ఏంటో కొందరు మనుషులు ఎందుకు పరిచయం అవుతారో తెలీదు... ఒక అమ్మా పరిచయం అయిందిమీరు రాసే కవితలు ఎవరికోసం అని అడిగింది ఎవ్వరికోసం కాదు అలా రాస్తుంటాను అన్నాను.. కాదు ఎవరో ఉన్నారు చెప్పకూడదా అని గుచ్చి గుచ్చి అడిగింది అయినా నేను సరిగ్గ రిప్లై ఇవ్వలేదు తను ఎప్పటినుంచో బ్లాగ్ ఫాలో చేస్తాను అని చెప్పింది...ఇది కామన్ డైలాగే అని లైట్ తీసుకున్నా..తరువాత ఫేస్ బుక్ ఫ్రెండ్ అయింది....ప్రతిరోజు నేను ఎప్పుడు ఆన్ లైనుకొస్తానో తెల్సుకొని మరీ చాట్ చేయడం మొదలు పెట్టింది..ఎందుకో ఇదీ కామన్ గా అందరూ అడిగే ప్రశ్నే కాబట్టి పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు..మరోజు చాట్ లో నేను మీగురించి మీపోష్టుల గురించి చాలారోజులుగా తీవ్రంగా ఆలోచించానండీ అంది .. అప్పుడు మనస్సులో అబ్బా అనుకున్నా ఫేస్ బుక్ లో ఏవరో ఫేక్ అబ్బాయి ఎవ్వరో నాతో బానే ఆడుకుంటున్నాడే అనుకున్నా.. అయినా ఎందుకులే అని నీవు అబ్బాయివా అమ్మాయివా అని అడిగా ... ఎందుకా డౌట్ అని ,.. నేను అమ్మాయినే అందమైన అమ్మాయిని అని చెప్పింది .. అంతే అందం గురించి అదీ తాను చాలా అంద గత్తెను టని చెప్పడం చూసీ అమ్మాయో అబ్బాయో తెలీదు ..బాగా ఏగష్ట్రాలు అనుకున్నా మనస్సులో రోజు చాట్ లో ఏదో అడుగుద్ది ...నేనేదో చెబుతా .... అయినా పట్టు వదలక మీలాంటి ప్రేమికుడు కావాలని అమ్మాయి కోరుకుంటుంది అంది అవునా అన్నా... మీమ్మల్ని మిస్ చేసుకున్న అమ్మాయి ఎవరు అనీ అడిగించి.. మళ్ళీ అయినా చెప్పలే..అప్పుడో అమ్మాయి ఇంతకంటే అబిమానం చూపించింది చివరకు ఏమైంది "కోన్ కిస్కా గొట్టం" లా మిగలాల్సి వచ్చింది..నాకెందుకొచ్చిన గొడవని ఏంచెబుతుందో అని ...నా ఫోన్ నెంబర్ కావాలని అడీగించి.. నేను ఇవ్వను మీరెవరో తెలీదు.. అన్నా.. లేది ఇవ్వండి ప్లీజ్ మీతో మాట్లాడాలి అంది..ఇవ్వను అన్నా ఎలా తెల్సుకుందో నేను ఓ ఆదివారం ఫోన్ చేస్తాను మీనెంబర్ దొరికింది అని అంది నాకు షాక్ .. కావాలని అంటుందిలే అని నేను లైట్ గా తోసుకున్నా ... నిజంగానే .. శుక్రవారం చెప్పింది .. ఆదివారం 11 గంటలకు ఫోన్ చేసింది .. చాలా స్వీట్ వాయిస్ ..నిజమా అనిపించింది..చాలా బాగా మాట్లాడింది ... అయినా ఇలాంటి స్నేహాల జోలికి పోకూడదని నిర్నయించుకున్నా ...రోజు మెస్సేజ్ లు అప్పుడప్పుడూ ఫోన్లు చేస్తూనే ఉంది పెద్దగా ఇంటరెష్టుగా మాట్లాడలేదు...ఎందుకో ఓరోజు మీరు ప్రీగా ఉన్నప్పుడు చెప్పండి మీతీ సీరియస్ గా మాట్లాడాలి అంది ఎం చెబుతుందో చూద్దాం అని టైం చెప్పా ఓరోజు సాయంతం ఆరు గంటలకు ఫోన్ చెసింది.నాగురించి చెప్పాలనిఉంది అంది చెప్పడి అన్నా అప్పటికే పెద్దగా ఇంట్రెష్టులేదు...తను చెప్పడం మొదలు పెట్టింది MBA చదువుకున్నా మా ఫాదర్ కు నేను మా అన్నా ఇద్దరమే..మా అమ్మలా నేను చాలా అందంగా ఉంటాను ... నాన్న బాగా సంపాదించారు ఎప్పుడూ బిజి బిజి గా ఉంటారు.... అమ్మా కూడా వచ్చే పోయే వాళ్ళతో బిజి .. ఏదికావాలన్నా ఇస్తారు .. కాదనరు .. అచ్చుతెలుగించి అమ్మాయిలా పెంచారు అమ్మమ్మ వాళ్ళ ప్రభావం ఉంది అందుకే తెలుగుతనం అంటే చాలా ఇష్టం అంది... అవునా అన్నా..కాని నాకు ఏదో లోటుగా ఉంటుంది..కాలేజిలో చాలా మంది ప్రేమలేకలు రాసారు.. డైరెక్టుగా చెప్పారు.. కాని ఎందుకో నాకు ఎవ్వరిమీద మనస్సుపోలేదు..ఎందుకంటే వాళ్ళు నన్ను నన్నుగా కాకుండా నా అందాన్ని ఆస్తిని ప్రేమిస్తున్నారనిపిస్తుంది ఎవ్వరిమాటల్లో నిజాయితీ లేదు... నేను కాలేజికు కార్ లోనే వెలతాను ఎందుకో ఏమో నాకు ఒంటరితనం అంటే ఇష్టం..ఒక్కోసారి రాత్రుల్లు ఒక్కదాన్నే నారూంలో పడూకొని ఆలోచిస్తే ఏం అర్దం అయ్యేది కాదు...మిమ్మల్ని అర్కూట్ లో చూశాను అప్పుడే మీ బ్లాగ్ అడ్రస్ ఇచ్చారు అని చెప్పింది ..అప్పటినుంచి మీ బ్లాగ్ ..బ్లాగ్ లో చూపించే పిచ్చిప్రేమ నాకు మనసుకు నచ్చింది అందుకే ఏన్నోరోజుల తరువాత ఫేస్ బుక్ లో మళ్ళీ ఎంటరై మీతో పరిచయం పెంచుకున్నా అంది..అన్నీ ఉన్నా నేను ఒంటరిగా ఫీల్ అవుతాను . నామనస్సుకు నచ్చిన ఫ్రెండ్ దొరకలేదు అని దాదాపు ఏడ్చినంత పని చేసింది ఎందుకో అప్పుడో మనిషి గుర్తుకొచ్చింది.. ఆమనిషిలా ఇమెకూడా డ్రామా ఆడుతుందా అనిపించి అన్నివింటూన్నా ఏమేమో చెబుతుంది నన్ను నన్ను గా పిచ్చిగా ప్రేమించే మనిషికావాలి అంది ..అయితే నన్నేం చేయమంటావు అన్నా.. మిమ్మల్ని ఓసారి కలవాలి అంది .. అందమైనంది అంటు అమ్మాయి అంటుంది కలవాలి అంటుంది ....ఎక్కడ కలుద్దాం అంటే KBR పార్క్ లో కలుద్దాం అని చెప్పింది ...నీలా నన్ను పిచ్చిగా ఇష్టపడాలి .. నన్ను చూస్తే మాత్రం మీరు నన్ను వదలి పెట్టరు అంది అబ్బా అనుకున్నా అయినా మనసులో ఎక్కడో గుబులు అసలు ఈ అమ్మాయికి ఏం కావాలి ఏమాసించి నాతో స్నేహం చేయాలని అనుకుంటుంది .,... మాటి మాటికి నేను ఒంటర్ని నాకు తోడుకావాలి అది నీవే ఎందుకు కాకూడదు అని చెప్పడం తాను చాలా అందగత్తెను చూస్తే నన్ను ఇష్టపడకుండా ఉండరు అని చెప్పడంతో ఇంటరెష్టు పెరిగింది గత అనుభవాల దృష్ట్యా గుండెదడ పెగిగింది....ఏంటో మనిషి ఇలా ఎందుకౌతాడు అందనికి దాసుడూ అవుతాడా అర్దంకాదు... ఏంటొ అసలేం జరగబోతోంది నీ గతం అక్కరలేదు ..నీవు నన్ను మాత్రమే ఇష్టపడాలి నాగురించి మాత్రమే ఆలోచించాలి ...నన్ను కల్సి నాతో మాట్లాడితే మీరు నన్ను వదలరు అంది ఒక్కోసారి సృతిమించకుండా రాసే సరసమైన కవితలు తనకు చాలా ఇష్టం అంది .. అస్సలు ఈ అమ్మాయికి ఏంకావాలి ఏంటో అంతా గందరగోళం ఈపోష్టు పెట్టే సంగతి తనకు తెల్సు తనే పెట్టమంది ..తన గురించి ఎలా రాస్తానో అని ఎదురు చూస్తాను అంది అందుకే రెండు పార్టులుగా పోష్టు పెట్టమనీ తనే చెప్పింది ...పార్కులో తను కల్సిందా ఏంజరిగిందో తెల్సుకోవాలంటే నెక్స్టుపోష్టు చూడాల్సిందే ఏంటీ మీకే ఇంట టెంక్షన్ గా ఉంటే నేను ఎంత టెంక్షన్ పడి ఉంటాను...అందమైన అమ్మాయి అని అందంగా ఫోన్ లో మాట్లాడీ మరీ కావాలని పార్కుకు రమ్మంటే సో మిగిలిన వివరాలు
Next Post ..Part-2 కోసం వైట్ చేయండి
Next Post ..Part-2 కోసం వైట్ చేయండి