మరచిపోదామనుకున్నవేళ జ్ఞాపకంలోనూ నీవే
వద్దని వెళ్లిపోతుంటే నీడవై వెంటాడేదీ నీవే
చేరుదామని పరుగులెడుతున్నవేళ దూరమయ్యేదీ నీవే
అలసిపోయి నే నిలబడితే రారమ్మని పిలిచేదీ నీవే
నాలోని ప్రేమ భావనకు పునాది నీవే
ఆ ప్రేమే నన్ను దహించేస్తుంటే చూస్తూ నవ్వుకునేదీ నీవే
మూగబోయిన నాలోని భావానికి అక్షరరూపం నీవే
అల్లుకున్న అక్షరాలను కవితలుగా ఏర్చి కూర్చిందీ నీవే
నేనంటూ బ్రతికున్నానంటే దానికి కారణం నీవే
ఏనాడైనా నే మరణిస్తానన్నది నిజమైతే దానికీ కారణం నీవే...