ఊసులు చెప్పిన నీ కళ్ళు,
నన్ను మర్చిపోయాయా..?
మరెందుకు మౌనంగా ఉన్నాయి ?
కోటలు దాటిన మన మాటలు,
ఇపుడు మరణించాయా...?
మరెందుకు ఆ శబ్దతరంగాలు ఆగిపోయాయి
ప్రతి క్షణం మనమద్యి రేగిన అలకలు,
అవీ అలిగాయా? ఎందుకు?
సద్దుకు పోతూ కనుమరుగయ్యాయా ?
సరసాలు సరాగాలు చల్లబడ్డాయి ఎందుకో ?
మనసులో ఊసులు మౌనందాల్చాయి...
దారి తెలియకనా దారి తప్పాయా చెప్పవా..?
"మనం" నుంచి "నీవు" "నేను"
గా ఏందుకు విడిపోయాం
మన మద్యిలో పిచ్చిమొక్కలు
మొలిసాయి అవి అడ్డొస్తున్నాయా..?
వాటిని తెంపేయి అవసరం అయితే
అడ్డంగా నరికేయి..లేదంటే
నేనది చేస్తా ఎవ్వరడ్డొచ్చినా వాళ్ళ
అంతు చూస్తా నేనేంటు చూపిస్తా వాళ్ళకు
నీకు నాకు మద్య ఏమంత దూరం
భావానికి భావుకతకి మద్య సృజనాత్మకతేగా
ఆలోచనకి ఆచరణకి మద్యనున్న దూరమేగా..?
మౌనానికి మాటకి మద్యనున్న దూరం ఎంత
ఆశకి ఆచరనకి మద్యనున్న సంకల్పమేగా..?
ఆచరణకి అహానికి మద్యనున్న అంతరంమేగా..?
బతకటానికి బతికేయటానికి మద్యనున్న అగాధమేగా
మన మద్య ఉన్న ఈ దూరాలన్ని తొలగించవా....
నువ్వు నా కోసం రావా
నువ్వు ఎదురైయ్యే క్షనాల కోసం
ఇంకా ఎన్ని యుగాలు వేచి ఉండాలి...
అది నా మరణానికి ముందా తరువాతా...?
నన్ను మర్చిపోయాయా..?
మరెందుకు మౌనంగా ఉన్నాయి ?
కోటలు దాటిన మన మాటలు,
ఇపుడు మరణించాయా...?
మరెందుకు ఆ శబ్దతరంగాలు ఆగిపోయాయి
ప్రతి క్షణం మనమద్యి రేగిన అలకలు,
అవీ అలిగాయా? ఎందుకు?
సద్దుకు పోతూ కనుమరుగయ్యాయా ?
సరసాలు సరాగాలు చల్లబడ్డాయి ఎందుకో ?
మనసులో ఊసులు మౌనందాల్చాయి...
దారి తెలియకనా దారి తప్పాయా చెప్పవా..?
"మనం" నుంచి "నీవు" "నేను"
గా ఏందుకు విడిపోయాం
మన మద్యిలో పిచ్చిమొక్కలు
మొలిసాయి అవి అడ్డొస్తున్నాయా..?
వాటిని తెంపేయి అవసరం అయితే
అడ్డంగా నరికేయి..లేదంటే
నేనది చేస్తా ఎవ్వరడ్డొచ్చినా వాళ్ళ
అంతు చూస్తా నేనేంటు చూపిస్తా వాళ్ళకు
నీకు నాకు మద్య ఏమంత దూరం
భావానికి భావుకతకి మద్య సృజనాత్మకతేగా
ఆలోచనకి ఆచరణకి మద్యనున్న దూరమేగా..?
మౌనానికి మాటకి మద్యనున్న దూరం ఎంత
ఆశకి ఆచరనకి మద్యనున్న సంకల్పమేగా..?
ఆచరణకి అహానికి మద్యనున్న అంతరంమేగా..?
బతకటానికి బతికేయటానికి మద్యనున్న అగాధమేగా
మన మద్య ఉన్న ఈ దూరాలన్ని తొలగించవా....
నువ్వు నా కోసం రావా
నువ్వు ఎదురైయ్యే క్షనాల కోసం
ఇంకా ఎన్ని యుగాలు వేచి ఉండాలి...
అది నా మరణానికి ముందా తరువాతా...?