ప్రియా...
రాతిరైతే ఒంటరవుతానన్న భయం...
నిద్రాదేవి రమ్మని పిలచినా నీజ్ఞాపకాలు నిలువనీయవు
నీ ఊసుల దారాలతో అల్లుకున్న దుప్పటి కప్పుకొని
కలల అలల నురగలపై తేలియాడుతూ
నిన్నే తలస్తూ లేని నీకై ఆకాశం వైపు చూస్తున్నా
ఒక్కో ఆశనూ నీ ముందు కాగితప్పడవను చేసి
నా కన్నీటి కొలనులో విడిచి
కరుణకై ఎదురు చూస్తున్నా...
కరునీంచవని తెలిసీ
కరునించే మనస్సు కోల్పోయావని తెల్సీ
ఈ చీకటి కీచురాళ్ళ ధ్వని మదినావహించి
గతం పేల్చిన అవమానపు దాడుల్లో
నిశ్శబ్ధపు ఆవరణలో ఇంకిపోతున్నా...
ఒక్కమారైనా ఆ శిలాహృదయ పంజరాన్ని బద్ధలుకొట్టి
నా ఈ కన్నీటి పుష్పాన్ని స్వాకరించ రావా ప్రియా...