చీకటి రాత్రి ఎర్ర సిరా
వొలికించి నా జీవిత
చరిత్ర రాస్తున్నా
గీతల్లౌ తారుమారైన
నేను కోరిన గతం
నా నుదుటిపై రాస్తున్నాను.
కలాలతో కాదు పిచ్చెక్కి నా కవితలతో
అక్షరాలతో కాదు హాహాకారాలతో
అలుపెరగని పరుగులో అలసిపోయాను
నన్ను నేనుగా
మర్చిపోయాను
ఏ మలుపు మొదట్లోనో
వదిలేసిన ఆశయాల్ని
ఏరుకొని వాటి ఆసరాతో
తిరిగి పరుగు
మొదలుపెడుతున్నా.
నే వెళుతున్నా
ఎప్పుడొస్తానో తెలీదు
మళ్ళీ తిరిగి రావాలని లేదు
నిజాయితీ లేని ప్రపంచం
నీజాయితీ లేని
ప్రేమ లేని జీవితానికి దూరంగా
నన్ను నేను దాటలేని
గజిబిజి బతుకులలో
చిరిగిన నా హృదయాన్ని
కుట్టాల్సి రాకూడదని
కోరుకు౦టున్న దర్జీని నేను.
నాహృదయం అంతా చిరుగులే
అతుకుల బోంతగా
మారించి నా హృదయం
వొలికించి నా జీవిత
చరిత్ర రాస్తున్నా
గీతల్లౌ తారుమారైన
నేను కోరిన గతం
నా నుదుటిపై రాస్తున్నాను.
కలాలతో కాదు పిచ్చెక్కి నా కవితలతో
అక్షరాలతో కాదు హాహాకారాలతో
అలుపెరగని పరుగులో అలసిపోయాను
నన్ను నేనుగా
మర్చిపోయాను
ఏ మలుపు మొదట్లోనో
వదిలేసిన ఆశయాల్ని
ఏరుకొని వాటి ఆసరాతో
తిరిగి పరుగు
మొదలుపెడుతున్నా.
నే వెళుతున్నా
ఎప్పుడొస్తానో తెలీదు
మళ్ళీ తిరిగి రావాలని లేదు
నిజాయితీ లేని ప్రపంచం
నీజాయితీ లేని
ప్రేమ లేని జీవితానికి దూరంగా
నన్ను నేను దాటలేని
గజిబిజి బతుకులలో
చిరిగిన నా హృదయాన్ని
కుట్టాల్సి రాకూడదని
కోరుకు౦టున్న దర్జీని నేను.
నాహృదయం అంతా చిరుగులే
అతుకుల బోంతగా
మారించి నా హృదయం