ఒక్కోసారి
ఈ ఏకాంతపు
నదిలో ఈదటం
ఈ ఒంటరితనపు
మనసు వీదిలో నడవటం
నాకు అవసరం అనిపిస్తుంది
తప్పని పరిష్తితుల్లో ..
తప్పదనిపించి
నాలో నేను మదన
పడుతున్న నిజాల సాక్షిగా
ఆనందమా విషాదమా
తెలియని స్థితి
అదో వింత పరి స్థితి..
యదాస్థితికి రాలేక
అవమానాలకు రాలిపోయిన
ఎండుతాకుల్లాంటి జ్ఞాపకాలు
మాటలన్నీ
మూటకట్టుకుని పారిపోతే
ఎద మొత్తం మౌనంలో ఒదిగిపోతే
ఆ నిశ్శబ్దపు ఒడిలో
ఏర్పడే స్థితి…..స్తబ్దత!
శూన్యత కాదు స్తబ్దత..
నా మనసు ఖాలీ చేసావు ..
నేనేంటో తెలియని స్థితిలో
ఈ స్తబ్దతలో.. నిశ్శబ్దంగా
మనస్సు అంతరంగలల్లో
శ్వాసించే
ప్రశ్నలను సంధిస్తుంది..
నిన్ను తలస్తున్న జ్ఞాపకాలు
సమాధానాలను వెతికే పనిలో
మనసును తవ్వి
పొరలను చీల్చుతూ
హృదయాంతరాలకు చేరాక
మనస్సు మూలల్లో
ఎన్నాళ్ళుగానో
నిక్షిప్తమైన
మనిద్దరి జ్ఞాపకాలు
వెలికి వచ్చి నిలదీస్తాయి
ఇగోలకోసం విడీపోయాం కదా
నా మనస్సు వెతుకుతున్నా
కానరాని నీ కోసం
నాలో నేను నీకోసం
నేను తడుముకోని
క్షనం లేదంటే
నమ్ముతావా.. నమ్మవు
అప్పుడు వేరు ...
ఇప్పుడు నీ మనస్సులో
నేనో శత్రువుని .. ప్రపంచంలో
నమ్మగూడని పలుకరించగూడని
మనిషిని మట్టిమనిషిని చేశావు
మట్టీగా ఎప్పటికీ మిగిలిపొమ్మని
ఈ ఏకాంతపు
నదిలో ఈదటం
ఈ ఒంటరితనపు
మనసు వీదిలో నడవటం
నాకు అవసరం అనిపిస్తుంది
తప్పని పరిష్తితుల్లో ..
తప్పదనిపించి
నాలో నేను మదన
పడుతున్న నిజాల సాక్షిగా
ఆనందమా విషాదమా
తెలియని స్థితి
అదో వింత పరి స్థితి..
యదాస్థితికి రాలేక
అవమానాలకు రాలిపోయిన
ఎండుతాకుల్లాంటి జ్ఞాపకాలు
మాటలన్నీ
మూటకట్టుకుని పారిపోతే
ఎద మొత్తం మౌనంలో ఒదిగిపోతే
ఆ నిశ్శబ్దపు ఒడిలో
ఏర్పడే స్థితి…..స్తబ్దత!
శూన్యత కాదు స్తబ్దత..
నా మనసు ఖాలీ చేసావు ..
నేనేంటో తెలియని స్థితిలో
ఈ స్తబ్దతలో.. నిశ్శబ్దంగా
మనస్సు అంతరంగలల్లో
శ్వాసించే
ప్రశ్నలను సంధిస్తుంది..
నిన్ను తలస్తున్న జ్ఞాపకాలు
సమాధానాలను వెతికే పనిలో
మనసును తవ్వి
పొరలను చీల్చుతూ
హృదయాంతరాలకు చేరాక
మనస్సు మూలల్లో
ఎన్నాళ్ళుగానో
నిక్షిప్తమైన
మనిద్దరి జ్ఞాపకాలు
వెలికి వచ్చి నిలదీస్తాయి
ఇగోలకోసం విడీపోయాం కదా
నా మనస్సు వెతుకుతున్నా
కానరాని నీ కోసం
నాలో నేను నీకోసం
నేను తడుముకోని
క్షనం లేదంటే
నమ్ముతావా.. నమ్మవు
అప్పుడు వేరు ...
ఇప్పుడు నీ మనస్సులో
నేనో శత్రువుని .. ప్రపంచంలో
నమ్మగూడని పలుకరించగూడని
మనిషిని మట్టిమనిషిని చేశావు
మట్టీగా ఎప్పటికీ మిగిలిపొమ్మని