ప్రయత్నించినా పెగలని పెదవులు
ఎదో అనుబంధంలా నాగుండె పట్టుకుంటుంది
దొర్లని పదాలు.. దొరకని బాసలు
చిక్కని మబ్బుల్లా.. జారుకుంటాయి...
అంతరాళాల్లో గజిబిజిగా తిరుగుతూ
అల్లిబిల్లిగా అల్లుకున్న మల్లె తీగల్లా..
సౌరభాలతో మతిని చెదర గొడతాయి..
అందుకే గుండె లోతుల్లోని
కొన్ని ఊసులు కళ్ళతో చెపితే
మనసుతో వినాల్సిందే
ఆ ఊసులు నీకు చెప్పరాకే నా మౌనం..
నా మనసును విప్పలేకే ఈ వేదన
నా కళ్ళలోకి చూస్తావు కదూ
నా మనసులోని భావాలు చదువుతావు కదూ
భారంగా సాగుతున్న జీవితానికో దారి చూపుతావా ప్రియా
ఎదో అనుబంధంలా నాగుండె పట్టుకుంటుంది
దొర్లని పదాలు.. దొరకని బాసలు
చిక్కని మబ్బుల్లా.. జారుకుంటాయి...
అంతరాళాల్లో గజిబిజిగా తిరుగుతూ
అల్లిబిల్లిగా అల్లుకున్న మల్లె తీగల్లా..
సౌరభాలతో మతిని చెదర గొడతాయి..
అందుకే గుండె లోతుల్లోని
కొన్ని ఊసులు కళ్ళతో చెపితే
మనసుతో వినాల్సిందే
ఆ ఊసులు నీకు చెప్పరాకే నా మౌనం..
నా మనసును విప్పలేకే ఈ వేదన
నా కళ్ళలోకి చూస్తావు కదూ
నా మనసులోని భావాలు చదువుతావు కదూ
భారంగా సాగుతున్న జీవితానికో దారి చూపుతావా ప్రియా