ఈ రోజు ఎందుకో.. నిష్కారణంగా
నా కళ్ళు ఒలుకుతున్నాయి
పెదవులు వనుకుతున్నాయి
భావాలన్నీ బందీలుగా మరిపోతున్నాయి
నిజాలన్నీ నీరుగారిపోతున్నాయి
మాటలు మూగబోతున్నాయి
చుట్టూచీకట్లు కమ్ముకుంటున్నాయి
కదిలే కాలం జ్ఞాపకాలను
స్వప్నాలుగా మార్చి కనుల ముందు నిలిపింది
రెప్ప వెనకాల ఉబికిన
నీటి చుక్క నిజాలవేడిని తట్టుకోలేక ఆవిరయ్యింది
నీ మౌనంతో పదునెక్కిన
వలపుల బాకు గాయాన్ని మిగిల్చి మాయమయ్యింది
కలసివున్న క్షణాలను మరిక
కలవమేమోనన్న అనుమానం కరిగించింది
నా కళ్ళు ఒలుకుతున్నాయి
పెదవులు వనుకుతున్నాయి
భావాలన్నీ బందీలుగా మరిపోతున్నాయి
నిజాలన్నీ నీరుగారిపోతున్నాయి
మాటలు మూగబోతున్నాయి
చుట్టూచీకట్లు కమ్ముకుంటున్నాయి
కదిలే కాలం జ్ఞాపకాలను
స్వప్నాలుగా మార్చి కనుల ముందు నిలిపింది
రెప్ప వెనకాల ఉబికిన
నీటి చుక్క నిజాలవేడిని తట్టుకోలేక ఆవిరయ్యింది
నీ మౌనంతో పదునెక్కిన
వలపుల బాకు గాయాన్ని మిగిల్చి మాయమయ్యింది
కలసివున్న క్షణాలను మరిక
కలవమేమోనన్న అనుమానం కరిగించింది