. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, January 30, 2014

నీ జ్ఞాపకాల్లో నాకో స్థానం కోసం అనుక్షణం పడుతూనే ఉంటాను .

నేను, నాలా , నువ్వు, నీలా 
బ్రమల్లో బ్రతుకుతూ చేదు నిజాలను
మనసులోపలికి కుక్కుతూ 


నా జ్ఞాపకాలలో ఇమిడిపోయిన..
అందమైన ఆకారానివి నీవు
అందమైన  ఆకారం నువ్వైతే.. 
నీ జ్ఞాపకాలలో ఉన్న 

మరో ఆకారం నేను.
జ్ఞాపకం శాశ్వతం కాదు.
 మరపు దాన్ని కబళిస్తుంది..
ఒకరి జ్ఞాపకాలలో ఇంకొకరి
జ్ఞాపకాలు ఉండిపోవాలని..,
మరపుతో.మదిలో 

జరిగే పోరాటాన్ని..
పైకి పించకుందా 

జాగత్త పడుతున్నాం

నీ జ్ఞాపకాల్లో నాకో స్థానం  కోసం
పడుతూనే ఉంటాను

ఏదో ఓ..నాటికి నీవు
నన్నూ... మరచి పోతావని తెలిసినా..
నా ప్రయత్నం ఆపలేకపోతున్నా
ఆ రోజుని...దూరం చేసేందుకు...,
ప్రతి రోజూ...ఇంకొంచెం 

ప్రయత్నిస్తాను..
నా అస్తిత్వం కోసం...ఈ ఆరాటం..

కేవలం నాకోసం..
కేవలం నా మనస్సు 
ఆరాటాన్ని తగ్గిద్దాం అని 
నీవు గుర్తుంచుకుంటావని కాదు
ఒకప్పుడూ ఆ ఆశ వుండేది
ఇప్పుడు పుర్తిగా చచ్చిపోయింది

అయినా పిచ్చి మనసు 
ఎంత చెప్పినా మాట వినదుగా

Wednesday, January 29, 2014

* ఒక వేటగాడి కదలికలు *..- మౌనశ్రీ మల్లిక్‌

వాడు
మేకపిల్లల్ని చేరదీసేది
కనికరంతో కాదు
కసాయితనంతో...

వాడు స్వచ్ఛంగా
కనిపించే మలినం
నువ్వు పాడుతున్నపాట
ఒక వేటగాడికోసం

నీ స్వరం విన్నప్పుడల్లా
వాడి నోట్లో
లాలాజల సునామీలు చెలరేగుతుంటాయి
నీ దేహ పరిమళం
ప్రసరించిన ప్రతిసారీ
వాడు నిన్ను
రుచి చూడాలనుకుంటాడు

నీ పరిచయం
పెరుగుతున్నకొద్దీ
నిన్ను బంధించేందుకు
వాడి బాహువులు
బలంగా విస్తరిస్తుంటాయి

నీకు వాడిపై
నమ్మకం పెరుగుతున్నకొద్దీ
సన్నజాజిలాంటి నీపై
వాడికి కన్నెమోజు పెరుగుతూనే వుంటుంది

నువ్వు పడుకున్నప్పుడు
వాడు మెలకువగా వుంటాడు
నువ్వు మెలకువగా వున్నప్పుడు
వాడు నిద్రనటిస్తుంటాడు

నీ లేలేత అవయవాల
సౌందర్య ఛాయాచిత్రాలను
వాడు మెదడులోని చీకటిగదుల్లో
ఎప్పుడు ఆవిష్కరిస్తుంటాడు

నీ పాదాలు
వాడివైపు పడుతుంటే...
వాడు ఇసుక తుఫానులా
చెలరేగుతుంటాడు

వాడి చూపుల
అంతరంగం వెనకాల
కాంతి సంవత్సరాల వేగంతో
బుసలుకొడుతూ...
దూసుకువస్తున్న
ఓ కాలసర్పం వుంది
వాడి చిరునవ్వుల లోతుల్లో
కపటనీతుల
కాలబిలాల లోతులున్నాయి

వాడు కుబుసం విసర్జించేందుకు
సరీసృపంలా
సన్నద్ధం అవుతున్నడంటే...
నువ్వు
వాడికి చేరువగా వెళ్ళావన్నమాట
వాడి ఊహల
ఉద్యానవనంలో ఊరేగుతూ
నీ ఉనికి కోల్పోయి మైమరచిపోకు
ఒక్కసారి... ఒకే ఒక్కసారి
ఆ వేటగాడు
పన్నిన వలలో చిక్కుకున్నవంటే
ఇక దిగంతాలు నినదించే
పొలికేక పెట్టినా
నీ దిక అరణ్యరోదనే

వాడు వేసిన
ఉచ్చు బిగుసుకుందంటే
ఇక ముందుకు పోలేవు
వెనక్కి రాలేవు
వాడు నీ అడుగులకు మడుగులొత్తేది
నిన్ను పడక పైకి విసిరేయడానికే !

నువ్వు చిక్కనప్పుడల్లా
వాడి నెత్తురు మరిగి
ఉత్పాతమౌతుంది
ఇప్పుడు
తప్పకుండా దొరికిపోతావు!
అది వాడి ప్రణాళిక
రచనా నైపుణ్యం

నువ్వు అభిసారికవై
గదిలోకి వెళ్ళగానే
నీ వలపుల తలుపులు తెరుచుకుని
జనారణ్యంలోని గది తలుపులు
మాయగా మూయబడి
బిడియంగా గడియ వేసుకుంటాయి

నువ్వు వెలుగులాంటి చీకట్లో
వస్త్రసన్యాస విన్యాసాలు చేస్తావు
బయట ఉరుములతో కూడిన
జడివాన మొదలవుతుంది
వరుసగా రెండు మూడు
పిడుగులు పడగానే
గది తలుపులు కీడును శృతిచేస్తూ
తెరుచుకుంటాయి
ఆకాశంలోని వానవిల్లు
రంగులు వెలసిపోయి
అంతర్ధానమవుతుంది

అస్తమిస్తున్న సూర్యుడు
పడమట కొండకేసి
తల బాదుకుంటాడు
చిందిన ఆ రుధిర ధారల్ని
గరళసర్పం కోరలు చాచి
నాకుతూ గుటకలు వేస్తుంది.

- మౌనశ్రీ మల్లి

Monday, January 27, 2014

నా ప్రశ్నకు తప్ప అన్ని ప్రశ్నలకు సమాదానాలుంటాయి

బాధని చూడాలంటే,
కన్నీరే కారాలా,
కళ్ళలో భావం కుడా కావాలా 


మనసు ముక్కలవ్వాలంటే
యుద్ధమే జరగాలా
చిన్న మాట చాలు కదూ 


వేదన చెప్పుకోవాలంటే,
ఏకాంతమే కావాలా,
వినే హృదయం ఎక్కడుందో చెప్పవూ


దుఖం పంచుకోవాలంటే
సంబంధమే కావాలా
బంధం అనుబందమైతే చాలుకదూ 


మనసును ముక్కలు చేయాలంటే
మాటలే మాట్లాడాలా
మౌనం సరిపోదూ

Saturday, January 25, 2014

స్వాతి న్యూస్ లాంచింగ్ ప్రోగ్రాం లో నా కొలీగ్ జ్యోతి తో కల్సి కో యాంకర్ గా నేను


స్వాతి న్యూస్   24  గంటల తెలుగు న్యూస్ చానల్నిన్న అంటే 24 న ఉదయం పదిగంటలకు ప్రారంభం అయింది...ఆ ప్రోగ్రాం లో నా కొలీగ్ జ్యోతి తో కల్సి కో యాంకర్ గా ఆ స్టేజ్ మీద ఉన్నా ఇది నేను ష్టేజ్ పై మొట్టమొదటిగా చేశాను.... మిడియాలో రిపోర్టర్ గా లైవ్ లో పని చేసినా ఇలా ష్టేజ్ మీద మొట్ట మొదటి సారి చేసిన షో..

Note:- వీడియో చివరినుంచి ఎడిటింగ్ విజువల్స్ కట్ అవ్వడంతో చివరి వీడియో మొదటికొచ్చింది అని గమనించగలరు...మార్పు చేసి ఆవీడియో మల్లీ పోష్టు చేస్తాను


Friday, January 24, 2014

స్వాతి న్యూస్ చానల్ ప్రారంబ సభలో కో యాంకర్ గా నేను

ప్రారంభమైన స్వాతి న్యూస్..నా ప్రోగ్రాంలన్నీ కలిపిన ప్రొమో ...Oun Concepts


 స్వాతి న్యూస్ 24 ఉదయం పదిగంటలకు ప్రారంబం అయింది....ఇకనుంచి న్యుస్ ప్రారంబం అవుతాయి....క్రైం డిపార్ట్ మెంట్ హెడ్ గా..భాద్యితలు తీసుకున్న తరువాత.. కొత్తకొత్త ఆలోచనలతో...గతంలోక్రైంరిపోర్టర్ గా నా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు చేరువైయ్యే ప్రొగ్రాంలను డిజైన్ చేయడం జరిగింది నేరస్తులు నేరసామ్రాజ్యాన్ని విస్తరించుకొని అమాకులైన ప్రజలపై మానసికంగా ఆర్దికంగా ... దారుణాలు చేస్తు భయబ్రాంతులను చేస్తున్నారు నేరస్తుడు ఎంతటి వాడైనా ఆనేరా సామ్రాజ్యంగురించి ప్రజలకు చెబుతూ అప్రమత్తంచేయడం..ప్రజలకోసం అహర్నిశలు కష్టపడుతున్నపోలీసుల నిజమైన కష్టాన్ని ప్రజల ముందుంచడం ..చీకటీమాటునదాగి ఉన్న చీకటి రహస్యాలను బట్టబైలు చేయ్యడానిసీక్రెట్ కేమేరాలతో వారి బండారం బైట పెట్టడం ఇది మా భాద్యతగాతీసుకున్నాం మాటలుకాదు చేతల్లో ఉంటుంది అని చెప్పడమేకాదు చేసి చూపించడమే మా లక్ష్య్యిం అది ఈ ప్రొమోలను చూస్తేఅర్దం అవుతుంది..


Thursday, January 23, 2014

అక్కినేని నాగేశ్వరావు గారి ఆఖరి యాత్ర లైవ్ లోచూడండి


 అక్కినేని నాగేశ్వరావు  గారి 
                             ఆఖరి యాత్ర లైవ్ లోచూడండి

ఈ ఒంటరితనపు మనసు వీదిలో నడవటం నాకు అవసరం అనిపిస్తుంది

ఒక్కోసారి 
ఈ ఏకాంతపు  
నదిలో ఈదటం
ఈ ఒంటరితనపు 

మనసు వీదిలో  నడవటం
నాకు అవసరం అనిపిస్తుంది
తప్పని పరిష్తితుల్లో ..

తప్పదనిపించి 
నాలో నేను మదన 
పడుతున్న నిజాల సాక్షిగా 


ఆనందమా విషాదమా 
తెలియని స్థితి
అదో వింత  పరి స్థితి..

యదాస్థితికి రాలేక
 అవమానాలకు రాలిపోయిన 

ఎండుతాకుల్లాంటి జ్ఞాపకాలు
మాటలన్నీ 

మూటకట్టుకుని పారిపోతే
ఎద మొత్తం  మౌనంలో ఒదిగిపోతే
ఆ నిశ్శబ్దపు ఒడిలో 

ఏర్పడే  స్థితి…..స్తబ్దత!
శూన్యత కాదు  స్తబ్దత..

నా మనసు  ఖాలీ చేసావు ..
నేనేంటో తెలియని స్థితిలో  

ఈ స్తబ్దతలో.. నిశ్శబ్దంగా 
మనస్సు అంతరంగలల్లో
శ్వాసించే  

ప్రశ్నలను సంధిస్తుంది..
నిన్ను తలస్తున్న జ్ఞాపకాలు 
సమాధానాలను వెతికే పనిలో
మనసును తవ్వి
పొరలను చీల్చుతూ
హృదయాంతరాలకు చేరాక
మనస్సు మూలల్లో
ఎన్నాళ్ళుగానో  

నిక్షిప్తమైన  
మనిద్దరి జ్ఞాపకాలు
వెలికి వచ్చి నిలదీస్తాయి  

ఇగోలకోసం విడీపోయాం కదా 

నా మనస్సు వెతుకుతున్నా 
కానరాని నీ కోసం
నాలో నేను నీకోసం 

నేను తడుముకోని
క్షనం లేదంటే 

నమ్ముతావా.. నమ్మవు
అప్పుడు వేరు ...

ఇప్పుడు నీ మనస్సులో
నేనో శత్రువుని .. ప్రపంచంలో
నమ్మగూడని పలుకరించగూడని
మనిషిని మట్టిమనిషిని చేశావు
మట్టీగా ఎప్పటికీ మిగిలిపొమ్మని
 

Wednesday, January 22, 2014

ఆక్కినేని నాగేశ్వర్రావు గారి లైఫ్ రియల్ ఇన్సిడెంట్స్...ఆయన మాటల్లోనే 1 t0 10....(మొత్తం 50 )


పార్టు - 1



పార్టు - 2



పార్టు - 3



పార్టు - 4



పార్టు - 5



పార్టు - 6



పార్టు - 7



పార్టు - 8



పార్టు - 9



పార్టు - 10



ఇవి పదే కాదు మొత్తం 49 ఎపిసోడ్లు మీకోసం త్వరలో...

అక్కినేని నాగేశ్వరావు నివాలి లైవ్ లో చూడండి


Akkineni was born in a small village named Venkata Raghava Puram. Though he attained a great place in Film industry and was noticed through out India, he never forgot his native, He organised many medical camps and also provided employment for the people of Raghava puram.
He received many prestigious awards like Dada saheb Phalke award , four filmfare awards,2 AP state awards and one tamilnadu, one Madhyapradesh state award.He was also a cultural ambassador for India and was invited for many countries. He a writer too, and written few books like Nenu Na Jeevitham, Nenu Chusina America, Manasuloni Mata.He was the main person who took initiative to shift the base of Telugu film industry from Madras(Chennai) to Hyderabad.. For that he also established Annapurna Studios after his wife’s name.
Last year he became sick and hospitalized for few days, on Oct 19, 2013 he held a press meet and announced that he was diagnosed with intestinal cancer. He expressed his positive outlook over the disease and said he will fight till the end.
He was debuting his last film Manam in which three generations of his family playing characters in the film. Yesterday night around 2:00am The legendary actor passed away with the disease he had. He was 90 when he expired.
Many people consider ANR’s family for their good health and hospitality they provide. Its really a great loss for Telugu film industry to lose such a great actor. Though he left his soul from body physically, he’ll be alive in our hearts as long as the Telugu film industry is alive..May his soul rest in peace.


Tuesday, January 21, 2014

ఆమె నన్ను వదలి వెళ్ళిపోయింది .....?




ఆమె నన్ను ఒంటరిగా
వదలి వెళ్ళిపోయింది
నన్ను కాదని
నేనిక ఎప్పటికీ నన్ను  వద్దనుకొని
దేవుంతో ఒట్టు పెట్టుకొని మరీ వెల్లి పోయింది
నా ముఖాన మసిపూసుకున్నాను
నన్ను నేను ఎప్పుడూ గుర్తుపట్టకూడదని
ఎదురు పడి నానుంచి వెల్లిన
తనగురించి అడిగితే ఏం చెప్పాలి
గుందేలమీద తన్ని వెల్లిందని చెప్పనా
నాన్ను కాదని మరొకన్ని 
వెతుక్కొని  వెల్లిందని చెప్పనా
 

అప్పుడే వీస్తున్న చల్లగాలి
చెంప పగులగొట్టాను
నన్ను కాదని వెళ్ళిన జ్ఞాపకాలను
నా దగ్గరకు తీసుకరావద్దని
కళ్ళూ ఏరులై పారుతున్నా
ఏంటో తికమక పడుతు నేను
నాకు నేనేం చేస్తున్నానో తెలియనితనంలో
మనసంతా రక్తం తోడేస్తున్నంత భాద
పదునైన రంపంతో
ముక్కలుగా కోస్తున్నంత వేదన

ముక్కలైన నా  జీవితాన్ని
చేతికెత్తుకున్నాను...
పగిలిన అద్దపు ముక్కలైయ్యాయి
పగిలిన అద్దం ముందు  దిగాలుగా నిలబడ్డాను
ఆ అద్దం పగులకముందు ఒక్కడీనే
ఇప్పుడూ ఏంటో ఏన్నో ముక్కలై కనిపిస్తున్నా
ప్రతి ముక్కలో నన్ను
నేను వెక్కిరిస్తున్న నా ప్రతిరూపం

నా మీద నాకే ఆవేశం
నామీద నాకే చిరాకు
నామీద నాకే అసహ్యం పుడుతోంది
ఇది జరిగి సంస్తరాలు గడచినా
ఇంకా నన్ను వీడని పాత జ్ఞాపకాలు
నేను ఇక్కడ వంటరిగా తను మరొకరి జంటగా
ఆనందంగా నేనెవరో తెలీనంత
ఆనందంగా ఉందితనిప్పుడు 
నన్ను గుర్తుపట్టే పరిస్తితుల్లో లేదు

నేనెప్పుడూ తనకు కనపడకుడాదని
అన్ని దారులూ మూసేసింది
అన్నిటిలో బ్లాక్ చేసీంది
నా ఊసే తనకు తెలియకూడదంటూ
నేనెవరో తనకు గుర్తుకు రాకూడదంటూ 

తనను ఎవరో మాయచేస్తున్నారు
తన్ను నమ్మించి మోసం చేస్తున్నారు
తనెదురుగా పొగుడుతూ తను లేనప్పుడు
బజారు మనిషితో  పోలుస్తున్నారు
నేనెల్లి హెచ్చరిద్దాం అనుకుంటే
తను సంతోషానికి అడ్డు తగులుతున్న అంది
నన్నోటరిగా వదలి వెల్లీ జీవితంలో
మళ్ళీ కనిపించకూడాదని హేచ్చరించి మరీ వెళ్ళీంది



చంపేస్తా అలా తనను అన్న ప్రతి
ఒక్కడీని ముక్కలు ముక్కలుగా నరికేస్తా
ఆనా కొడుకులను
కన్న అమ్మా అబ్బ సిగ్గుపడేలా
వాళ్ళూ చేసిన దారుణాలను
 ప్రపంచానికి చూపిస్తా
వీడా "చీ" అని "చీ" కొట్టేలా ,,
వాడికి తెల్సిన వాళ్ళందరూ ఉమ్మేసేలా
నిజాలను వాళ్ళందరిముందు
పెడతా నరకం చూపిస్తా నాకొడుకులకు 


నాలోనేను లేనన్నది ప్రశ్న
నేనిక తనకు లేనన్న 
తనకోరిక కాదనలేక నేను
గుర్తు పట్టని శవంగా మారాను
నాలో నేను చనిపోయిన  రొజు
అక్కునచేర్చుకుని రోదించేదెట్లా?
ఆమె వెళ్ళిపోయిన రోజు
నా ముఖాన మసిపూసుకున్నాను
మళ్ళి నాకు నేను కనిపించకూడదని
నన్ను నేను ఎప్పటికీ గుర్తు పట్టకూడదని







ఒంటరి చీకటి రోజున నీ కోసం మాత్రమే ఆశ పడతాను.

మబ్బుల మీద మబ్బులు
నల్లటి అవమానపు

మబ్బులు కమ్ముకు వొస్తున్నాయి.
చీకటి పడుతోంది. ప్రియా,
నన్నొంటరి గా ఈ తలుపు దగ్గర నీకై
నిరీక్షణలతో ఎందుకిట్లా వదిలి వేశావు?
తోడులేణి నీడగా
కాంతి లేని పుంజంలా ఉన్నా నిలా 


మధ్యాన్నపు కార్య కలాపంలో
గుంపు తో కలిసి పని చేశాను. కాని
ఒంటరి చీకటి రోజున నీ కోసం 

మాత్రమే ఆశ పడతాను.
ఈ ధీర్ఘ వర్ష ఘడియల్ని 

ఎట్లా గడిపానో  తెలీదు.

ఆకాశంలోని దూరపు గుబులు
వంక చూస్తో కూచున్నాను ఏదో అలజడి
నా హృదయం, శాంతి నెరగని 

ఈదురు గాలితో కలిసి
ఏడుస్తో ఇటూ అటూ తిరుగుతోంది..
నినే తలస్తూ నీవు కావాలంటూ

Monday, January 20, 2014

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(33)

1) ఏడ నుండి వస్తామో.. ఎక్కడ గుచ్చుతాయో
నీడ కూడా మిగలకుండా తోడేదీ లేకుండా వీడిపోతాయి జ్ఞాపకాలు


2) చిన్నప్పుడు అమ్మ చందమామ రావో "జాబిల్లి" రావో
అని అందమయిన అబద్దం చెప్పింది అది నిజంకాదని తెలిసొచ్చింది


3) పగిలింది అద్దం కాదు నేను నమ్మిన నిజం
పగిలిన గాజు ముక్కల్లో దాగిన నిజాన్ని వెతుకుతున్నా


4) క్రుళ్ళిన శవాల మధ్య ఉండగలను.
మనసు క్రుళ్ళిన మనుషుల మధ్య ఉండలేను


5) ఒక్కొక్క అక్షరాన్ని రాసుకుంటూ పోతున్నప్పుడు,
ఎవరో నన్ను తడుముతున్నట్లు వింత వింత అనుభూతి..?


6) బోర్లించిన మనసు పుస్తకంలోంచి
జ్ఞాపకాలను దొర్లుతూ నిశ్శబ్ధం రోదిస్తుంది ఎప్పుడూ


7) నాక్కొంచం విషమివ్వవా ప్లీజ్
నీకోసం నిష్క్రమిస్తాను సమాదం లేని జ్ఞాపకంగా మిగిలిపోతాను..?


8) చీకటి దుఃఖాల సుడులమధ్య ఇంకెంతకాలం బ్రతకాలి
లోపల పంగి పొర్లుతున్న నదుల్ని బయటకి ప్రవహించనీయక పోతే ఏమైపోతానో


9) మనసు మూగదైతే కంటి వెనక దారి మూసేస్తూ..
ముందు వెనకలను ఏకం చేస్తూ ఎదురు చూపుల్లో నిజాలు దాగి ఉంటాయిలే


10) నిలువెత్తు సత్యాన్ని నగ్నంగా నిలబెట్టిన
సందేహన్ని సందుల్లో దాచేసి కనుమరుగు చేస్తుంది కనికరంలేని అబద్దం


11) కనీసం ఈ క్షణమయినా నేననుకున్నది జరగనీ
గుండెలు మండుతున్నా మాటలు రాకున్నా ఊపిరందకున్నా మౌనంలో కరగనీ


12) మనసుల్లో దూరాలు పెరిగే కొద్దీ
ఆప్యాయతలు ఫోను తంత్రుల్లో సైతం మూగబోతున్నాయి


13) చెట్ల పచ్చని రంధ్రాల్లోనుంచి జారిపోతున్న చీకటికి
తనువు చాలించిన తుంపర్లు ముత్యాలై మెరుస్తున్నాయి


14) మాటల్లో మౌనాన్ని కూర్చి
ఆలోచనలకు జ్ఞాపకాల అడ్డుకట్టవేశానులే..?


15) జ్ఞాపకాల బరువుతో బరువెక్కిన గుండెకు
కాస్త బారాన్ని తీర్చే దారి ఎక్కడుందో చెప్పవూ Plezeee


16) నానుండి సంతోషాన్ని తీసుకెల్లావు
కనీసం చావునైనా అప్పుగా ఇవ్వవా ప్లీజ్


17) నీ కాలికింద నలిగిన ఎండుటాకుల నిర్లిప్తత
రాత్రంతా గుచ్చుకుంటూనే ఉంది..ఇంకెన్నిరోజులిలా చెప్పవూ


18) తొలి సంధ్యి వస్తుందంటే నీవొస్తావనే ఆశ
మలి సంద్యి చీకట్లో అప్పుడే రోజు గడిచిపోయిందనే నిరాశ


19) జ్ఞాపకపు తునకలు గుచ్చుకొంటూనే ఉన్నాయి
కలల గాజు పెంకుల దాటికి నెత్తురోడుతోన్న గతం సాక్షిగా


20) నా హృదయం బద్దలవుతోంది మనసు గోడే వినపడనంతగా
మదిరపాత్ర ఎప్పుడు చిట్లిందో ఏమో నీ జ్ఞాపకాలు ముత్యాలై తివాచీపై దొర్లాయి


21) కాలమనే కుండకు చిల్లులు పెట్టి
అట్టడుగున పేరుకున్న జ్ఞాపకాలను తోడుకుంటున్నాను


22) నీ ఒంటరితనం పొగోట్టుకోడానికి నన్ను వాడుకొని
నన్నొంటరిని చేసి ఇప్పుడు నన్నాడీపోసుకుంటున్నావెందుకో


23) క్షణం గడిచే సమయంలో మనసుకి యుగం నడుస్తుంది
ప్రతి నిమిషం నీగురించి ఆలోచించినా విసుగంటూ పుట్టనంటుంది ఏంటో ఈ మాయ


24) పైకి కనిపించే నేను నేను కాదు
మనిషిలా అవతల అగ్నిపర్వతం ఇవతల ఇలా నేను


25) గుండె గొంతుకలో నలిగి పోతున్న జ్ఞాపకాలు
నిశ్శబ్ద రాగాలై నన్ను వెక్కిరించి వేదిస్తున్నాయి నీవెక్కడా అని


26) మనసును ఉగ్గపట్టుకుని మదితలపుల్లో నిన్ను దాచుకొని
గొంతు పెగల్చుకుని మాటలు రూపం దాల్చేలోగా కనుమరుగై పోతావు


27) నా హృదయ తంత్రుల మీద వచ్చి చేరిన నీ పలకరింపు.....
మూగవోయిన నా మనోఫలకంపై చెరగని ముద్ర వేసి వేదిస్తుంది


28) గుండె అలజడుల భావాలను ఒడిసి పట్టి...
స్వప్నాల సంచిలో బంధిస్తూ...ఎన్నాళ్ళు కాపలా కాయాలో


29) నీవు నాతో లేని శూన్యాన్ని కవిత్వంతో నింపే ప్రయత్నం చేస్తున్నా
ఎపుడైనా నువ్వు చూడకపోతావా అని కాని ఎందుకో మారింది ఇదే నాకు ఓ వ్యసనంలా


30) నేల పొరలు చీల్చుకుని బయటకు వచ్చే గడ్డిపరక కాదు
నా మనసు పొరలు చీల్చుకుని బయటకు వచ్చే ఈ కవితలకు కారణం నీవే


31) ఏ దైవం రచించింది మనిద్దరి కలహాల కావ్యాన్ని
ఏ దేవత చూపింది నీకు నాకు మద్యి ఈ కర్కశ మార్గాన్ని


32) నీతో గడిన క్షణాలకై వేచివున్నా ఇప్పటికీ
నేగణించే ఆ నాలుగు కాలాలు నరకానికి నకళ్ళు అయ్యాయి


33 ) ఇన్నాళ్ళ మన స్నేహం...ఏమయింది నేస్తం
ఇన్నేళ్ళ మనిద్దరి అనుబంధం అయిందెందుకు శూన్యం


34) ఎవరైనా కాపాడండి ప్లీజ్
తను చేసిన గాయాల నుండి మౌనం రక్తమై కారుతోంది


35 ) నువ్వు నన్ను దాటిపోయే లోపల నాకు నేను
నీ చూపు కోసంపడే అరాటంలో ఎన్నిసార్లు మరణిస్తానో


36) వెన్నెల రాత్రి రాలిపోతూ..పగటిని చిలుకరించి వెల్లిందిలే...?

37) ఒక్క సారిగా ఆగిన నిమిషం..కలలు అన్నీ కన్నీళ్ళుగా మారి
నిజమో అబద్దమో తెలియక నడుస్తూ జ్ఞాపకాలలో పడుతూలేస్తూ వెలుతున్నా


38) మనసుని కొలిమిగా మార్చుకొని
హృదయాన్ని రాతిలా మలచుకొని నేనేం చేస్తున్నానో...?


39) మదిలో గాయాలను జ్ఞాపకాలు తడుముతున్న ప్రతిసారి
నాలో నేను పడుతున్న గుండెలయల శబ్దాలే అక్షరాలై ఇక్కడ పేరుస్తున్నా


40) కష్టాలకు కన్నీళ్ళు తోడైన క్షనాలనే బ్రమలో
నీ మనసే ఓదార్పల్లే మారుతుందనుకుంటే..ఆరని అగ్నిలో తగలబెడుతున్నావు


41) నాలో రేగే ఆలోచనలకు రూపం నీవై మురిపిస్తావు,
గుండెలలోని భాదను రగిలించి నాచిని నాతోనే మండిస్తావు ప్రియా


42) మాటల కందని భావనలేవో నన్నుక్కిరి బిక్కిరి చేస్తూ
మదిని కలవర పెడుతుంటే నిద్దుర రాని కనులలో నీకై కలువరింతలు


43) ఈ చలిలో వణికి పోయే నా దేహాన్ని..
అమాంతం అవమానంతో కప్పేసి జ్ఞాపకాలు గుచ్చేస్తున్నాయి


44) నీకోసం నాకై నేనే పేర్చుకున్న చితిలో తగలబడుతుంటే
నా వెర్రి ప్రేమ చూసి నీ మిత్రులతో కలిసి పగలబడి నవ్వుతున్నావు కదూ...?
 
 
 


45) అభిమానంతో చాచిన నా చేతులను రక్తంతో తడిపావు
భావాలను మోసుకొచ్చిన నా మదిని ముక్కలుగా చేసి ఏం సాదించావో


46) నీలా ఉండాలని ఆ జాబీల్లికి ఎంత ఆశో
పాపం నువ్వే ఒక్కరోజు తనలా మారిపోకూడదూ..?


47) నా కన్నీటి చినుకుల్ని పట్టి తెచ్చాను నేస్తం
నీ మృదువైన వేళ్లను తాకో పాదాలనో చేరి ముత్యాలవుతాయని.


48) నేస్తం నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయింది నువ్వే
ఙ్ఞాపకాలు ముసురుకుని చీకట్లో కూర్చున్నప్పుడు ఓదార్చేది నువ్వే
 
49) నీ మనసుకి చదువు రాదనుకుంటా
నా మనసుని చదవటం రావట్లేదు నిజమే కదూ....?
 
50) స్నేహానికీ ప్రేమకీ మధ్యలో పువ్వులా నువ్వు
చావుకీ బతుక్కీ మధ్యలో నేను సమిదగా మారిన నేను
 
51) నా ఆశనే నేను శ్వాసగా పీల్చినా
నీ కన్నీటి మంట చాలు నా చితికి నిప్పుగా మారిపోతుందేంటో
 
52) నా ఉపిరాడట్లేదు ఇప్పుడు ఎందుకో తెలీదు
ఎక్కడో నీవు భాదపడుతున్నట్టున్నావు ఏమైందో చెప్పవూ
 
53) నాకు నేను అర్థం కాక నన్ను నేను అర్థంచేసుకోలేక
సందేహాల నడుమ కప్పిన దేహంవెనుక భయం భాయంగా నేను
 
54) ఎదురు చూడని ఉదయంలో
ఎదను తాకిన క్షణం ఎదురుపడే జ్ఞాపకం నువ్వు
 
55) ఏకాంతంలో దేనికోసమో దేహాలు ఆరాట పడుతాయి
కాలపు సాగరంలో కలిసిపోయాక .. సొమ్మసిల్లి పోతాయి
 
56) వెన్నెల రాత్రుల్లో వెండి సంతకం
గుండె గొంతుకలో కదలాడే నీ జ్ఞాపకం
 
57) మన కలయిక జ్ఞాపకమై కలల సంచారం చేస్తున్నప్పుడు
మౌన సంభాషన లో మాటలకంటే మౌనమేమేలని అనిపిస్తుంది
 
58) ఓపలేనంత బరువు..తట్టుకోలేనంత చీకటి
ఆపలేనంత పరుగు..చేరలేనంత దూరం..చెప్పలేనంత దిగులు
 
59) వెన్నెళ్ళో తళుకుమంటూ కిటికీ పక్కన
సన్నజాజి తీగ జాలిగా నాకేసే చూస్తుంటుంది
 
60) నువ్వున్న చోటుకి చేరుకోలేనని
తెలిసి కూడా పిచ్చిగా పరుగులు తీస్తుంటాను
 
61) నన్ను వేల సార్లు అవమానంతో హత్య చేసినా
మళ్ళీ మళ్ళీ బ్రతికి అవమానపడి చస్తూనేఉన్నా ఇలా ఎన్నాళ్ళో
 
62) గుండెల్లో అగ్నిపర్వతం నిశ్శబ్దమై పేలుతుంటే
నిశ్శబ్ద అన్ని శబ్దాలను తనలోనే దాచుకొని మౌనంగా రోదిస్తుంది
 
63) రాత్రిని మింగేసిన సూరీడు రాజ్యాలనేలుతుంటే
అలసిన గుండె పాడే రాగం కన్నీటితో ఆలపిస్తే శబ్దం ఎలా వస్తుంది
 
64) కలలు కరిగి ఉప్పొంగిన లావా
హృదయాలయంలో నీ జ్ఞాపకాలతో చల్లబడింది
 
65) తను కావాలంటూ మనసు తడబడుతుంటే
నన్ను కాదన్న తననే చేరాలన్న మనసును ఒంటరి చేసావు.
 
66) నాలోంచి పెకళించిన ఆ అక్షరాలు చూస్తున్నావా
కల్లుండీ చూడలేని గుడ్డివాళ్ళకు ఎలా కనిపిస్తాయి లే కదా..?
 
67) అందరూ ఈ చలిచీకటి రేయిలో హాయిగా నిద్రపోతుంటే
నేనేంటీ నీ "జ్ఞాపకాలతో" నిద్రరాక..నిద్రలేక ఆకాశంవైపు చూస్తూనే ఉన్నా
 
68) నా హృదయాన్ని చాక్లెట్ ముక్కగా చేసి ఇస్తున్నా
తింటావో దాచుకుంటావో నీ ఇష్టం...జాగ్రత్త అలా వదిలేసే చీమలు తినేస్తాయి
 
69) సంతోషాన్ని యిన్ బాక్స్ లో..బాధని అవుట్ బాక్స్ లో చిరునవ్వుని 
సెంట్ చేయి..కోపాన్ని డిలేట్ చేయి మనసుని వైబ్రేట్ చేసి చూడు జీవితం రింగ్ టోన్ అవుతుంది.   
 
70) చేజారిన దాని కోసం బాధ పడుతూ..ఆవేశపడుతూ
అందని దానికై ఆరాటపడుతూ...అందోళన పడితే గతంతిరిగి వస్తుందా
 
71) నీవు పారేసిన అక్షరాలను ఏరుకుంటున్నా
అవన్నాజ్ఞపకాలై నన్ను ఓదారుస్తాయేమో నని చిన్నిఆశ....?
 
72) ఏంటో సమయం జారిపోతుంది
అప్పుడే పడ్డ వాన చినుకులా నాకందకుండా
 
73) నేను నేర్చుకున్న భాషలన్నీ మర్చిపోయానిప్పుడు
నీతో మాట్లాడేందుకు ఒక కొత్త భాషని సృష్టించుకున్నా అదే మౌన భాష
 
74) నామనసు ప్రతిబింబంలో నీవు వేయి సార్లు జవున్మిస్తావు
నను కాదని నీ చూపు మరిలిన అనుక్షణం నేను లక్షసార్లు మరణిస్తూనే ఉన్నాను
 
75) పగిలిన గుండెను ఓదార్చే నేస్తమా...
నాకోసం చూసిన ఎదురుచూపులను తిరిగి నా కివ్వవా