వెలుగుపై చీకటి
దాడి చేస్తున్న వేల
మనసులో విచ్చుకున్న
జ్ఞాపకాల దాడితో
నిశీధి రాత్రిలో కలలు
చీకటి రాత్రుల్లలో ..
"ప్రేమ రాపిడి"లో
నలుగుతున్న మనిద్దరి మద్యా
కోర్కెల రెక్క విచ్చుకుంటున్నాయి
అనంత కోటి నక్షత్రాలు
ఆకాశంలో మెరుస్తూ
మినుగు మినుగు మంటూ
నిన్నడుగుతున్నాయి
వెలుగునంతటినీ
నా పై కురుస్తున్నాయి
నువ్విచ్చే తియ్యటి
ముద్దులకు
నా సర్వస్వాన్నీ
నీకు దాసోహం చేస్తాను
అప్పుడు నీవిచ్చిన ముద్దులు
ఇప్పటికీ నామదిని
అల్లకల్లోలం చేస్తునే ఉన్నాయి ప్రియా
నా గుండెలో
అనంతమైన ప్రేమ ఉంది
ఈ ప్రపంచంలో
ఎవరితోను పంచుకోలేను
మృదువైన నీ శరీరం
నా పక్కనే ఉన్న అనుభూతి
ఆచ్చదనలేని నీ యదపై
నన్ను ఒక్క నిమిషం
అయినా సేదతీరనీయవా
ప్రపంచం లో ఆ నిమిషమే
నేను బ్రతికే కాలం అయినా పర్లేదు
ఆక్షనకాలమే నేను
బ్రతికేది అయినా లెక్కచేయను
ప్రపంచం లో నీవు
తప్ప నాకేమి వద్దు
తక్కినవన్నీ
తుచ్చమైపోతున్న భావన
నీవు గుర్తొచ్చిన
చిమ్మ చీకటి రాత్రుల్లలో
నీ వేడి నిట్టూర్పుల
సెగలు నన్ను చుట్టేస్తున్నాయి
మనిద్దరం వలపు
వానలో తడుస్తున్నాం
మనిద్దరమే ఏకాంతంగా
ఒకరికి ఒకరమై
వందేళ్ళ మన
ఇద్దరి జీవితాన్ని
ఆక్షనం ఆనందిచే
మదురమైన ఘట్టం
నేనెప్పుడూ ఊహించలేదు
మనం స్వర్గాన్ని కనిపెడతామని
ఆరోజు ఒక్కక్షనమైనా చాలు ప్రియా
ఆ క్షనంకోసమే నా ఈ జీవితం
నీకోసం ప్రతి నిసిరాత్రి ఆశగా
ఎదురు చూస్తున్నా
వస్తావుకదూ నన్ను
వెతుక్కుంటూ ...చెప్పవూ