మెరుపులా మెరిసే సిరివెన్నలవో మరి వెన్నెల పూల పందిరివో
చినుకులా కురిసే చిరు జాబిలివో మరి జాబిలి జాము రాతిరివో
కనులను కొరికిన కోరికవో కునకును తరిమిన కలవో
వలపులు అలికిన వేదికవో వయసులు అడిగిన వేడుకవో
మెరుపులా మెరిసే సిరివెన్నలవో మరి వెన్నెల పూల పల్లకివో
చినుకులా కురిసే చిరు జాబిలివో మరి జాబిలి రేయి జానకివో
you make my heart go తనననన తనననననాన
మెరుపులా మెరిసే సిరివెన్నలవో మరి వెన్నెల పూల పందిరివో
చినుకులా కురిసే చిరు జాబిలివో మరి జాబిలి జాము రాతిరివో
అందానికే అర్దం నువ్వు
ప్రాయానికే ప్రాణం నువ్వు
రూపానికే ఊపిరి నువ్వు నువ్వే.......
హో..ఎదురుపడి పొగడకు నన్నూ
మనసుపడి కలపకు కన్ను
వెనకపడి తడమకు వెన్ను
తిరగపడి తేల్చకు మైకపు మబ్బులలో
మెరుపులా మెరిసే సిరివెన్నలవో మరి వెన్నెల పూల పల్లకివో
చినుకులా కురిసే చిరు జాబిలివో మరి జాబిలి రేయి జానకివో
కుదురుగ నిలవని నడుమును నడిపిన చేతులు చేసెను పుణ్యం
పొదుపుగ చిలిపిగ పెదవిని చిదిమిన పెదవుల జన్మిక ధన్యం
ముద్దులలో చక్కెరలాగ నువ్వు నిద్దురలో చక్కిలిగింత నువ్వు
ఇద్దరిలో ఒక్కరిలాగ నువ్వు వానగా నేడు పొంగే నువ్వు నింగిలో
మెరుపులా మెరిసే సిరి వెన్నెలవో మరి వెన్నెల పూల పల్లకివో
చినుకులా కురిసే చిరు జాబిలివో మరి జాబిలి రేయి జానకివో
కనులను కొరికిన కోరికవో కునుకును తరిమిన కలవో
వలపులు అలికిన వేదికవో వయసులు అడిగిన వేడుకవో
మెరుపులా మెరిసిసే సిరివెన్నెలవో మరి వెన్నెల పూల పందిరివో
చినుకులా కురిసే చిరు జాబిలివో మరి జాబిలి జాము రాతిరివో