నా జ్ఞాపకాల గనుల్లో నీ తలపులు
మన మాటల ఊసుల తవ్వకాలు
గతం నుంచి వచ్చిన వన్నీ నీకై తెచ్చా
మన మాటల మూటలు ఒక్కోటి విప్పనా
నీవే నాకు సర్వస్వం..నీ ఆదరణ కోసం
చకోర పక్షిలా ఎదురుచూస్తున్నా
ఈ ఏమరపాటులో ఏమైపోతానో తెలియట్లా
నాకిక వేరే జ్ఞాపకాల గనులూ లేవు
ఇంకా తవ్వే ఆశాలేదు..నేనింతే మారను మారలేను
నా కవితకు ఊపిరి పోసిన దానివి
నా మనసు లోతులు తెలిపిన దానివి
నా చూపులో ఆర్ధ్రత నింపిన దానివి
నా మాటకు మధువును కలిపిన దానివి
నా భాదలను బందీని చేసిన దానివి
నా తలపుకు రంగులు పులిమిన దానివి
నా రాతలొ అర్ధం అద్దిన దానివి
ఈ మాటల గారడి వెనక దాగిన
మర్మం నీకు తెలియదా నేస్తం
మన మాటల ఊసుల తవ్వకాలు
గతం నుంచి వచ్చిన వన్నీ నీకై తెచ్చా
మన మాటల మూటలు ఒక్కోటి విప్పనా
నీవే నాకు సర్వస్వం..నీ ఆదరణ కోసం
చకోర పక్షిలా ఎదురుచూస్తున్నా
ఈ ఏమరపాటులో ఏమైపోతానో తెలియట్లా
నాకిక వేరే జ్ఞాపకాల గనులూ లేవు
ఇంకా తవ్వే ఆశాలేదు..నేనింతే మారను మారలేను
నా కవితకు ఊపిరి పోసిన దానివి
నా మనసు లోతులు తెలిపిన దానివి
నా చూపులో ఆర్ధ్రత నింపిన దానివి
నా మాటకు మధువును కలిపిన దానివి
నా భాదలను బందీని చేసిన దానివి
నా తలపుకు రంగులు పులిమిన దానివి
నా రాతలొ అర్ధం అద్దిన దానివి
ఈ మాటల గారడి వెనక దాగిన
మర్మం నీకు తెలియదా నేస్తం