ఆనందంలోనూ
ఆక్రోశంలోనూ..
చీకట్లో నను కౌగిలించుకొని
నీలోకలిపేసి నా జ్ఞాపకాల సాక్షిగా
వెలుగులో నా తోడుంటూ..
ఏకాంతంలోనూ నాతోనే ఉంటూ..
నా నీడను గుర్తు చేస్తావు
గుండెలు పగిలి, మనసు విరిగిపోయి
నోరు తడారిన తరుణంలోనూ..
నా మూగ బాధకు భాష్యం చెపుతూ..
సముద్రమంత విశాల హృదయం నీది
పసిపాపలా నిర్మలమయిన స్థితి,
నీది పుష్పమంత సున్నితమైన స్పర్శ,
అనురాగ మూర్తివి, అందాల రాసివి ..
ఇన్నీ ఉన్నా జాలిలేకుండా ఉన్నావెందుకు
అని నిలదీసి అడగాలని ఉన్నానిన్ను అడుగలేను