. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, October 8, 2013

చలం ప్రేమలేఖలు (3)

సిగరెట్టు తర్వాత సిగరెట్టు కాలుస్తో
"రాత్రియన్నది నల్లని రాతి రీతి
గడవకుండును గాక నా బతుకిదెల్ల
గాఢతమమైన ఈ అందకారమందే
అని పాడుతూ కూచున్నాను. .

రైలు వెళ్ళేటప్పుడు నువ్వు వెనక్కి తిరిగి వెళ్లిపోతుంటే , నేను అందరిముందూ కిందపడి నలిగి నీ పాదాల కిందనేచావాలనిపించింది.నువ్వు ఇంకెవరినైనా ప్రేమించినా ,నేను నీ సేవలోనే నా జీవితమంతా గడపడమేఅదృష్టమనుకొన్నాను.నా ప్రేమ అపవిత్రమైనది,నీచమైనది.నీ ప్రేమ వున్నతమైనది,నిర్మలమైనది.
ఈవాళ ఎందుకో చాలా దిగులుగా నిరాశగా వుంది.అంతం ఏమిటి? ఈ ప్రేమకంతా ఆనందానికంతా అంతం! వృద్దాప్యమూచావూ మరణమూ ఈ జీవితం అంతమన్న సంగతి, ఈ లోకాన్ని విడిచిపోయే రోజు సంగతి తలచుకుంటే అంత విచారంకలుగుతోంది .ఏమి లాభం ? ప్రేమించి అనుభవించి,ఆనందించి! అవన్నీ బూడిద ఆయేందుకే గదా? ఎప్పుడూ అంతంలేకుండా ఇట్లా అందంగా బతకడానికి వీలేందుకు లేదో? అట్లాంటప్పుడు నిజంగా దేవుడు లేదని తెలియడం లేదూ! ప్రేమని మధ్యలో తెంపేవాడు ఒకర్ని చంపి ,ఒకర్ని విడిచిపెట్టేవాడు ,పోనీ ముసలితనంలోనైనా సరే మరణమనే చీకట్లో ఈజీవితాన్ని లయం చేసేవాడు రాక్షసుడు.
మూడురోజుల కిందట ఎండ కాస్తోంది. ఈ వేళ వాన.అప్పుడు సూర్యకిరణ ప్రసారవిషయం ఆలోచించలేదు. ఈవేళ ఆశ్చర్యపడతాను. అప్పుడు సూర్యకాంతిని అనుభవించక పెట్టానే అని.జీవితం !ఆనాడు అట్లానే కోట్లకొలది కిరణాలు వృధాగాప్రకాశించాయి. కాని లేనినాటికి ఒక్క కిరణాన్ని దాచుకోలేము గదా! నువ్వు ఉన్నప్పుడు ఉన్న నవ్వుని నా చేతుల్లోదాచుకోగలనా, నువ్వు వెళ్ళిన నాటికీ? నువ్వు నన్ను మరిచినా నీ చిన్న హృదయాన్ని, నేను అన్నిసార్లుముద్దుపెట్టుకున్న నీ హృదయం ఎట్లా మరుస్తుంది నన్ను? నేను మధ్యాహ్నం రాసిన ఉత్తరం వల్ల నీకు కష్టంకలిగిందేమోనని భయం వేస్తోంది .నువ్విక్కడున్నప్పుడు ఎంత మైత్రితో వున్నాం? ఇప్పుడప్పుడే పోట్లాడుకుంటున్నాం.నువ్వు వెళ్లి పోగానే నాలోని దుర్గుణాలు బయటపడతాయి . నీ చిన్ని పెదవినన్నా గాయపరచలేని నేను నీహృదయానికి ఎంత బాధ కలిగిస్తున్నానో!

నన్ను ఒక్క రాత్రి కూడా శాంతంగా నిద్రపోనీదు, నీమీద నా ప్రేమ . నీవిక్కడున్నప్పుడు నిద్రలో కదిలినప్పుడల్లా ఉలికిపడిలేచేవాణ్ణి. నువ్వుల్కేని ఈ రాత్రులు నీపై విరహం చేత నిద్ర రాదు.నీకోసం నిద్రలో వెతుక్కుని చేతులు నన్ను నిద్ర నించిలేపి ,'ఏదీ ?' అని అడుగుతాయి. నా జీవితాన్నంతా నవజీవనాన్నిచ్చే కాంతితో నింపావు. నీ నవ్వులు సంతోషమనేవజ్రాలతో అని సందేహ సందేహ. చచ్చిపడి ఉన్న నన్ను లేపి నీ చూపులతో అందంగామారిన ఈ ప్రదేశాన్ని చూసి కొత్తఆశలు, కోరికలు కలిగించావు. నా ప్రాణమే నీది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నిన్ను తలచుకుంటే ,నువ్వు రావడంనిజమా, లేక నేను కల్పించుకొన్న కలా? నిజంగా నీ అందాన్నంతా ఈ చేతుల్లో అదుముకొన్నానా?వూరికే అనుకొంటూవున్నానా ? అని సందేహపడతాను! (ఎంత పిచ్చి ప్రియుడు దొరికాడు నీకు?) అంత అదృష్టం నిజంగా నాకు కలిగిందా! అనుకుంటాను.నేను రాసిన వుత్తరాలన్నీ చదువుతావా? ఎప్పుడూ ఇదేగోల? ఇదే కవిత్వం, అని మొదలు చివర చూసిఅవతల పారేస్తావా? నా హృదయ రక్తం లో తడిపి రాసిన అక్షరాలు నీ కాళ్ళ ముందర పడాలని ఎంత గిలగిలకొట్టుకొంటాయో ? నేను రైలుకిండ జారతానని ఎందుకు భయపడతావు! ఇంత బలమైన ప్రేమ హృదయంలో వెలుగుతూవుండగా నా కాళ్ళు తప్పటడుగు వేస్తాయా! ఈశ్వరుడితో ,మరణ దేవత తో తగూలాడి ఈ జీవమును పట్టుకొని వేళ్ళాడిఒక వూపు వూపి నీ వొళ్ళో వాలనా? ఈ వాన మబ్బుల వల్ల రాత్రి పడే ముందు ఒక వింతైన రంగు గోదావరిమీద,మెట్లమీద కమ్మింది. కొంచెంలో అంతా పోయి నల్లని చీకటి ముంచుకొచ్చింది ప్రపంచమంతానీళ్లుయేదో,భూమియేదో తెలీటంలేదు. నా మనసులో పెద్ద దిగులు పట్టుకొంది.