. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, October 6, 2013

ఓ అమ్మాయి ఆత్మహోష..మరపురాని జ్ఞాపకం ( its a Real Story )

( ఇంటర్నెట్ లో అద్బుతమైన భావాలకోసం వెతుకుతుండగా దొరికిన పోష్టు ఇది ..చూశాక నా బ్లాగ్ మిత్రులతో షేర్ చేసుకోవాలనిపించింది..చనిపోయిన తన స్నేహితుని జ్ఞాపకం " )

సీనియర్ల గుంపు ఎదురయ్యి మమ్మల్నందరిని కాంటీన్ కి తీసుకెళ్ళి బాగా క్లాసు పీకారు. "కాలేజీలో ఎమన్నా ప్రాబ్లం ఉంటే కాలేజీ లోనే సొల్వె చేసుకోవాలి, అంతేకాని వాటిని ఇంటి దాకా తీసుకెళ్ళి అనవసరమైన ఇస్సుఎస్ చెయ్యకూడదు" అంటూ ఏవేవో లెక్చర్లు ఇచ్చారు. వీరికేం తెలుసు అందరూ వీరిలాగా ప్రతి విషయాన్ని తేలికగా తీసుకోలేరు కదా? తొందరలోనే ఫ్రెషెర్స్-దయ్ పార్టీ అయిపోయింది. ఇక సీనియర్లందరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.

ఇలా మనం కాలేజీ చదువు వెలగబెడుతున్నప్పుడు, మధ్య మధ్యలో నాకేమన్నా దౌబ్త్స్ వస్తే మా అనురాధా ఆంటీ వాళ్ళ తమ్మున్ని అడిగేదాన్ని ఫోన్ లోనే లెండి. అతను ఓపికగా అన్నీ వివరించి చెప్పేవాడు. అలా "మీరు" లోంచి నెమ్మదిగా "నువ్వు" లోకి మారి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. అతనితో మాట్లాడుతుంటే ఎన్నో విషయాలు తెలిసేవి. చాలా అల్లరిగా కనిపించినా అతని అలోచనాధోరణి నాకు ఆశ్చర్యమనిపించేది. పైకి ఎంతో అల్లరి చిల్లరిగా కనిపించేవారు లోపల ఎంతో ఆలోచనాపరులై ఉంటారు అన్న వాక్యం నా ఈ నేస్తాన్ని చూస్తే నిజమే అనిపించేది. కుటుంబం పట్ల, సమాజం పట్ల నిబద్దతతో ఉండాలి అనేవాడు. అతను నాకు నేస్తం కానంతవరకు కాలేజీకి వెళ్లి రావడం, ఫ్రెండ్స్ తో కబుర్లు, సినిమాలు ఇవే మన లోకంగా ఉండేవి. అనవసరంగా డబ్బు నీకోసం వృధా చేసే బదులు ఎవరన్నా ఆకలితో ఉన్నవారికోసం వెచ్చించొచ్చు కదా అనేవాడు. అవును నిజమే కదా అనిపించేది నాకు. కాని మరుసటి రోజు అంతా మామూలే. ఈ విషయం నేను నిజాయితీగా అతనికి చెబితే "మనిషి ఎవరో చెబితే మారడు, తన కేర్పడిన అనుభవాల ద్వారా మాత్రమే మారతాడు. నువ్వు ప్రయత్నించు మారేదానికి. కొంచెం సొచీల్ రెస్పొన్సిబిలిత్య్ అలవరుచుకో. నీ దగ్గరున్నది అంతా పక్కన వాడికి ఇవ్వనక్కరలేదు. ఎంతో కొంతైనా పర్లేదు. అది పక్కన ఉన్నవారికి ఉపయోగపడితే చాలు." అని చెప్పేవాడు. "మనిషి ఎవరో చెబితే మారడు, తన కేర్పడిన అనుభవాల ద్వారా మాత్రమే మారతాడు" అన్న అతను చెప్పిన వాక్యం నా చిట్టిబుర్రలో ఇప్పటికీ నిలిచిపోయింది. ఇలా నా కాలేజీ చదువు పూర్తి అయిపొయింది. ఉద్యోగ ప్రయత్నాలకోసం మొట్టమొదటిసారిగా అమ్మానాన్నల్ని, పుట్టి పెరిగిన ఊరిని వదిలి హైదరాబాదు రావలసి వచ్చింది. "నీకే ప్రాబ్లం వచ్చినా మా తమ్మున్ని కాంటాక్ట్ చెయ్యి. వాడు నీకే సహాయం కావలసి వచ్చినా చేస్తాడు" అన్న అనురాధా ఆంటీ మాటల్ని నెమరువేసుకుంటూ కన్నీరు ఉబుకుతుండగా, మనస్సును ఎవరో మెలిపెట్టినట్లుండగా, తడబడుతున్న అడుగులతో హైదరాబాదులోకి అడుగుపెట్టాను.

హైదరాబాదులో ఎవ్వరూ సరిగ్గా తెలియదు, దూరపుబంధువులున్నా వారు నిజంగా చాలా "దూరపు"బంధువులే. హైదరాబాదే సరిగ్గా తెలియకపోతే ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఏం మొదలు పెడతాం చెప్పండి? కాని నాకీ ప్రశ్నే ఎదురుకాలేదు. నా నేస్తం నాకన్నా సీనియరు అవడం వల్ల, తను అల్రేద్య్ హైదరాబాదులో 4 సంవత్సరాలునుంచి ఉండటం వల్ల నాకేం పెద్దగా సమస్యలు ఎదురు కాలేదు. ఏయే కోర్సులు జొఇన్ కావాలి, ఇంతెర్విఎవ్స్ కి ఎలా ప్రెపరె కావాలి, ఎక్కడెక్కడ ఫ్రెషెర్స్ కి ఒపెనింగ్స్ ఉన్నాయి మొదలైన విషయాలన్నీ నాకు వివరంగా చెప్పేవాడు. చెప్పడమే కాదు నన్ను దగ్గరుండి మరీ ఇంతెర్విఎవ్స్ కి తీసుకెళ్ళేవాడు. కానీ మనం వెలగ పెట్టిన చదువుకి మనం ఫిర్స్త్ రౌంద్ అంటే వ్రిత్తెన్ తెస్త్ కే బయటికి వచ్చేసేవాళ్ళం.

ఇలా కొన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాక తను నా ప్రయత్నాలలోని "సెరిఔస్నెస్స్" ని కనిపెట్టాడు. ఒకరోజు తన ఫ్రెండ్స్ సర్కిల్ లోని కొంతమందిని నాకు పరిచయం చేసాడు. అమ్మాయిలు, అబ్బాయిలు నవ్వుతూ తుళ్ళుతూ సంతోషమంతా తమదే అన్నట్టుగా వున్నారు. వాళ్ళతో ఆరోజు చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఆరోజు నా కెదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని అతను చెప్పిన మాటలు నాకిప్పటికీ గుర్తే. "చూసావా? వీళ్ళంతా ఎంత ఆనందంగా ఉన్నారో? ఈ ఆనందానికి కారణం డబ్బు. అవును ఆర్ధికభధ్రత. ఇంత చదువూ చదివి, ఆ ఏదో చెయ్యాలి కాబట్టి ఉద్యోగం అన్నట్టుగా ప్రయత్నిస్తే నీ ప్రయత్నాలలో సెరిఔస్నెస్స్ ఉండదు. 100% ట్రై చెయ్యకపోతే మనం ఏదీ సాధించలేము. కొన్ని ప్రయత్నాలలో నువ్వు సఫలం కానంత మాత్రాన నువ్వు నిరాశ పడనక్కరలేదు. అంతకన్నా మంచి అవకాశం మనకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని తెలుసుకో. నువ్వు ప్రయత్నం చేశావా లేదా అన్నది ముఖ్యం కాదు, ఎంత సెరిఔస్, సించెరె గా దానికోసం ప్రయత్నించావు అన్నది ముఖ్యం." అని అన్నాడు. "నేనేం చెయ్యను? నాకు సరైన అవకాశం రావడం లేదు" అన్నాను. అతను కొద్దిగా నవ్వి "తప్పుల్ని అవతలివారి మీదకో లేదా పరిస్థితుల మీదకో నెట్టేసే వారంటే నాకసహ్యం. నీకు అవకాశం రాలేదంటే లోపం ఎక్కడో నీలోనే ఉంది. అదేమిటో ముందు చూసుకో, దాన్ని సరి చేసుకో." అన్నాడు. ఆ మాటలు నా మీద బాగా ప్రభావం చేసాయి. నాలో కసిని, పట్టుదలను పెంచాయి. నాలో లోపాలు సరిచేసుకోవడం మొదలు పెట్టాను. అంతే ఒక నెల లోపుగానే ఒక పెద్ద ంణ్ఛ్ లో జొబ్ వచ్చింది. ఆరోజు నాకన్నా ఎక్కువగా అతనే సంతోషపడ్డాడు. ఇక మా అమ్మానాన్నల సంతోషానికైతే అవధుల్లేవు. ఇలా ఆనందంగా, అందంగా సాగిపోతున్న జీవితంలో అనుకోని ఒక పెద్దమలుపు.

అమ్మ దగ్గరినుంచి ఫోన్, వెంటనే బయలుదేరి ఊరికి రమ్మని. నానమ్మకు బాలేదేమోనని హడావుడిగా వెళ్ళాను. కాని అక్కడ జరిగిన విషయం తెలుసుకొని మాట రాక నిలుచుండి పోయాను. నా కంటి నుంచి ఒక్క చుక్క కూడా నీరు కారలేదు. అది నిర్వేదమో, నిర్లిప్తతో, వైరాగ్యమో ఏమిటో మరి. నన్నో చంటిపాపలా భావించి నా వేలు పట్టుకొని నన్ను జీవితంలో నడిపించిన నేస్తం అక్కడ అసువులు బాసి అందరికి అశ్రువులు మిగిల్చాడు. "చనిపోతే కళ్ళు దానమివ్వమని చెప్పాడమ్మా. మా అందరి చేత కూడా సంతకాలు పెట్టించాడు. కాని ఇలా వెళ్ళిపోతాడనుకోలేదు". అంటూ అక్కడ ఏడుస్తున్న నా నేస్తపు అమ్మని సముదాయించడం ఎవరి వల్లా కాలేదు.

గొంగళిపురుగు నెమ్మదిగా తన రూపాన్ని వదిలి అందమైన సీతాకోకచిలుక రూపాన్ని సంతరించుకున్నట్లు నేను కూడా నెమ్మదిగా ఒక అమాయకమైన యువతి నుంచి అందమైన వ్యక్తిత్వం అంటూ సంతరించుకున్నానంటే అది నా నేస్తం చలవే. "అనాధలకు సహాయం చెయ్యి, నీకోసం కొంత, సమాజం కోసం మరికొంత, దేశం కోసం అంతా" అంటూ అతను చెప్పిన మాటల్ని నేనెప్పుడు మరచిపోలేను. "అందమైన భావనలు మనస్సులోనే ఉండకూడదు అవి మదిని దాటి, కలంలో ఇంకులా మారి, ఎన్నటికి చెరిగిపోని శిలాక్షరాలవ్వాలి, ఎదలో బీజాక్షరాలవ్వాలి." అంటూ నన్ను ఎన్నడూ రాయమని ప్రోత్సహించే నా నేస్తం, ఇప్పుడు నే రాసే రాతల్ని చూసి స్పందించేదానికి నా పక్కన లేడు. "కన్నీరు చాలా విలువైనది అది మన కంటి నుంచి జాలు వారితే ఆవలి వ్యక్తి నిజంగా చాలా విలువైన వారవ్వాలి. అంత విలువైన వారెప్పుడూ నిన్ను ఏడిపించరు కాబట్టి కన్నీరు అనవసరంగా వారి కోసం కార్చకు" అంటూ నా కన్నీళ్ళు తుడిచే నేస్తం ఇప్పుడు నా కన్నీళ్ళు తుడవటానికి నా ఎదుట లేడు. మా స్నేహం చూసి కాలానికే కన్ను కుట్టిందో లేక మంచివారెప్పుడూ తొందరగా ఈ పాడులోకంనుంచి వెళ్ళిపోతారు అన్న మాట నిజమో లేక ఎవరి నిర్లక్షమో లేక ఎవరి పాపమో లేక ఇది నాకు శాపమో నా నేస్తం సెలవంటూ ఈ లోకాన్ని వదిలి రెండు సంవత్సరాలైంది.
============================================================
ఇది జ్ఞాపకం కూడా కాదు, జ్ఞాపకం అంటే అప్పుడప్పుడు మదిని తట్టేది. నేను నా నేస్తాన్ని మరిచిపోతేగా తను నాకు జ్ఞాపకం అయ్యేది. నేస్తం ఈ అందమైన జీవితం నువ్వు పెట్టిన భిక్షే మరి. నీకు అశ్రుఅంజలి ఘటిస్తూ..
నీకే అంకితం.
-కల.

http://kala-lo.blogspot.in/2008/07/blog-post_23.html