నీవు క్షేమమేనా? ఈ చిన్న వాక్యంలో నా గుండెల్లో నీ క్షేమానికై నా ఆలోచనల తీవ్రత,నా అభిమానం యొక్క ఆర్ధ్రత ఏమాత్రం కనిపించకపోవచ్చు. కానీ ఇంతకంటే గొప్పగా చెప్పటానికి నాకు తెలిసిన భాష చాలటంలేదు. మనసులోని భావాల్ని పూర్తిగా వ్యక్తపరచడానికి మనం తయారుచేసుకున్న భాష చాలదేమో! నా మనస్సులో చెలరేగుతున్న భావాల్ని వ్యక్తీకరించడానికి మాటలు దొరకక మౌనమనే ఉక్కుపాదం క్రింద నలిగి విలవిలలాడుతున్న నా హృదయ వేదన నీకు కాస్తంత ఆసక్తిని కలిగిస్తే.... ఆ అక్షరాల ఆలంబలనలోజరిగే ప్రకంపనలు కాస్తైనా నీకు తెలుస్తాయి
నా గుండె తెరలలో అనుక్షణం చెలరేగుతున్న అలజడి నీతో చెప్పబోయేసరికి అట్టడుగు పొరలను వీడి బయటకు రావటంలేదు. మన్సులోని మాట కళ్ళలో కనిపిస్తుందని అంటారు. నా మనసు చెప్పే గుస గుసలు, చెప్పే ఊసులు నీ వరకు చేరాయో లేదో నాకు తెలియదు. నేను నీతో గడిపే క్షణాలలో ఓ చిరునవ్వు లేదంటే కాస్త మౌనం తప్ప ఏమీ సాధించలేకపోయాను.నీ స్పందన కోసం అనుక్షణం అన్వేషిస్తున్న నాకు నీ మౌనమనే చీకటి నిరంతరం అంతరాయం కలిగిస్తుంది. ఈ అన్వేషణలో చిత్తుగా ఓడిపోయాను. అందుకే ధైర్యం చేసి ముందడుగు వేసి చెబుతున్నా, లయ బద్దమైన నా హృదయస్పందన విను. నేను…నిన్ను…ప్రేమిస్తున్నా. నాకున్న అంతులేని ప్రేమని ఎంతగా చెప్పాలని ప్రయత్నిస్తున్నా ఈ మూడు మాటలు తప్ప ఏమీ స్ఫురించటం లేదు. అయినా ఇంకా ఏదో చెప్పాలనే తపన నన్నింకా వ్రాయమని ముందుకు తోస్తుంది. నీవులేని లోకంలో నేను కోరుకునేది ఏదీ లేదు, చావుని తప్ప. నా ఆశలు,ఆశయాలు,ఆకాంక్షలు అన్నీ నీకై వేచి ఉన్నాయి, నీతో ముడిపడి ఉన్నాయి. కళ్ళముందు అనుక్షణం నీ రూపమే కనిపిస్తుంది. ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా నీ ఆలొచనలే నన్ను వెంటాడుతున్నాయి. ఎవరు పిలిచినా నీవే అనిపిస్తుంది. కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది, ఒక మనసుని మరో మనస్సు ఇంతలా వెంటడుతుందా? వూపిరితీయనీకుండా వుక్కిరిబిక్కిరి చేస్తుందా? నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పగలరు నీవు తప్ప.అందుకే నీ సానుకూల స్పందన కోరుకుంటూ నీవంతే చాలా ఇష్టం అన్న ఈ మాటలన్నీ ఎన్నోసార్లు ఎంతో మంది చెప్పి మాములు మాటలయిపోయాయి. కానీ ప్రతి మనిషి జీవితం విలువయినదే, ప్రతి మనిషి ప్రేమ, అనుభూతులు అమూల్యమైనవే. ఇంకా ఏదో చెప్పాలని వున్నా నీవంతే చాలా ఇష్టం అన్న మాటలు