మౌన సాగరం చిలికిస్తావా
మాటల జల్లులు కురిపిస్తావా
మనసు భావం చదవలేవని …..
జీవితపు తొలి అడుగులలోనే
తెలుసుకున్నను
మనసు తెరచి నీముందు
మాటలన్ని మాలగా చేసి
అందించినాను
కలిసి నవ్వుతూ
జీవించాలనుకున్నా ……
కలిసి అడుగులే
చాలనుకున్నవు
మనసు తలుపు మూయలేక…..
నీ తలపులు ఆపలేక ...
చిన్ని ప్రయత్నం
మరోమారు కొత్తగా
పయనం మొదలెడితే …….
మరో కొత్త వింత వేదనని
పరిచయం చేశావు
"చచ్చే వరకు సహిస్తే
ప్రేమిస్తా సహించు“….
అని చెప్పకనే
చేసి చుపిస్తున్నావా????
చచ్చాకే ప్రేమించే మాటైతే…….
ఈ క్షణమే ఆ ప్రేమని పొందటానికి
నా మరణంతో నాకు లభిస్తుందంటే ……
ఆ మరణమైనా నాకు ఆనందమే
ఒంటరితనాన్ని
నేనెంచుకున్ననాడు ……
మన్నించమంటూ నీవన్నా...
మన్నించేందుకు నేను ఉండను
ఆ నిజం నీకు తెల్సినా మౌనంగా ఉంటావు
అంటే జరగాల్సింది జరిగేదీ
నీ ప్రమేయం ప్రకారమే నడుస్తుంది కదూ
నేను ఉన్నా.....
నిన్ను దాచుకుని....
నీలో నిండాలని, నీకోసం
తపించే మనసు అసలే ఉండదు
అదెప్పుడో చచ్చిపోయినా..
బ్రతకలేక.. బ్రతికించలేని
మనిషికోసం వెతికి నిర్వేదంగా
నాలో నేను గా మిగిలిన క్షనాలను ఎన్నని
లెక్కబెట్టుకోను చెప్పు మిగిలినవి అవే
అది ఎన్నిరోజులో తెలీదు..
మాటల జల్లులు కురిపిస్తావా
మనసు భావం చదవలేవని …..
జీవితపు తొలి అడుగులలోనే
తెలుసుకున్నను
మనసు తెరచి నీముందు
మాటలన్ని మాలగా చేసి
అందించినాను
కలిసి నవ్వుతూ
జీవించాలనుకున్నా ……
కలిసి అడుగులే
చాలనుకున్నవు
మనసు తలుపు మూయలేక…..
నీ తలపులు ఆపలేక ...
చిన్ని ప్రయత్నం
మరోమారు కొత్తగా
పయనం మొదలెడితే …….
మరో కొత్త వింత వేదనని
పరిచయం చేశావు
"చచ్చే వరకు సహిస్తే
ప్రేమిస్తా సహించు“….
అని చెప్పకనే
చేసి చుపిస్తున్నావా????
చచ్చాకే ప్రేమించే మాటైతే…….
ఈ క్షణమే ఆ ప్రేమని పొందటానికి
నా మరణంతో నాకు లభిస్తుందంటే ……
ఆ మరణమైనా నాకు ఆనందమే
ఒంటరితనాన్ని
నేనెంచుకున్ననాడు ……
మన్నించమంటూ నీవన్నా...
మన్నించేందుకు నేను ఉండను
ఆ నిజం నీకు తెల్సినా మౌనంగా ఉంటావు
అంటే జరగాల్సింది జరిగేదీ
నీ ప్రమేయం ప్రకారమే నడుస్తుంది కదూ
నేను ఉన్నా.....
నిన్ను దాచుకుని....
నీలో నిండాలని, నీకోసం
తపించే మనసు అసలే ఉండదు
అదెప్పుడో చచ్చిపోయినా..
బ్రతకలేక.. బ్రతికించలేని
మనిషికోసం వెతికి నిర్వేదంగా
నాలో నేను గా మిగిలిన క్షనాలను ఎన్నని
లెక్కబెట్టుకోను చెప్పు మిగిలినవి అవే
అది ఎన్నిరోజులో తెలీదు..