నిద్ర లేమి లేని కనులతో
ఎర్రబడ్డ నా కన్నుల సాక్షిగా
సూరీడి గోరు వెచ్చటి
దుప్పటిని తొలిగించి
నీలాకాశపు కాన్వాసుపై
ఎర్రటి రంగును చిత్రిస్తున్న
ప్రకృతి చిత్రకారుడి కుంచలో
జాలువారిన
ఈ చిత్రాలను చూస్తూ
ఈ ప్రభాతాన్ని ఆస్వాదిస్తుంటే
ప్రాణవాయువును
కొత్తగా శ్వాసిస్తున్నట్టుంది ….
నిన్నటి రోజున
జనించిన ఆ మధురమైన
ఆ రాగం మూగబోయినా ఎందుకో
నా గుండె గదిలో
ధ్వనిస్తూనే ఉంటుంది
ఆ పుటలు గాలివాటంలో
కొట్టుక పోయిన
మనసు పొరలలో
నీ జ్ఞాపకాలు తచ్చాడుతూ
రెపరెపలాడుతూనే
వుంటాయి ఎప్పుడూ
మరో రోజూ అలసటతో
విశ్రమించే వరకు….
విరామం లేకుండా నన్నొదలవులే
తెగని ఆలోచనల దారానికి
ఎగిరిపడుతున్న నీ ఎదసవ్వడి
మధురమైన నీ ఆలోచనలు
గడియారం ముల్లుల
మధ్య చిక్కుకుపోయింది
ఈ నిశ్శబ్దంలో
నా శబ్దం ఆలకిస్తూ
ఆ స్తబ్దతను
ఆస్వాదిస్తుంటే
మరోమారు
జన్మిస్తున్నట్టుంది…
మరో సారి మరనించినట్టు
ఉంటుంది
ఈ జనన మరణాల మధ్యి
ఊపిరి ఎన్నాల్లు ఉంటుందో మరి
ఎర్రబడ్డ నా కన్నుల సాక్షిగా
సూరీడి గోరు వెచ్చటి
దుప్పటిని తొలిగించి
నీలాకాశపు కాన్వాసుపై
ఎర్రటి రంగును చిత్రిస్తున్న
ప్రకృతి చిత్రకారుడి కుంచలో
జాలువారిన
ఈ చిత్రాలను చూస్తూ
ఈ ప్రభాతాన్ని ఆస్వాదిస్తుంటే
ప్రాణవాయువును
కొత్తగా శ్వాసిస్తున్నట్టుంది ….
నిన్నటి రోజున
జనించిన ఆ మధురమైన
ఆ రాగం మూగబోయినా ఎందుకో
నా గుండె గదిలో
ధ్వనిస్తూనే ఉంటుంది
ఆ పుటలు గాలివాటంలో
కొట్టుక పోయిన
మనసు పొరలలో
నీ జ్ఞాపకాలు తచ్చాడుతూ
రెపరెపలాడుతూనే
వుంటాయి ఎప్పుడూ
మరో రోజూ అలసటతో
విశ్రమించే వరకు….
విరామం లేకుండా నన్నొదలవులే
తెగని ఆలోచనల దారానికి
ఎగిరిపడుతున్న నీ ఎదసవ్వడి
మధురమైన నీ ఆలోచనలు
గడియారం ముల్లుల
మధ్య చిక్కుకుపోయింది
ఈ నిశ్శబ్దంలో
నా శబ్దం ఆలకిస్తూ
ఆ స్తబ్దతను
ఆస్వాదిస్తుంటే
మరోమారు
జన్మిస్తున్నట్టుంది…
మరో సారి మరనించినట్టు
ఉంటుంది
ఈ జనన మరణాల మధ్యి
ఊపిరి ఎన్నాల్లు ఉంటుందో మరి