పాకెట్ సైజులో తొంభై ఆరు పేజీలున్న ఈ నవలని చదవడం మంచినీళ్ళ ప్రాయం. సున్నితమైన కథ, పరుగులు పెట్టించే కథనం, పెద్దగా ఇబ్బంది పెట్టని అనువాదం. ముగింపుతోనే కథ ప్రారంభమవుతుంది కాబట్టి ఏమవుతుందో అన్న ఆదుర్దా ఉండదు. అయితేనేం, కథలో లీనమైపోయిన పాఠకుడికి పుస్తకం చదవడం పూర్తైపోయిందన్న విషయం అర్ధం కాడానికి కొంత సమయం పడుతుంది, కచ్చితంగా.
అసలు కధలోకి వద్దాం
'జమీల్యా.' కిర్గిస్తాన్ గిరిజన జీవన సౌందర్యానికి అక్షర రూపం ఈ నవల. కథా కాలం రష్యా-జర్మనీల మధ్య యుద్ధంముమ్మరంగా ఉన్న సమయం. రష్యా యువకులంతా నిర్బంధంగా సైన్యంలోకి తరలింప బడ్డారు. వారిలో కొత్తగా పెళ్ళైన సాదిక్ కూడా ఉన్నాడు. ఒక పేద గిరిజన ముస్లిం కుటుంబానికి చెందిన వాడు సాదిక్. పెద్ద తమ్ముడితో సహా యుద్ధానికి బయలుదేరాడు, తన భార్య జమీల్యాని ఉమ్మడి కుటుంబంలో వదిలి.
సాదిక్ తల్లి, పెద తండ్రి, పెద తల్లి, (తెగ సంప్రదాయం ప్రకారం తన భర్త మరణాంతరం సాదిక్ తల్లి తన బావ గారిని వివాహం చేసుకుంటుంది), తమ్ముడు చిట్టి, చెల్లెలు.. ఇదీ కుటుంబం. చిన్నపిల్లలిద్దరూ బడి ఈడు వాళ్ళు. యుద్ధం కారణంగా బడి మూసేస్తారు. తండ్రి చేతి పని వాడు. మిగిలిన కుటుంబం అంతా ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో గోధుమలు పండిస్తూ ఉంటారు. జమీల్యా చాలా సరదా అయిన యువతి. కష్ట పడి పని చేసే స్వభావం. అయితే, ఎవరిచేతా మాట పడదు. ఆమె ప్రవర్తన ఒక్కోసారి ఉమ్మడి కుటుంబ నియమావళికి విరుద్ధంగా ఉన్నా, ఆమె స్వభావాన్ని అర్ధం చేసుకున్న కుటుంబ సభ్యులంతా దానిని 'చిన్నతనం' గా సరిపెట్టుకుంటారు.
"జమీల్యా మంచి అందంగా ఉండేది. దార్యమైన శరీరం, వొయ్యారం ఒలికే తీరు, బిగుతుగా జంట జడలుగా దువ్వుకున్న తిన్నని బిరుసు జుట్టు. తెల్లని రుమాలును తమాషాగా నుదుటి మీదకి వొక్క రవ్వ ఐమూలగా వచ్చేటట్టు తలపైన చుట్టుకునేదేమో, అది ఆమెకి చక్కగా అమరి ఆమె చామన ఛాయ ముఖానికి వింత విన్నాణం చేకూర్చేది. జమీల్యా నవ్వేటప్పుడు ఆ కారునలుపు వాలు కళ్ళు యవ్వనోత్సుకతతో వెలిగిపోయేవి, ఇక తటాలున ఏ కొంటె గోంగూర పాటో పాడడం మొదలెట్టడంతో ఆ సొంపారు కళ్ళు కన్యాయోగ్యం కాని మెరపులతో తళ్కుమనేవి." ఆంటాడు రచయిత. సహజంగానే ఊళ్ళో ఉన్న కోడెకారు, యుద్ధం నుంచి వచ్చేసిన సైనికుల కళ్ళన్నీ జమీల్యామీదే. అయితే, ఎవర్ని ఎక్కడ ఉంచాలో బాగా తెలిసిన పడతి జమీల్యా.
కుటుంబ సంప్రదాయాలని గౌరవించే సాదిక్ ఏనాడూ భార్యకి ప్రత్యేకంగా ఉత్తరం రాయడు. తల్లిదండ్రులకి రాసిన ఉత్తరం చివర్లో ఆమె క్షేమం తలుస్తూ ఓ వాక్యం మాత్రం రాస్తూ ఉంటాడు. అతడు సైన్యం నుంచి తిరిగి వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆ కుటుంబం. ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో పండించిన గోధుమలని సైనికుల కోసం తరలించేందుకు పక్కనే ఉన్న టౌన్ లోని రైల్వే స్టేషన్ కి తీసుకెళ్ళాల్సిన బాధ్యత జమీల్యా కుటుంబానికి, కాలి గాయంతో సైన్యం నుంచి తిరిగి వచ్చేసిన దనియార్ అనే అనాధ యువకుడికీ అప్పగించ బడుతుంది. జమీల్యాకి సాయంగా చిట్టిని పంపుతుంది ఆమె కుటుంబం. దనియార్ ఏ ప్రత్యేకతా లేనివాడు. అంతర్ముఖుడు. మొదటి రోజు స్టేషన్ కి వెళ్ళిన జమీల్యాకి, అక్కడ తారస పాడిన ఓ సైనికుడి ద్వారా సాదిక్ త్వరలోనే ఊరికి తిరిగి రాబోతున్నట్టు తెలుస్తుంది.

అయితే, జమీల్యా-దనియార్ ల మధ్య మొదలైన ఓ స్పర్ధ అనుకోకుండా పెద్దదై వారిద్దరూ ఒకరినొకరు తెలుసుకోడానికి కారణం అవుతుంది. దీనంతటికీ సాక్ష్యం చిట్టి. తనకి తెలియకుండానే జమీల్యాని మూగగా ప్రేమించే చిట్టి కూడా ఒకానొక దశలో జమీల్యా-దనియార్ లు ఏకమైతే బాగుండునని కోరుకుంటాడు. ఎవరికీ ఎలాంటి ప్రత్యేకతా లేనివాడుగా కనిపించే దనియార్, జమీల్యాకి ఎంతో ప్రత్యేకమైన వాడవుతాడు. వెన్నెల రాత్రుల్లో, టౌన్ నుంచి ఖాళీ బళ్ళతో టౌన్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు దనియార్ పాడే పాటలు ఆమెని యేవో వింతలోకాల్లో విహరింపజేస్తాయి. ఉమ్మడి కుటుంబం, తెగ సంప్రదాయాలు, త్వరలోనే తన భర్త తిరిగి రాబోతున్నాడన్న సంగతీ బాగా తెలిసిన జమీల్యా, ఓ వర్షపు రాత్రి దనియార్ పట్ల తన ప్రేమని ప్రకటిస్తుంది, చిట్టి సాక్షిగా. తర్వాత ఏం జరిగిందన్నది పుస్తకం పూర్తిగ చదవాల్సిందే