ఓ చిన్న పొరపాటో తడబాటో
మౌనం ముక్కలై గుచ్చుకుంటుంది....
తీరం చేరనీయని గుండె చప్పుడు
ఆవేదన గా మిగులుతుంది....
ఉబకని కన్నీరు ఎద సంద్రంలో
తుఫాను అలజడి సృష్టిస్తుంది....
మనసులో నిలిచిన జ్ఞాపకాల గోపురం
ఒక్కసారిగా ఒక్కసారిగా ఒరిగి పోయింది ఎందుకో
దిగులుతనం దీపంక్రింద
నీడలా నిర్వేదంగా ఒంటరిగా మిగిలి పోయాను
కాలికింద నేల ఊబిలా
లోలోపలికి ఇంకిపోతుంది
ఇక నేను మిగలనేమో అని
సింబాలిక్ గా ప్రకృతి చెబుతున్నట్టుంది ప్రియా
మౌనం ముక్కలై గుచ్చుకుంటుంది....
తీరం చేరనీయని గుండె చప్పుడు
ఆవేదన గా మిగులుతుంది....
ఉబకని కన్నీరు ఎద సంద్రంలో
తుఫాను అలజడి సృష్టిస్తుంది....
మనసులో నిలిచిన జ్ఞాపకాల గోపురం
ఒక్కసారిగా ఒక్కసారిగా ఒరిగి పోయింది ఎందుకో
దిగులుతనం దీపంక్రింద
నీడలా నిర్వేదంగా ఒంటరిగా మిగిలి పోయాను
కాలికింద నేల ఊబిలా
లోలోపలికి ఇంకిపోతుంది
ఇక నేను మిగలనేమో అని
సింబాలిక్ గా ప్రకృతి చెబుతున్నట్టుంది ప్రియా