. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, May 7, 2013

ప్రతి నిమిషం నీకోసం ఆలోచిస్తూ వున్నా...ప్రతినిమిషం నీతలపులతో జీవిస్తున్నా

ప్రతి నిమిషం నీకోసం ఆలోచిస్తూ వున్నా...
ప్రతినిమిషం నీతలపులతో జీవిస్తున్నా
ప్రతి రోజు నా స్వప్నంలో నిన్నే చూస్తూ వున్నా...


నీ ఊహే నాకు మాత్రమే  సొంతం
నీవు లేక నేనున్నా ఏకాంతంగా
నేను ఈ లోకాన్ని వీడిన రోజు 

అయిపోయేనా ఏకాంతంగా
కనిపిస్తావో లేదో ఏమో అని 

నీకోసం వెతుకుతు వుంటా
కనిపించిన ఆ క్షణమే 

నన్నే నే మరచిపోతూ వుంటా

నీ చూపే చల్లని "జాబిల్లి"  నీడ

నువ్వుంటే నే సంతోషం
నీ చుట్టే నా నీడ తిరుగుతూ వుంది..
నీవెక్కడ వున్నా అక్కడ 

నాజ్ఞాపకాలుంటాయి చూడు
ఒక్కసారి తరచి చూస్తే తెలుస్తుంది ప్రియా


కలిసుంటావో లేదో ఏమో అని 

నేనెపుడు భయపడుతూ వుంటా
కలిసే ఆ క్షణం కోసం 

ఎన్నాళ్ళైనా ఎదురుచూస్తూ వుంటా
నీ మనసే చల్లని సంద్రం..

వెంటుంటే రాదా నాకు  వసంతం

నా మౌనం మాటలు రాక 

నీవైపే గాలి వీస్తూ వుందే...
నువ్వుంటే ఉల్లాసం.. 

నాకేదొ  తెలియని ఉత్సాహం
నీ ఆలోచనలతోనే 
నేనెప్పుడు తడిచి ముద్దౌతుంటా
కనిపించని నీకోసం నాకళ్ళు తడిబారి..
నామనస్సు నీకోసం 

తపన పడుతూ ఉంటుంది
ఒక్కోసారి అనిపిస్తుంది,,,

ఇలా నీ ఆలోచనలతో
నాకేదో అవుతోంది 

నేనేదో అయిపోతున్నా
నీవు నిజం తెల్సుకొని 

నాకోసం వెతికేప్పటికి
నేను మిగిలిఉండనేమో ప్రియా
నా ఈ అక్షరాలే నీకు 

నా జ్ఞాపకాలుగా మిగిలిపోతాయేమో ప్రియా