడాలని చూస్తాను
లోన ఇంకెవరో ఉంటారు
నీ హృదయం వాకిట నుండే వెనుదిరుగుతాను
నే వెళ్ళిపోతుంటే చూస్తుంటావు
ఆచూపుల్లో అర్దం తెలీదు
ఎంతగా వెతినా దొరకని భావం నీ కళ్ళలో
నాకు తెలుసు నువ్వు నన్ను అలా చూస్తావని
ఎందుకంటే ఆచూపుల్లో అర్దం
పసిగట్టలేనని నీకు తెల్సు
తెల్సే అలా చేస్తున్నావనీ తెల్సు ..
నీకది అలవాటేగా
అందుకే వీడ్కోలు చెప్పకుండానే
వెళ్ళిపోతాను అందుకే నీవనుకుంటావేమో
నా మనసుకు కన్నీళ్ళకి సిగ్గూ లేదు, ధైర్యమూ లేదని