. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, October 21, 2013

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(27)

1) అన్నీ నిన్న మొన్నటి గతంలా ఇప్పుడే చదివి పక్కన పెట్టిన 
జీవితపు పుస్తకంలా కళ్ళ ముందు కదలాడుతున్న బొమ్మల్లా 

2) నన్ను నేను వెనక్కి తవ్వుకుంటూ
నేను లేనప్పటి ప్రపంచాన్ని ఊహించుకొంటూ 


3) వాస్తవానికి వారదులు కట్టి నిజాలకు మేడలు
కట్టి కాలాన్ని కనికట్టు చేసి దాచేయలని చూస్తుంటా ఎప్పుడూ 

4) ప్రతి రాత్రి చీకటి నన్ను కౌగలించుకొంటుంది
అప్పుడూ మొదలౌతుంది ఎవరికీ చెప్పుకోలేని అలజడి


5) కన్నీరు నీవి అయితే "కన్నులు" నావి కావలి
గుండె నిది అయితే "చప్పుడు" నాది కావాలి..నీ శ్వాస ఆగితే "మరణం" నాది కావలి .


6) వేళ్ళసందుల్లో నుంచి జారిపోతున్న స్వేచ్ఛను
గుప్పిట్లో బందిస్తూ నీకోసం వెతికితే ఎలా కనిపిస్తావు చెప్పు


7) కంట్లో కన్నీరు బైటికొస్తున్నప్పుడు
కడుపులో దాచుకున్న ఎన్నో ప్రశ్నలు గుండెల్లో గుచ్చేస్తున్నాయి...?


8) ఈ రోజు నైన నా కోసమై నన్ను జన్మించనీ ప్లీజ్
కొన్ని క్షణాలనైనా దోసిట్లో నింపుకుని నన్ను నేను అభిషేకించుకోనీ….?


9) మనసును ఇరుకు సంధులు గా చేసి
ప్రకృతికి మేకప్పులేస్తూ రంగులను మార్చేస్తున్నావుగా..?


10) ఎక్కడో .. ఎప్పుడో.. ఏందుకో .. ఏమో..
తెలీని గందరగోళంలో మనసు మూలాల్లోకి జొరబడ్డావుగా


11) ఈ నిట్టూర్పుల సెగలింక ఈపూటకు పక్కన పెట్టి
నీ సరసన నన్ను సేదతీరుస్తూ కాస్త పన్నీటి జల్లు పలకరింపులియ్యవా


12) సూరీడు తన కిరనాలతో వెచ్చటి దుప్పటిని కప్పుతూ
నీలాకాశపు కాన్వాసుపై ఎర్రటి రంగును చిత్రిస్తూ మనపై కోపాన్ని చూపిస్తున్నాడు


13) గుండెలపైకి జారిన జ్ఞాపకం నిశ్శబ్దాన్ని చిద్రం చేస్తుంది
చిలికి చిలికి గాలివానగా మారిన గతం నన్ను ఓంటరిని చేసింది


14) నా చుట్టూ నిశ్శబ్దం అలముకొంది
నా ఆలోచనల అలల్లో తీరం చేరాలని ఎదురుచూస్తున్నా


15) నిన్నటి రోజున జనించిన జ్ఞాపకం
నా గుండె గదిలో నీమాటలు ఎప్పుడూ ధ్వనిస్తూనే ఉంటుంది


16) గడియారం ముల్లుల మధ్య చిక్కుకుపోయింది నా జ్ఞాపకం
నిశ్శబ్దంలో నా మనసు శబ్దం ఆలకిస్తూ ఆలోచనలతోనే గతం ఆవిరౌతుంది


17) ఒక్కో అక్షరం ఒక్కో భావన..ఒక్కోజ్ఞాపకం
ఎప్పటికీ అసంపూర్ణమే మరొజన్మవరకూ తప్పదేమో..?


18) నిన్నింకెప్పుడూ చూడలేనని తెలిసుకొని
నా హృదయాన్ని ఇనుపతెరలతో బంధించేస్తున్నాను ..?


19) మన్సంతా నీ రూపే నిండి ఉన్నాకనులకు నువ్వు కనబడవు..
తలపంతా నీ ధ్యాసే వున్నా నీపిలుపు నాకు వినబడదు ఏంటో ఈ మాయ


20) నీ మౌనం మనసుని తొలిచేస్తూనే ఉన్నా
పదునైన కత్తుల్లాంటి మాటలతో గుండెను గాయాల పాలు చేశావుగా


21) నా గుండెలోనికి చొచ్చుకు వచ్చిన నీ జ్ఞాపకాలు
నా గొంతుకను లో నీముచ్చట్లు నాకు నేను స్పష్టంగా వింటున్నా


22) జీవితమనే పరుగు పందెంలో పరుగెత్తి పరుగెత్తీ
అలసిన మనసుకు జ్ఞాపకాలే చల్లటి చిరు జల్లులు వెచ్చటి నిట్టూర్పులు.


23) ఎంతగా మరచిపోదామన్నాకొన్ని జ్ఞాపకాలు
మదిలో గుచ్చి గుచ్చి చంపుతున్నాయి నీవు గుర్తుకొచ్చి


24) తరచి తెరచి చూస్తే ప్రతి పుటలలోనూ నీ జ్ఞాపకాలే
మునుపెన్నడూ ఎరగని నేను నన్ను నేను వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నా


25) ఆవురావురుమంటున్న "అక్షరం"
అందర్ని బ్రతిమిలాడుకొంటుంది నన్ను కాపాడండీ అని


26) నిశ్శబ్దాన్ని గుండెలమీదేసుకుని
ఏ కాంతంలో నిన్ను తలచుకోంటున్నా


27) నాపిచ్చిగానీ అక్షరాల్లో నిన్నుబంధించాలనుకోవడం
ఆకాశాన్ని అందుకోవాలనుకోవడం నిజంగా ఎలా సాద్యం చెప్పు


28) నీ చెమ్మగిల్లిన నీ కళ్ళు చెబుతున్నాయి
నీ గుండెకు నేనెంత చేరువగా ఉన్నానో ఇది చాలదూ నేను నీవు అనటానికి


29) నా కన్నీటిబొట్టు బరువు..నా హృదయం బరువు..
సమానంగా తూగుతున్నాయి..మన ఉగతం గుర్తు వచ్చినప్పుడల్లా...?


30) దిగేదాకా నీ ప్రేమ మేకులు...
కొడుతూనే ఉంటా నా గుండెపై .. ప్రేమోన్మాదిని ...> Margaret Mercy


31) నాకోసం ఎదురు చూస్తావు ..ఎదురొస్తే ఎవరు నీవని అడుగుతావు..?

32) నీ జ్ఞాపకాలు ఆశను అడ్డంగా ఆవిరి చేస్తాయి
వాటిని పంచుకున్న అందరిలో నన్ను అల్పుడుని చేస్తాయి


33) నా అస్థిత్వాన్ని శోధిస్తూ తడబడుతూ
నీఉనికిని ఇంకా నాలోనే దాచుకొని నిన్ను వెతుకుతున్నా


34) నీ జ్ఞాపకం నిశబ్దాన్ని చీల్చి గుండెల్లో గుచ్చుకొంటుంది

35) అరె నీరక్తంకూడా ఏర్రగానే ఉంది
మరి నీవు అందరిలాకాకుండా మనసునెలా మోసం చేస్తున్నావు


36) బ్రతకాలనుకున్న ప్రతిసారి
జ్ఞాపకాల అనుబాంబులు పేలిస్తే ఎలా చెప్పు


37) నిన్న అనుకొని ఎదురు చూశాను..అది రేపై నిన్నను మింగేస్తుంది

38) నిద్రను దాచాలనుకుంటున్నా..ఆవులింతల్లో నిద్రను బైటికొదిలావెందుకనో

39) తలపులన్ని తలగడలో పెట్టాను..మరి గుండెల్లో గుచ్చుకుంటున్నవేంటో         

40) నీ మది పుస్తకంలో అన్నీచిరిగిన పేజీలైన నా జ్ఞాపకాలు    

41) చీకటిని నీ కళ్ళలోని కాటుకలో దాచావు
ఉదయాన్ని నీ నుదుటి బొట్టుగా చేసి వెలుగులు చిమ్ముతున్నావు


42) నమ్మకం గుడ్డిదవుతుంది ప్రేమనే టార్చ్ లైట్ లో బ్యాటరీలు ఐపోతే      

43) నీ యదపై జ్ఞాపకాలతో దున్నేస్తున్నా మళ్ళీ మనస్నేహపు తోటను చిగురిద్దామని 

44) ఒంటరితనం గ్లాసులో పోసుకొని..నేను నిద్రను తాగాలనుకుంటూన్నా

45) నా మనసు గాయాన్ని గెలక్కు..ఆగాయం చేసింది నీవేనని మర్చిపోకు

46) ఏకాంత వనం లో ఎద లో ఏదో రాగం వినిపిస్తూ ఉంటుంది
ఏంటా అని దగ్గరకు వెల్లి చూస్తే అది విషాదగీతంలా మారిపోతుంది


47) అదుపు లేని ఆలోచనలు ఎన్నో
మనసును చింద్రం చేస్తున్నాయి..ఏం చేయను...?


48) నేను తొలి కిరణాల వెలుగు రథం మీద బయలుదేరాను
కాంక్రీట్ అరణ్యాల గుండా నా ప్రయానాన్ని కొనసాగిస్తున్నా గమ్యించేరుతానో లేదో


49) ఏవైపు చూసినా దాటలేని అగాధాలు
గమ్యం తెలియని గమనాలు...గతి తప్పిన జ్ఞాపకాలు


50) నువ్వు వదిలి వెళ్ళిన నిశబ్దంలో  నీ జ్ఞాపకాలే ఉపిరిగా బ్రతుకుతున్నాను     

51) మౌనంలో నువ్వు మెల్లగా దూరం అయినా
నీ ఎదమీద నీ తలవాల్చినట్టు కలలొస్తున్నా ఏంటో


52) కళ్ళలో కన్నీలన్నిటిని ఓలికించావు
ఆయినా ఎందుకని నీ కసి తీరలేదు నేనేం తప్పుచేశాను


53) కాలాన్ని కరిగించాలని నాకు నేను కరిపోతున్నా
మనసును ఏమార్చాలని నన్ను నేను ఏమార్చుకుంటున్నా


54) పాళీలోని సిరా ఎన్ని కాగితాలను తడిచేసిందో
నిన్ను తలుచుకొని నాకు నన్ను గుర్తు చేయాలన్న విఫల ప్రయత్నంలో


55) క్షణం ముల్లుకు ఎంత సేపు వేలాడానో..నిన్ను చేరుకోవాలనే తపనలో

56) ఒక్కోసారి నాకు నేను అర్దం కాక
నన్ను నేను జోకోట్టాలని విఫల ప్రయత్నం చేస్తాను ఎందుకో తెలీదు


57) ఎగిసిపడే ఆలోచనలలో తడిసి ముద్దయ్యే
నన్ను నేను కౌగిలించుకుని కన్నీరు మున్నీరౌతున్నాను


58) పగలంతా నిద్రలో జోగుతూ రాత్రుళ్ళు కత్తులు
దువ్వుతూ జ్ఞాపకాల తలలు నరుకుతూ నా లోలోపల స్తైర్యవిహారం చేస్తున్నాయి


59) చేజార్చుకున్న చీకటి వెలుగుల్లో ఎగురుతున్న
ఎన్నో జ్ఞాపకాలు నీ సమాధానం కోసం వెతుకుతున్నాయి…


60) చీకటి రాత్రుళ్ళలో రాలిపడుతున్న జ్ఞాపకాలు
ఎన్నో ప్రశ్నలను సంధిస్తున్నాను ఆ ప్రశ్నలకు సమాదానం...?


61) తడబ్డుతున్నా తట్టిలేపుతున్న ఆ తలపులు
పాతుకుపోయిన ఆ పాత గురుతులు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి


62) "We don't meet people by accident. They are meant to cross our path for a reason."

63) "Hurt me with the truth, don't comfort me with a lie"

64) పట్టుకుందామంటే ఒక్క ఆలోచన దొరకడం లేదు
గడచిన క్షణం ఏం మోసం చేసిందో ఏమోఈ క్షణం అంతా శూన్యం


65) భూతంలా భయపెట్టే బాధను మర్చేందుకు
కన్నీటిలో జ్ఞాపకాలను నానబెట్టి నీకోసం ఎదురు చూస్తున్నా


66) నిజం గాజుపలక అని తెల్సుకదా
అయినా ఎందుకు పగలగొడుతున్నావు ..?


67) వేళ్ళసందుల్లో నుంచి జారిపోతున్న స్వేచ్ఛను
గుప్పిట్లో నింపుకొని నాదంటూ అనుకొంటే సరిపోతుందా..?


68) గుండెలోని బాధ మోయలేని భారమై
జ్ఞాపకం ముక్కలై మనసుని గుచ్చి గుచ్చి బాధిస్తోంది…


69) నిన్ను గుండెలో దాచుకోవాలనుకొన్న
ప్రతిసారీ గాయమై భాదపెడుతుంటే ఏం చేయను చెప్పు


70) నిశ్శబ్ద మైదాన పరిసరాల్లో నా గుండె శబ్ద పరుగు
పెంచుతుంటే ఇక్కడెక్కడో నీవు ఉన్నావని మనస్సు చెబుతోంది


71) గతంలో జారుకుంటున్న జ్ఞాపకం నిశ్శబ్దంలోకి
మెల్లగా లాక్కుపోతుంటే...లేని నవ్వును ముఖంపై పులుముకొంటున్నా


72) అవమానపు తెరను చింపుకొని
మనసు పొరలుతెంపుకొని నన్ను నీవు గుర్తించేదెప్పుడో


73) మనసు పదాల చౌరస్తాలలో మన విభేదాన్ని భుజానవేసుకొని
చెరోదారై విడిపోయినా నిరంతరం అక్షరం మనల్న్సి కలఫాలని చూస్తూనే ఉంది


74) వర్తమానాన్ని సర్రున చింపి..జ్ఞాపకాల అంచులగుండా
ప్రస్తుతంలో నిన్ను చూడాలనుకోవడం నిజంగా నాపిచ్చేమో కదా..?


75) ఏంటో ఈ ఫేస్ బుక్ లో స్నేహాలు పుడుతూ చస్తూ ఉంటాయి
కొన్ని లైక్ లకు .. మరికొన్ని కామెంట్స్ కు బలౌతూ అదేగొప్పని ఫీల్ అవుతూ


76) నన్ను నాలో చూడాలనుకోకు
నిన్ను నీవు కోల్పోతావు.. ఏందుకంటా నాలో నేను లేను కదా..?


77) నామనసు ప్రతిబింబంలో నీవు వేయి సార్లు జవున్మిస్తావు
నను కాదని నీ చూపు మరిలిన అనుక్షణం నేను లక్షసార్లు మరణిస్తూనే ఉన్నాను


78) పగిలిన గుండెను ఓదార్చే నేస్తమా...
నాకోసం చూసిన ఎదురుచూపులను తిరిగి నా కివ్వవా


79) నాకు అందితే నీతో కొన్ని క్షణాలు గడిపే వరం
నిలుపుతాను నా హృదయాలయం లో నీ రూపం అన్ని జన్మలకు


80) ప్రతి రొజు నిజాన్ని కన్నీటి పొరలతొ కప్పుతుంది జ్ఞాపకం
నేను ఊహించిన అద్బుతమైన నిజాలన్నీ అవిరౌతున్నాఎందుకో ..?