ఒకో క్షణం,ఒక్కో నిమిషం
జ్ఞాపకాల నిజాలు నన్ను ప్రశ్నిస్తాయి
నా అసహాయతని నిలదీస్తాయి
ఈ అనంత విశ్వంలో
నా అస్థిత్వాన్ని శోధించమంటాయి
నేనేంటో తెలియని నన్ను
నిర్దాక్షిణ్యంగా ఒంటరిని చేస్తున్నాయి
అనుక్షణం నన్నువెంటాడుతూ
నాతో పోరాడతాయి...
నన్ను రక్త సిక్తం చేసి
గాయాల పాలు చేస్తున్నాయి
నే పోరాడలేనని ఎదిరిస్తే
నాకు దూరమై శిక్షిస్తాయి నీ నీజ్ఞాపకాలు
మనసుల జాడ తెలియని వేళల్లో
ఆ ఆనవాళ్ళే ఆసరా అవుతాయి
వచ్చిపోయే పున్నములయినా
అవి పంచే పండు వెన్నెలలైనా
వెంటే నిలిచే నీడలవుతాయి
నిర్బేద్యంగా కనుమరుగవ్వాలని చూస్తున్నాయి
నాలో నుంచి నిన్ను నువ్వు
కోల్పోబోతున్నప్పుడు నేను నీకే తెలియని నీ బందీని
నన్ను నీలో కలుపుకోబోతున్నప్పుడు
నువ్వు అందుకోలేని
అవదుల్లేని దిగంతాల దూరమైపోతున్నాయి
జ్ఞాపకాల నిజాలు నన్ను ప్రశ్నిస్తాయి
నా అసహాయతని నిలదీస్తాయి
ఈ అనంత విశ్వంలో
నా అస్థిత్వాన్ని శోధించమంటాయి
నేనేంటో తెలియని నన్ను
నిర్దాక్షిణ్యంగా ఒంటరిని చేస్తున్నాయి
అనుక్షణం నన్నువెంటాడుతూ
నాతో పోరాడతాయి...
నన్ను రక్త సిక్తం చేసి
గాయాల పాలు చేస్తున్నాయి
నే పోరాడలేనని ఎదిరిస్తే
నాకు దూరమై శిక్షిస్తాయి నీ నీజ్ఞాపకాలు
మనసుల జాడ తెలియని వేళల్లో
ఆ ఆనవాళ్ళే ఆసరా అవుతాయి
వచ్చిపోయే పున్నములయినా
అవి పంచే పండు వెన్నెలలైనా
వెంటే నిలిచే నీడలవుతాయి
నిర్బేద్యంగా కనుమరుగవ్వాలని చూస్తున్నాయి
నాలో నుంచి నిన్ను నువ్వు
కోల్పోబోతున్నప్పుడు నేను నీకే తెలియని నీ బందీని
నన్ను నీలో కలుపుకోబోతున్నప్పుడు
నువ్వు అందుకోలేని
అవదుల్లేని దిగంతాల దూరమైపోతున్నాయి