చీకట్లో నిశ్శబ్దం నా అంతరాత్మ
పాడే విరహ గీతంలా సాగుతోంది
నిట్టూర్పుల వేడి వేదనలా
ఈ సమయంలొ నిమిషాలను కాలం అనే కలంలో
నింపుకొని కవిత్వాన్ని రాస్తూ కనిపించని
నీకై అక్షరాల్లో వెతకాలనే ప్రయత్నం
బాధలొ భావుకత వెతుక్కుంటూ
నవ్వులు పులుముకుని ఆనందం నటిస్తూ
గతాన్ని మింగిన విషాదాన్ని నా ప్రస్తుతంలో
పారబోసి చూసుకోవాలని చూస్తున్నా
వేదనగా వెర్రివాడిలా నీకోసం
ఈ నిశిరాత్రిన నా జ్ఞాపకారణ్యంలో
నన్ను నేను వెతుక్కుంటున్నాను
ఈ రాత్రి నాకు తెల్లారిందో నేనే తెల్లారానో
నాకదే తెలియని నన్ను వేదిస్తున్న ప్రశ్న..
పాడే విరహ గీతంలా సాగుతోంది
నిట్టూర్పుల వేడి వేదనలా
ఈ సమయంలొ నిమిషాలను కాలం అనే కలంలో
నింపుకొని కవిత్వాన్ని రాస్తూ కనిపించని
నీకై అక్షరాల్లో వెతకాలనే ప్రయత్నం
బాధలొ భావుకత వెతుక్కుంటూ
నవ్వులు పులుముకుని ఆనందం నటిస్తూ
గతాన్ని మింగిన విషాదాన్ని నా ప్రస్తుతంలో
పారబోసి చూసుకోవాలని చూస్తున్నా
వేదనగా వెర్రివాడిలా నీకోసం
ఈ నిశిరాత్రిన నా జ్ఞాపకారణ్యంలో
నన్ను నేను వెతుక్కుంటున్నాను
ఈ రాత్రి నాకు తెల్లారిందో నేనే తెల్లారానో
నాకదే తెలియని నన్ను వేదిస్తున్న ప్రశ్న..