నీ గుండెలయలో వెతికితే
జాడ కనిపించలేదెందుకో
మనసు చూపిన దారిలో
అంతా వెతుకుతూనే ఉన్నా ఇప్పటికీ
గుండెలయలో మది
అందియల శబ్దాలు
నన్ను కాసేపుకూడా
నిలువనీయడం లేదు
నా కనుల నీడలో
నీ రూపు చూసుకోనా
కలలు కనే కాలాన్ని
కాసేపు ఆగమననా
కనుల అంచున
జారిన నా కన్నీటి
బొట్టూలో దాగిన
ఆ నిజాన్ని అడుగు
నీ అధరాలతో
జపించే నామమంత్రం
నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది
నన్ను నీ తలపులతో
తనువునంతా తడిమేపేస్తుంది
నా నాసిక పీల్చే శ్వాసలో
బందీఅయిన బావాలన్నీ
చిక్కులు చిక్కులుగా
నన్నేంటో చిద్రం చేస్తున్నాయి
అనురాగ అత్తర్లతో మనసంతా
అల్లుకపోయిన పరిమళాల సాక్షిగా
జాడ కనిపించలేదెందుకో
మనసు చూపిన దారిలో
అంతా వెతుకుతూనే ఉన్నా ఇప్పటికీ
గుండెలయలో మది
అందియల శబ్దాలు
నన్ను కాసేపుకూడా
నిలువనీయడం లేదు
నా కనుల నీడలో
నీ రూపు చూసుకోనా
కలలు కనే కాలాన్ని
కాసేపు ఆగమననా
కనుల అంచున
జారిన నా కన్నీటి
బొట్టూలో దాగిన
ఆ నిజాన్ని అడుగు
నీ అధరాలతో
జపించే నామమంత్రం
నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది
నన్ను నీ తలపులతో
తనువునంతా తడిమేపేస్తుంది
నా నాసిక పీల్చే శ్వాసలో
బందీఅయిన బావాలన్నీ
చిక్కులు చిక్కులుగా
నన్నేంటో చిద్రం చేస్తున్నాయి
అనురాగ అత్తర్లతో మనసంతా
అల్లుకపోయిన పరిమళాల సాక్షిగా