ఆశల గూటిలో కనుపాపలు
విశ్రాంతి కోసం ఆవులిస్తున్నప్పుడు
నీ ఏకాంత మందిరంలో
ఉండిపోవాలపోవాలని ఉంది
నా ఆనవాళ్ళ వలయాలు
నన్ను శాసిస్తున్నప్పుడు
హృదయ తంత్రుల మీద
వచ్చి చేరిన నీ పలకరింపు
మూగవోయిన నా మనోఫలకంపై
చెరగని ముద్ర వేసి
ఒంటరి వేదిక మీద
రాత్రంతా మాట్లాడుతూనే ఉంది
ఉహల్లో తప్ప జీవితం గూర్చి
తలపునకు రాని నాకు
నీ చిరునవ్వు
వాస్తవంలో ప్రతిబింబించి
మన మధ్య సందిగ్ధ
వారథిని దాటించిన తీరు
అభిమానమో..
ఆత్మీయతా బంధమో ..
అనురాగమో...
ఏదో తెలియని ఒక స్పర్శ
అలలా తాకి...
అంతుచిక్కని భావమేదో
మనసుల్ని దరిచేర్చి
హృదయాంతరాలలో
అంతరించిపోయిన
నా ఆశయాన్ని
వెలికి తీసింది..
నేస్తం..
ఇది నిజం...
ఈ జన్మకు నేను
నీకై నిరీక్షించే
గుండెను మాత్రమే..
మరో జన్మంటూ ఉంటే..
నిత్యం పరిమళభరితంగా
జీవం పోసుకునే
నీ చేతి పదమునై జన్మిస్తా..
విశ్వమంతా
'నువ్వే నా లోకం'
అని నమ్ముతావో
లేదో సాస్త చెప్పవూ
విశ్రాంతి కోసం ఆవులిస్తున్నప్పుడు
నీ ఏకాంత మందిరంలో
ఉండిపోవాలపోవాలని ఉంది
నా ఆనవాళ్ళ వలయాలు
నన్ను శాసిస్తున్నప్పుడు
హృదయ తంత్రుల మీద
వచ్చి చేరిన నీ పలకరింపు
మూగవోయిన నా మనోఫలకంపై
చెరగని ముద్ర వేసి
ఒంటరి వేదిక మీద
రాత్రంతా మాట్లాడుతూనే ఉంది
ఉహల్లో తప్ప జీవితం గూర్చి
తలపునకు రాని నాకు
నీ చిరునవ్వు
వాస్తవంలో ప్రతిబింబించి
మన మధ్య సందిగ్ధ
వారథిని దాటించిన తీరు
అభిమానమో..
ఆత్మీయతా బంధమో ..
అనురాగమో...
ఏదో తెలియని ఒక స్పర్శ
అలలా తాకి...
అంతుచిక్కని భావమేదో
మనసుల్ని దరిచేర్చి
హృదయాంతరాలలో
అంతరించిపోయిన
నా ఆశయాన్ని
వెలికి తీసింది..
నేస్తం..
ఇది నిజం...
ఈ జన్మకు నేను
నీకై నిరీక్షించే
గుండెను మాత్రమే..
మరో జన్మంటూ ఉంటే..
నిత్యం పరిమళభరితంగా
జీవం పోసుకునే
నీ చేతి పదమునై జన్మిస్తా..
విశ్వమంతా
'నువ్వే నా లోకం'
అని నమ్ముతావో
లేదో సాస్త చెప్పవూ