జీవితపు డైరీలోని
నల్లని పేజీల చేదు నిజాలు
నన్ను ముద్దాయిని చేసి
నిలదీసి సంజాయిషీ అడుగుతున్నాయి
అపరాధ భావాలన అంతర్మధనంతో
కన్నీళ్ళతో జరిగిన గతాన్ని తడుపుకొంటూ
మౌనంగా రోధిస్తూ
నాలోని నన్ను శోధిస్తూ
ఒంటరిగా నేనొక్కడినే
నేనొక్కడినే ఒంటరిగా
మనసు గదిలో స్థబ్దతగా ఉన్నా
హృదయాంతరాలలో మాత్రం విస్పొటాలు
ముగింపు లేని ఈ సమస్యల పరంపరలో
శాశ్వత విజయం కోసం ఎదురు చూస్తున్నా
విజయం సాదించలేనని తెల్సీ కూడా
నిరీక్షిస్తున్న క్షతగాత్రడిని
నల్లని పేజీల చేదు నిజాలు
నన్ను ముద్దాయిని చేసి
నిలదీసి సంజాయిషీ అడుగుతున్నాయి
అపరాధ భావాలన అంతర్మధనంతో
కన్నీళ్ళతో జరిగిన గతాన్ని తడుపుకొంటూ
మౌనంగా రోధిస్తూ
నాలోని నన్ను శోధిస్తూ
ఒంటరిగా నేనొక్కడినే
నేనొక్కడినే ఒంటరిగా
మనసు గదిలో స్థబ్దతగా ఉన్నా
హృదయాంతరాలలో మాత్రం విస్పొటాలు
ముగింపు లేని ఈ సమస్యల పరంపరలో
శాశ్వత విజయం కోసం ఎదురు చూస్తున్నా
విజయం సాదించలేనని తెల్సీ కూడా
నిరీక్షిస్తున్న క్షతగాత్రడిని