. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, January 20, 2014

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(33)

1) ఏడ నుండి వస్తామో.. ఎక్కడ గుచ్చుతాయో
నీడ కూడా మిగలకుండా తోడేదీ లేకుండా వీడిపోతాయి జ్ఞాపకాలు


2) చిన్నప్పుడు అమ్మ చందమామ రావో "జాబిల్లి" రావో
అని అందమయిన అబద్దం చెప్పింది అది నిజంకాదని తెలిసొచ్చింది


3) పగిలింది అద్దం కాదు నేను నమ్మిన నిజం
పగిలిన గాజు ముక్కల్లో దాగిన నిజాన్ని వెతుకుతున్నా


4) క్రుళ్ళిన శవాల మధ్య ఉండగలను.
మనసు క్రుళ్ళిన మనుషుల మధ్య ఉండలేను


5) ఒక్కొక్క అక్షరాన్ని రాసుకుంటూ పోతున్నప్పుడు,
ఎవరో నన్ను తడుముతున్నట్లు వింత వింత అనుభూతి..?


6) బోర్లించిన మనసు పుస్తకంలోంచి
జ్ఞాపకాలను దొర్లుతూ నిశ్శబ్ధం రోదిస్తుంది ఎప్పుడూ


7) నాక్కొంచం విషమివ్వవా ప్లీజ్
నీకోసం నిష్క్రమిస్తాను సమాదం లేని జ్ఞాపకంగా మిగిలిపోతాను..?


8) చీకటి దుఃఖాల సుడులమధ్య ఇంకెంతకాలం బ్రతకాలి
లోపల పంగి పొర్లుతున్న నదుల్ని బయటకి ప్రవహించనీయక పోతే ఏమైపోతానో


9) మనసు మూగదైతే కంటి వెనక దారి మూసేస్తూ..
ముందు వెనకలను ఏకం చేస్తూ ఎదురు చూపుల్లో నిజాలు దాగి ఉంటాయిలే


10) నిలువెత్తు సత్యాన్ని నగ్నంగా నిలబెట్టిన
సందేహన్ని సందుల్లో దాచేసి కనుమరుగు చేస్తుంది కనికరంలేని అబద్దం


11) కనీసం ఈ క్షణమయినా నేననుకున్నది జరగనీ
గుండెలు మండుతున్నా మాటలు రాకున్నా ఊపిరందకున్నా మౌనంలో కరగనీ


12) మనసుల్లో దూరాలు పెరిగే కొద్దీ
ఆప్యాయతలు ఫోను తంత్రుల్లో సైతం మూగబోతున్నాయి


13) చెట్ల పచ్చని రంధ్రాల్లోనుంచి జారిపోతున్న చీకటికి
తనువు చాలించిన తుంపర్లు ముత్యాలై మెరుస్తున్నాయి


14) మాటల్లో మౌనాన్ని కూర్చి
ఆలోచనలకు జ్ఞాపకాల అడ్డుకట్టవేశానులే..?


15) జ్ఞాపకాల బరువుతో బరువెక్కిన గుండెకు
కాస్త బారాన్ని తీర్చే దారి ఎక్కడుందో చెప్పవూ Plezeee


16) నానుండి సంతోషాన్ని తీసుకెల్లావు
కనీసం చావునైనా అప్పుగా ఇవ్వవా ప్లీజ్


17) నీ కాలికింద నలిగిన ఎండుటాకుల నిర్లిప్తత
రాత్రంతా గుచ్చుకుంటూనే ఉంది..ఇంకెన్నిరోజులిలా చెప్పవూ


18) తొలి సంధ్యి వస్తుందంటే నీవొస్తావనే ఆశ
మలి సంద్యి చీకట్లో అప్పుడే రోజు గడిచిపోయిందనే నిరాశ


19) జ్ఞాపకపు తునకలు గుచ్చుకొంటూనే ఉన్నాయి
కలల గాజు పెంకుల దాటికి నెత్తురోడుతోన్న గతం సాక్షిగా


20) నా హృదయం బద్దలవుతోంది మనసు గోడే వినపడనంతగా
మదిరపాత్ర ఎప్పుడు చిట్లిందో ఏమో నీ జ్ఞాపకాలు ముత్యాలై తివాచీపై దొర్లాయి


21) కాలమనే కుండకు చిల్లులు పెట్టి
అట్టడుగున పేరుకున్న జ్ఞాపకాలను తోడుకుంటున్నాను


22) నీ ఒంటరితనం పొగోట్టుకోడానికి నన్ను వాడుకొని
నన్నొంటరిని చేసి ఇప్పుడు నన్నాడీపోసుకుంటున్నావెందుకో


23) క్షణం గడిచే సమయంలో మనసుకి యుగం నడుస్తుంది
ప్రతి నిమిషం నీగురించి ఆలోచించినా విసుగంటూ పుట్టనంటుంది ఏంటో ఈ మాయ


24) పైకి కనిపించే నేను నేను కాదు
మనిషిలా అవతల అగ్నిపర్వతం ఇవతల ఇలా నేను


25) గుండె గొంతుకలో నలిగి పోతున్న జ్ఞాపకాలు
నిశ్శబ్ద రాగాలై నన్ను వెక్కిరించి వేదిస్తున్నాయి నీవెక్కడా అని


26) మనసును ఉగ్గపట్టుకుని మదితలపుల్లో నిన్ను దాచుకొని
గొంతు పెగల్చుకుని మాటలు రూపం దాల్చేలోగా కనుమరుగై పోతావు


27) నా హృదయ తంత్రుల మీద వచ్చి చేరిన నీ పలకరింపు.....
మూగవోయిన నా మనోఫలకంపై చెరగని ముద్ర వేసి వేదిస్తుంది


28) గుండె అలజడుల భావాలను ఒడిసి పట్టి...
స్వప్నాల సంచిలో బంధిస్తూ...ఎన్నాళ్ళు కాపలా కాయాలో


29) నీవు నాతో లేని శూన్యాన్ని కవిత్వంతో నింపే ప్రయత్నం చేస్తున్నా
ఎపుడైనా నువ్వు చూడకపోతావా అని కాని ఎందుకో మారింది ఇదే నాకు ఓ వ్యసనంలా


30) నేల పొరలు చీల్చుకుని బయటకు వచ్చే గడ్డిపరక కాదు
నా మనసు పొరలు చీల్చుకుని బయటకు వచ్చే ఈ కవితలకు కారణం నీవే


31) ఏ దైవం రచించింది మనిద్దరి కలహాల కావ్యాన్ని
ఏ దేవత చూపింది నీకు నాకు మద్యి ఈ కర్కశ మార్గాన్ని


32) నీతో గడిన క్షణాలకై వేచివున్నా ఇప్పటికీ
నేగణించే ఆ నాలుగు కాలాలు నరకానికి నకళ్ళు అయ్యాయి


33 ) ఇన్నాళ్ళ మన స్నేహం...ఏమయింది నేస్తం
ఇన్నేళ్ళ మనిద్దరి అనుబంధం అయిందెందుకు శూన్యం


34) ఎవరైనా కాపాడండి ప్లీజ్
తను చేసిన గాయాల నుండి మౌనం రక్తమై కారుతోంది


35 ) నువ్వు నన్ను దాటిపోయే లోపల నాకు నేను
నీ చూపు కోసంపడే అరాటంలో ఎన్నిసార్లు మరణిస్తానో


36) వెన్నెల రాత్రి రాలిపోతూ..పగటిని చిలుకరించి వెల్లిందిలే...?

37) ఒక్క సారిగా ఆగిన నిమిషం..కలలు అన్నీ కన్నీళ్ళుగా మారి
నిజమో అబద్దమో తెలియక నడుస్తూ జ్ఞాపకాలలో పడుతూలేస్తూ వెలుతున్నా


38) మనసుని కొలిమిగా మార్చుకొని
హృదయాన్ని రాతిలా మలచుకొని నేనేం చేస్తున్నానో...?


39) మదిలో గాయాలను జ్ఞాపకాలు తడుముతున్న ప్రతిసారి
నాలో నేను పడుతున్న గుండెలయల శబ్దాలే అక్షరాలై ఇక్కడ పేరుస్తున్నా


40) కష్టాలకు కన్నీళ్ళు తోడైన క్షనాలనే బ్రమలో
నీ మనసే ఓదార్పల్లే మారుతుందనుకుంటే..ఆరని అగ్నిలో తగలబెడుతున్నావు


41) నాలో రేగే ఆలోచనలకు రూపం నీవై మురిపిస్తావు,
గుండెలలోని భాదను రగిలించి నాచిని నాతోనే మండిస్తావు ప్రియా


42) మాటల కందని భావనలేవో నన్నుక్కిరి బిక్కిరి చేస్తూ
మదిని కలవర పెడుతుంటే నిద్దుర రాని కనులలో నీకై కలువరింతలు


43) ఈ చలిలో వణికి పోయే నా దేహాన్ని..
అమాంతం అవమానంతో కప్పేసి జ్ఞాపకాలు గుచ్చేస్తున్నాయి


44) నీకోసం నాకై నేనే పేర్చుకున్న చితిలో తగలబడుతుంటే
నా వెర్రి ప్రేమ చూసి నీ మిత్రులతో కలిసి పగలబడి నవ్వుతున్నావు కదూ...?
 
 
 


45) అభిమానంతో చాచిన నా చేతులను రక్తంతో తడిపావు
భావాలను మోసుకొచ్చిన నా మదిని ముక్కలుగా చేసి ఏం సాదించావో


46) నీలా ఉండాలని ఆ జాబీల్లికి ఎంత ఆశో
పాపం నువ్వే ఒక్కరోజు తనలా మారిపోకూడదూ..?


47) నా కన్నీటి చినుకుల్ని పట్టి తెచ్చాను నేస్తం
నీ మృదువైన వేళ్లను తాకో పాదాలనో చేరి ముత్యాలవుతాయని.


48) నేస్తం నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయింది నువ్వే
ఙ్ఞాపకాలు ముసురుకుని చీకట్లో కూర్చున్నప్పుడు ఓదార్చేది నువ్వే
 
49) నీ మనసుకి చదువు రాదనుకుంటా
నా మనసుని చదవటం రావట్లేదు నిజమే కదూ....?
 
50) స్నేహానికీ ప్రేమకీ మధ్యలో పువ్వులా నువ్వు
చావుకీ బతుక్కీ మధ్యలో నేను సమిదగా మారిన నేను
 
51) నా ఆశనే నేను శ్వాసగా పీల్చినా
నీ కన్నీటి మంట చాలు నా చితికి నిప్పుగా మారిపోతుందేంటో
 
52) నా ఉపిరాడట్లేదు ఇప్పుడు ఎందుకో తెలీదు
ఎక్కడో నీవు భాదపడుతున్నట్టున్నావు ఏమైందో చెప్పవూ
 
53) నాకు నేను అర్థం కాక నన్ను నేను అర్థంచేసుకోలేక
సందేహాల నడుమ కప్పిన దేహంవెనుక భయం భాయంగా నేను
 
54) ఎదురు చూడని ఉదయంలో
ఎదను తాకిన క్షణం ఎదురుపడే జ్ఞాపకం నువ్వు
 
55) ఏకాంతంలో దేనికోసమో దేహాలు ఆరాట పడుతాయి
కాలపు సాగరంలో కలిసిపోయాక .. సొమ్మసిల్లి పోతాయి
 
56) వెన్నెల రాత్రుల్లో వెండి సంతకం
గుండె గొంతుకలో కదలాడే నీ జ్ఞాపకం
 
57) మన కలయిక జ్ఞాపకమై కలల సంచారం చేస్తున్నప్పుడు
మౌన సంభాషన లో మాటలకంటే మౌనమేమేలని అనిపిస్తుంది
 
58) ఓపలేనంత బరువు..తట్టుకోలేనంత చీకటి
ఆపలేనంత పరుగు..చేరలేనంత దూరం..చెప్పలేనంత దిగులు
 
59) వెన్నెళ్ళో తళుకుమంటూ కిటికీ పక్కన
సన్నజాజి తీగ జాలిగా నాకేసే చూస్తుంటుంది
 
60) నువ్వున్న చోటుకి చేరుకోలేనని
తెలిసి కూడా పిచ్చిగా పరుగులు తీస్తుంటాను
 
61) నన్ను వేల సార్లు అవమానంతో హత్య చేసినా
మళ్ళీ మళ్ళీ బ్రతికి అవమానపడి చస్తూనేఉన్నా ఇలా ఎన్నాళ్ళో
 
62) గుండెల్లో అగ్నిపర్వతం నిశ్శబ్దమై పేలుతుంటే
నిశ్శబ్ద అన్ని శబ్దాలను తనలోనే దాచుకొని మౌనంగా రోదిస్తుంది
 
63) రాత్రిని మింగేసిన సూరీడు రాజ్యాలనేలుతుంటే
అలసిన గుండె పాడే రాగం కన్నీటితో ఆలపిస్తే శబ్దం ఎలా వస్తుంది
 
64) కలలు కరిగి ఉప్పొంగిన లావా
హృదయాలయంలో నీ జ్ఞాపకాలతో చల్లబడింది
 
65) తను కావాలంటూ మనసు తడబడుతుంటే
నన్ను కాదన్న తననే చేరాలన్న మనసును ఒంటరి చేసావు.
 
66) నాలోంచి పెకళించిన ఆ అక్షరాలు చూస్తున్నావా
కల్లుండీ చూడలేని గుడ్డివాళ్ళకు ఎలా కనిపిస్తాయి లే కదా..?
 
67) అందరూ ఈ చలిచీకటి రేయిలో హాయిగా నిద్రపోతుంటే
నేనేంటీ నీ "జ్ఞాపకాలతో" నిద్రరాక..నిద్రలేక ఆకాశంవైపు చూస్తూనే ఉన్నా
 
68) నా హృదయాన్ని చాక్లెట్ ముక్కగా చేసి ఇస్తున్నా
తింటావో దాచుకుంటావో నీ ఇష్టం...జాగ్రత్త అలా వదిలేసే చీమలు తినేస్తాయి
 
69) సంతోషాన్ని యిన్ బాక్స్ లో..బాధని అవుట్ బాక్స్ లో చిరునవ్వుని 
సెంట్ చేయి..కోపాన్ని డిలేట్ చేయి మనసుని వైబ్రేట్ చేసి చూడు జీవితం రింగ్ టోన్ అవుతుంది.   
 
70) చేజారిన దాని కోసం బాధ పడుతూ..ఆవేశపడుతూ
అందని దానికై ఆరాటపడుతూ...అందోళన పడితే గతంతిరిగి వస్తుందా
 
71) నీవు పారేసిన అక్షరాలను ఏరుకుంటున్నా
అవన్నాజ్ఞపకాలై నన్ను ఓదారుస్తాయేమో నని చిన్నిఆశ....?
 
72) ఏంటో సమయం జారిపోతుంది
అప్పుడే పడ్డ వాన చినుకులా నాకందకుండా
 
73) నేను నేర్చుకున్న భాషలన్నీ మర్చిపోయానిప్పుడు
నీతో మాట్లాడేందుకు ఒక కొత్త భాషని సృష్టించుకున్నా అదే మౌన భాష
 
74) నామనసు ప్రతిబింబంలో నీవు వేయి సార్లు జవున్మిస్తావు
నను కాదని నీ చూపు మరిలిన అనుక్షణం నేను లక్షసార్లు మరణిస్తూనే ఉన్నాను
 
75) పగిలిన గుండెను ఓదార్చే నేస్తమా...
నాకోసం చూసిన ఎదురుచూపులను తిరిగి నా కివ్వవా