నల్ల మబ్బులు మెల్లగా నింగి కొచ్చాయి
మెరుపు దెబ్బకు మబ్బు చిరిగినట్టుంది,
చినుకులు చిన్నగా కారుతున్నాయి
చల్లటిగాలి రివ్వుమంది..మది జివ్వుమంది
చిన్నగా మొదలైన చినుకుల శబ్దం
లయబద్దంగా పెద్దదై..
అద్బుతమైన సంగీతం వినిపిస్తోంది
వాన ఈడ్చిన మట్టివాసన ..
మదిలో ఊసులు చెలరేపింది
కాసంత సేపు ఉరుములా
వచ్చిన ఉల్లాసం హాయిగా మనసును దోచింది మరి