ఒంటరి తనపు మౌనాన్ని ఉపిరి తిత్తుల నిండా బలంగా పీల్చుకొని బాధల సుడులను బయటకు వదులు తుంటే వ్యర్ధంగా రాలిపోతుంది వర్తమానం అస్త్రైలో బూడిదల
నాలో ఈ అలవాటుకి సమాజం చూపే కారణం అనాలోచితమో, అవివేకమో, అమాయకత్వామో, అహంకరమో
అభత్రతా భావాల డిఫెన్స్ మెకనిజమో నాకానవసరం
నికోటిన్ నిషానీ తలకెక్కించి నిస్తేజత స్థానంలో నిర్లక్షాన్ని నింపి నరాలని స్టిములేట్ చేసి నాడులని వైబ్రట్ చేసి గతం గాయాలకు సెల్ఫ్ పిటీ దానికి బానిస నవ్వడానికి నాకు సమ్మతమే
పొగ............. నల్లటి దట్టమైన పొగ సుడులు తిరుగుతూ పైకి ఎగురు తుంది ... ఆ చ్చం నా ప్రియురాలి కురుల ముంగురులల
పెదవుల మధ్య మెత్తటి ఫిల్టర్ దూధి అటు చివర వెలిగే నిప్పు కణిక తన ఆధరాలలా ఎర్రగా మెరుస్తుంటే అందుకోవాలనే ఆతృతతో బలంగా పీలుస్తున్నాను
వేడి పొగ గుండెల్లో చేరుతుంటే వెచ్ఛటి తన కౌగిలి అనుభవానికి వస్తుంది ఆఖరి ధమ్ము వరకు అదే అనుభూతి తానిచ్చిన తొలి ముద్దు తాలూకు తిమ్మి రీ వాళ్ళంతా పాకు తున్న్నట్టు మత్తుగా గమ్మతుగా హటాత్తుగ కళ్ళ ముందు వెరిసిన వాస్తవికత పొగ...నల్లటి దట్టమైన పొగ కాన్సర్ కత్తిని కస్సున గుండెల్లో గుచ్చింది ఆచ్చం వెన్ను పోటు పొడిచిన నా ప్రియరాలిలా..