వాడు
మేకపిల్లల్ని చేరదీసేది
కనికరంతో కాదు
కసాయితనంతో...
వాడు స్వచ్ఛంగా
కనిపించే మలినం
నువ్వు పాడుతున్నపాట
ఒక వేటగాడికోసం
నీ స్వరం విన్నప్పుడల్లా
వాడి నోట్లో
లాలాజల సునామీలు చెలరేగుతుంటాయి
నీ దేహ పరిమళం
ప్రసరించిన ప్రతిసారీ
వాడు నిన్ను
రుచి చూడాలనుకుంటాడు
నీ పరిచయం
పెరుగుతున్నకొద్దీ
నిన్ను బంధించేందుకు
వాడి బాహువులు
బలంగా విస్తరిస్తుంటాయి
నీకు వాడిపై
నమ్మకం పెరుగుతున్నకొద్దీ
సన్నజాజిలాంటి నీపై
వాడికి కన్నెమోజు పెరుగుతూనే వుంటుంది
నువ్వు పడుకున్నప్పుడు
వాడు మెలకువగా వుంటాడు
నువ్వు మెలకువగా వున్నప్పుడు
వాడు నిద్రనటిస్తుంటాడు
నీ లేలేత అవయవాల
సౌందర్య ఛాయాచిత్రాలను
వాడు మెదడులోని చీకటిగదుల్లో
ఎప్పుడు ఆవిష్కరిస్తుంటాడు
నీ పాదాలు
వాడివైపు పడుతుంటే...
వాడు ఇసుక తుఫానులా
చెలరేగుతుంటాడు
వాడి చూపుల
అంతరంగం వెనకాల
కాంతి సంవత్సరాల వేగంతో
బుసలుకొడుతూ...
దూసుకువస్తున్న
ఓ కాలసర్పం వుంది
వాడి చిరునవ్వుల లోతుల్లో
కపటనీతుల
కాలబిలాల లోతులున్నాయి
వాడు కుబుసం విసర్జించేందుకు
సరీసృపంలా
సన్నద్ధం అవుతున్నడంటే...
నువ్వు
వాడికి చేరువగా వెళ్ళావన్నమాట
వాడి ఊహల
ఉద్యానవనంలో ఊరేగుతూ
నీ ఉనికి కోల్పోయి మైమరచిపోకు
ఒక్కసారి... ఒకే ఒక్కసారి
ఆ వేటగాడు
పన్నిన వలలో చిక్కుకున్నవంటే
ఇక దిగంతాలు నినదించే
పొలికేక పెట్టినా
నీ దిక అరణ్యరోదనే
వాడు వేసిన
ఉచ్చు బిగుసుకుందంటే
ఇక ముందుకు పోలేవు
వెనక్కి రాలేవు
వాడు నీ అడుగులకు మడుగులొత్తేది
నిన్ను పడక పైకి విసిరేయడానికే !
నువ్వు చిక్కనప్పుడల్లా
వాడి నెత్తురు మరిగి
ఉత్పాతమౌతుంది
ఇప్పుడు
తప్పకుండా దొరికిపోతావు!
అది వాడి ప్రణాళిక
రచనా నైపుణ్యం
నువ్వు అభిసారికవై
గదిలోకి వెళ్ళగానే
నీ వలపుల తలుపులు తెరుచుకుని
జనారణ్యంలోని గది తలుపులు
మాయగా మూయబడి
బిడియంగా గడియ వేసుకుంటాయి
నువ్వు వెలుగులాంటి చీకట్లో
వస్త్రసన్యాస విన్యాసాలు చేస్తావు
బయట ఉరుములతో కూడిన
జడివాన మొదలవుతుంది
వరుసగా రెండు మూడు
పిడుగులు పడగానే
గది తలుపులు కీడును శృతిచేస్తూ
తెరుచుకుంటాయి
ఆకాశంలోని వానవిల్లు
రంగులు వెలసిపోయి
అంతర్ధానమవుతుంది
అస్తమిస్తున్న సూర్యుడు
పడమట కొండకేసి
తల బాదుకుంటాడు
చిందిన ఆ రుధిర ధారల్ని
గరళసర్పం కోరలు చాచి
నాకుతూ గుటకలు వేస్తుంది.
- మౌనశ్రీ మల్లి
మేకపిల్లల్ని చేరదీసేది
కనికరంతో కాదు
కసాయితనంతో...
వాడు స్వచ్ఛంగా
కనిపించే మలినం
నువ్వు పాడుతున్నపాట
ఒక వేటగాడికోసం
నీ స్వరం విన్నప్పుడల్లా
వాడి నోట్లో
లాలాజల సునామీలు చెలరేగుతుంటాయి
నీ దేహ పరిమళం
ప్రసరించిన ప్రతిసారీ
వాడు నిన్ను
రుచి చూడాలనుకుంటాడు
నీ పరిచయం
పెరుగుతున్నకొద్దీ
నిన్ను బంధించేందుకు
వాడి బాహువులు
బలంగా విస్తరిస్తుంటాయి
నీకు వాడిపై
నమ్మకం పెరుగుతున్నకొద్దీ
సన్నజాజిలాంటి నీపై
వాడికి కన్నెమోజు పెరుగుతూనే వుంటుంది
నువ్వు పడుకున్నప్పుడు
వాడు మెలకువగా వుంటాడు
నువ్వు మెలకువగా వున్నప్పుడు
వాడు నిద్రనటిస్తుంటాడు
నీ లేలేత అవయవాల
సౌందర్య ఛాయాచిత్రాలను
వాడు మెదడులోని చీకటిగదుల్లో
ఎప్పుడు ఆవిష్కరిస్తుంటాడు
నీ పాదాలు
వాడివైపు పడుతుంటే...
వాడు ఇసుక తుఫానులా
చెలరేగుతుంటాడు
వాడి చూపుల
అంతరంగం వెనకాల
కాంతి సంవత్సరాల వేగంతో
బుసలుకొడుతూ...
దూసుకువస్తున్న
ఓ కాలసర్పం వుంది
వాడి చిరునవ్వుల లోతుల్లో
కపటనీతుల
కాలబిలాల లోతులున్నాయి
వాడు కుబుసం విసర్జించేందుకు
సరీసృపంలా
సన్నద్ధం అవుతున్నడంటే...
నువ్వు
వాడికి చేరువగా వెళ్ళావన్నమాట
వాడి ఊహల
ఉద్యానవనంలో ఊరేగుతూ
నీ ఉనికి కోల్పోయి మైమరచిపోకు
ఒక్కసారి... ఒకే ఒక్కసారి
ఆ వేటగాడు
పన్నిన వలలో చిక్కుకున్నవంటే
ఇక దిగంతాలు నినదించే
పొలికేక పెట్టినా
నీ దిక అరణ్యరోదనే
వాడు వేసిన
ఉచ్చు బిగుసుకుందంటే
ఇక ముందుకు పోలేవు
వెనక్కి రాలేవు
వాడు నీ అడుగులకు మడుగులొత్తేది
నిన్ను పడక పైకి విసిరేయడానికే !
నువ్వు చిక్కనప్పుడల్లా
వాడి నెత్తురు మరిగి
ఉత్పాతమౌతుంది
ఇప్పుడు
తప్పకుండా దొరికిపోతావు!
అది వాడి ప్రణాళిక
రచనా నైపుణ్యం
నువ్వు అభిసారికవై
గదిలోకి వెళ్ళగానే
నీ వలపుల తలుపులు తెరుచుకుని
జనారణ్యంలోని గది తలుపులు
మాయగా మూయబడి
బిడియంగా గడియ వేసుకుంటాయి
నువ్వు వెలుగులాంటి చీకట్లో
వస్త్రసన్యాస విన్యాసాలు చేస్తావు
బయట ఉరుములతో కూడిన
జడివాన మొదలవుతుంది
వరుసగా రెండు మూడు
పిడుగులు పడగానే
గది తలుపులు కీడును శృతిచేస్తూ
తెరుచుకుంటాయి
ఆకాశంలోని వానవిల్లు
రంగులు వెలసిపోయి
అంతర్ధానమవుతుంది
అస్తమిస్తున్న సూర్యుడు
పడమట కొండకేసి
తల బాదుకుంటాడు
చిందిన ఆ రుధిర ధారల్ని
గరళసర్పం కోరలు చాచి
నాకుతూ గుటకలు వేస్తుంది.
- మౌనశ్రీ మల్లి