ఎక్కడో నీవు కనిపించగానే చల్లటిగాలికి
మేఘ మాల పరుగులు తీస్తుంది
నీ దరిచేరి నీతో ఊసులు చెప్పాలని దాని కోరిక
కాని నల్లటి మేఘాలు ఒక్కసారిగా కమ్ముకున్నాయి
వాటి వెనక తారలూ తళుక్కుమంటున్నాయి
నెలవంక అంత నిండుగా ఉంది ఏంటో
నిజంలాంటి బ్రమలా నిండు పున్నమిలా
ఆకు ఆకు మాట్లాడుకోటానికి చిరుగాలి సాయం చేస్తుంది
చల్లటిగాలికి లయబద్దకంగా చల్లటిగాలికి తలలూపుతున్నాయి
ప్రశాంతత అంతా ఆవరించి ఉంది
మాములుగా అయితే ఈ బాహ్య స్థితి నాలో
ఓ భావ ప్రపంచాన్నే సృష్టిస్తుంది
కానీ ఇప్పుడేంటి?ఇంతలా మారిపోయాయి?
పట్టుకుందామంటే ఒక్క ఆలోచన లేదు
గతకాలపు గాలితాగికిడికి కొట్టుకపోయాయేమో
గడచిన క్షణం ఏం పలికించింది నాలో?
ఈ క్షణం? ఏమీ లేదు
అంతా శూన్యం..నిర్బేద్యం