నీ కోసం ఆలోచించే ప్రతి నిమిషం
నా మనసు ఊహలను రెక్కలుగా చేసుకొని విహరిస్తుంది
కాని మరుక్షణం కళ్ళు మాత్రం నీకోసం వెతుకుతాయి
ఊహలను చూడలేను నిజాలను తప్ప,అందుకే అది కన్నీరు పెడుతుంది
ఎందరున్నా ఎందుకో నా మనసు నిన్నే కోరుకుంటుంది
నీకై నిరీక్షించే నా కన్నులు, నువ్వు కనబడక
నిరాశతో కన్నీరు కారుస్తోంది ఆవేదనతో
ఆ వెచ్చని కన్నీళ్ళ మాటున ఎంత వేదన దాగిఉందో నీకు తెలియదా?
నేను నీతో మాట్లాడాలంటే, నా మనసు మూగబోతుంది
నువ్వు నాతో మాట్లాడితే, నా మాట మౌనమవుతోంది
నీకు నాకు మధ్య శబ్దం....ఎప్పుడు నిశ్శబ్దమే.....
ఆ నిస్సబ్దాన్ని చేదిస్తావని ఆశతో ఉన్నా
ఇన్నాళ్ళు కాని ఆశ తీరేలా లేదు
కేవలం ఇద్దరి మధ్య ఏదో చిన్న విభేదం మాత్రమే...