. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, January 17, 2014

మాకు మనసుంటుంది ...అతివలు ఎందుకు అర్దం చేసుకోరు ( ఆడవాళ్ళు ఆలోచించండీ ప్లీజ్ )


మీకొక్కరికేనా
మనసున్నది ..?
మేమూ మీతో పాటే
పెరిగాం..మీ దేహాలను చూసి
మీ కాటేసే వాలు చూపుల్లోంచి
బయటపడి ..మళ్ళీ బతుకు దారుల్లో
సంచిరిస్తూనే వున్నాం

ఏళ్ళకు ఏళ్ళు గడిచి పోయినవి
కానీ జ్ఞాపకాలు మాత్రం
ఇంకా ఆరి పోకుండా
హృదయాన్ని కాపలా కాస్తున్నాయి ..!!

దిగంతాలకు ఏగినా
దేశాలు దాటి
ప్రయాణం చేసినా
మీ తలపుల్లోనే కదా
మేం తడిసి ముద్దై పోయింది
అవును ..మీ అందాల మకరందం కోసం
మీ వంపు సొంపుల్లో
ఆనందం నింపే ఒడిలో
వాలి పోయేందుకే కదూ
మేం ఇంకా బతికే వున్నది ..?

మీతో పాటే మేం
ఎన్ని రాత్రుల్లో నిదుర లేకుండా
గడిపామో ..తలచుకుంటే
కళ్ళు సముద్రాలవుతాయి
ఆశలు కాలువలై పారుతాయి
కాలపు ప్రవాహంలో
మేం ఆకలి కేకల్లో
అలరారిపోతున్నా
మీరంతా బాగుండాలనే కదా
ఇంకా ఇంకా
శ్రమిస్తూనే వున్నాం
విరామం ఎరుగక
రాలి పోతూనే వున్నాం ..!!

దేహాలు ఒకరి కోసం
మరొకరం కొట్టుకు చస్తున్నప్పుడు
మేం మేముగా
ఎలా ఉండగలం ..?
అవును ..మాకూ కలలున్నవి
అవి తీరకుండానే
తనువులు చాలించిన రోజులు ఎన్నో
మీకు వీడు ... వీడు కాకపోతే మరోకడు
ఎవరో ఒకరు మీకు కావాలి ఆసరాగా
నిన్నే నమ్ముకున్న మాకు మాత్రం
మీ జ్ఞాపకాలే ఆశరా...
మీరు ఓరగా చూస్తే పడని మగాడెవ్వరు
ఊరించి ఉడికించి మాయచేయడం
మీకు సరదా "గేం"
ఆ "గేం" లో మేమంతా పావులం
ఆడుకుంటారు మాతో
మీ వయ్యారాల సుడి గుండాల్లో
మీ లేలేత పెదవుల తలపుల్లో
బతుకులు పారేసుకున్న మగాల్లెందరో ..?

మేమూ మనుషులమే
అన్నీ కోల్పోయి
కుటుంబం కోసం
సభ్య సమాజం కోసం
నిత్యం కోల్పోతూనే వున్నాం
స్వేచ్ఛను ..ఆత్మను ..గౌరవాన్ని
అన్నిటినీ కొవ్వొత్తుల్లా
వెలుగులు పంచుతూనే
మాడిపోతున్నాం..చిరునామా
లేకుండానే నిష్క్రమిస్తున్నం..!!

అవసరమై నప్పుడు
మేం మీకో చేతికర్ర
అన్నీ తీరాక ..రాలిన పువ్వులం
మీ కోసం వేచి వేచి
గుర్తింపునకు నోచుకోని
మానవ మాత్రులం ..మగాళ్ళం
గుప్పెడు గుండెను
ఆడిస్తున్నది ఎవ్వరు
మీరే కదా ..ఇప్పటికైనా
మమ్మల్ని మనుషులుగా
చూస్తే చాలు ..!!