మబ్బుల మీద మబ్బులు
నల్లటి అవమానపు
మబ్బులు కమ్ముకు వొస్తున్నాయి.
చీకటి పడుతోంది. ప్రియా,
నన్నొంటరి గా ఈ తలుపు దగ్గర నీకై
నిరీక్షణలతో ఎందుకిట్లా వదిలి వేశావు?
తోడులేణి నీడగా
కాంతి లేని పుంజంలా ఉన్నా నిలా
మధ్యాన్నపు కార్య కలాపంలో
గుంపు తో కలిసి పని చేశాను. కాని
ఒంటరి చీకటి రోజున నీ కోసం
మాత్రమే ఆశ పడతాను.
ఈ ధీర్ఘ వర్ష ఘడియల్ని
ఎట్లా గడిపానో తెలీదు.
ఆకాశంలోని దూరపు గుబులు
వంక చూస్తో కూచున్నాను ఏదో అలజడి
నా హృదయం, శాంతి నెరగని
ఈదురు గాలితో కలిసి
ఏడుస్తో ఇటూ అటూ తిరుగుతోంది..
నినే తలస్తూ నీవు కావాలంటూ
నల్లటి అవమానపు
మబ్బులు కమ్ముకు వొస్తున్నాయి.
చీకటి పడుతోంది. ప్రియా,
నన్నొంటరి గా ఈ తలుపు దగ్గర నీకై
నిరీక్షణలతో ఎందుకిట్లా వదిలి వేశావు?
తోడులేణి నీడగా
కాంతి లేని పుంజంలా ఉన్నా నిలా
మధ్యాన్నపు కార్య కలాపంలో
గుంపు తో కలిసి పని చేశాను. కాని
ఒంటరి చీకటి రోజున నీ కోసం
మాత్రమే ఆశ పడతాను.
ఈ ధీర్ఘ వర్ష ఘడియల్ని
ఎట్లా గడిపానో తెలీదు.
ఆకాశంలోని దూరపు గుబులు
వంక చూస్తో కూచున్నాను ఏదో అలజడి
నా హృదయం, శాంతి నెరగని
ఈదురు గాలితో కలిసి
ఏడుస్తో ఇటూ అటూ తిరుగుతోంది..
నినే తలస్తూ నీవు కావాలంటూ