నీ గుండెలోని ఆశలకు
నేనే ఊపిరి అన్నావు
నీ కళ్ళలోని వెలుగుకు
నా ఊపిరే దారన్నావు
నీ కలకాలం జీవితానికి
నా నవ్వే కానుక అన్నావు
ఈ క్షణం నా పరిచయమే
లేదంటూ దూరంగా నన్ను నెట్టేసావెందుకో
బరువెక్కిన మనసుతో
భరించలేకపోతున్నా
నీవు లేని నేను ఒంటరి అన్న
మాటకు దాస్సోహం కాలేకున్నా
నీవు లేని నేను లేనన్న
నిజాన్ని ఎప్పుడు తెల్సుకుంటావు సఖీ
కను పాప చాటున దాచాను నీ రూపాన్ని
మనసు చప్పుడులో కలిసిందే నీ జ్ఞాపకం
నీ జ్ఞాపకాల కడలికి నా కళ్ళు అంకితమయ్యింది
నా నీడకే నేను చేదు జ్ఞాపకంగా మగిలాను.
నేనే ఊపిరి అన్నావు
నీ కళ్ళలోని వెలుగుకు
నా ఊపిరే దారన్నావు
నీ కలకాలం జీవితానికి
నా నవ్వే కానుక అన్నావు
ఈ క్షణం నా పరిచయమే
లేదంటూ దూరంగా నన్ను నెట్టేసావెందుకో
బరువెక్కిన మనసుతో
భరించలేకపోతున్నా
నీవు లేని నేను ఒంటరి అన్న
మాటకు దాస్సోహం కాలేకున్నా
నీవు లేని నేను లేనన్న
నిజాన్ని ఎప్పుడు తెల్సుకుంటావు సఖీ
కను పాప చాటున దాచాను నీ రూపాన్ని
మనసు చప్పుడులో కలిసిందే నీ జ్ఞాపకం
నీ జ్ఞాపకాల కడలికి నా కళ్ళు అంకితమయ్యింది
నా నీడకే నేను చేదు జ్ఞాపకంగా మగిలాను.