గత అనుభవాల శిధిలాలనూ,
గతాన్నీ తొక్కి అందంగా నిలిచిన
సౌధాల మధ్యగా..సాగుతూ
అనుబంధాలు అణచి మొలిచిన
అవమానపు వృక్షాల మధ్యగా..
ఆ నీడకు మురిసేదెలా ?
ఈ అందాలను ఆస్వాదించేదెలా ?
ప్రతి మలుపు వేసుకున్న
మేలిమి ముసుగు వెనక
దేనికోసమో వెదికే కళ్ళకు
ఏమి చెప్పను ?
క్రొత్త దారుల్లో..
పాత గుర్తులు దేవుకుంటూ..
నిర్లిప్తంగా..నా పయనం నీకోసం
గతాన్నీ తొక్కి అందంగా నిలిచిన
సౌధాల మధ్యగా..సాగుతూ
అనుబంధాలు అణచి మొలిచిన
అవమానపు వృక్షాల మధ్యగా..
ఆ నీడకు మురిసేదెలా ?
ఈ అందాలను ఆస్వాదించేదెలా ?
ప్రతి మలుపు వేసుకున్న
మేలిమి ముసుగు వెనక
దేనికోసమో వెదికే కళ్ళకు
ఏమి చెప్పను ?
క్రొత్త దారుల్లో..
పాత గుర్తులు దేవుకుంటూ..
నిర్లిప్తంగా..నా పయనం నీకోసం