ఉషోదయ కాంతుల్లో
భానుడి పసిడి కాంతులలో
నీ అధరాల మృదు పలుకులను
ఆస్వాదించాలనే ఆశ... అడియాసే అయ్యింది
అయినా ఆశతీరక ఎదురు చూస్తూనే ఉన్నా నీకోసం
ఐతేనేం... పున్నమి నాటి వెలుగులలో
నా ప్రేమ మనసు నీకై ఆరాటపడింది...
నాడు వెన్నెల కాంతుల్లో...వెలిగిపోవాలని చూశాను
దూరంగా నడిచి వస్తున్న నిన్ను చూసి మురిసిపోయాను
నా మనసు పండువెన్నెలై ఊయలలూగింది
వెన్నెల దేవతలా కదలి వచ్చి
నను పెనవేసుకున్న ఆ క్షణం...
ప్రపంచం క్షనమాగిపోయింది ప్రియా
నా అణువణువు నీ ప్రేమ స్వర్గంలో ఓలలాడింది...
అప్పటి గుండె రాపిడికి నీవు పెట్టిన పేరు " ప్రేమ రాపిడి"
మళ్లీ ఆ వెన్నెలనాటి కమ్మదనాన్ని అందించవూ...
మళ్లీ నాటి సంధ్యా సమయపు క్షణాల్లో ఎదురుచూస్తూ...