అదిగొ దూరంగా ఎవరో పిలుస్తున్నారు
ఏంటి అదినన్నేనా .. కాదేమో...?
కాని ఏదో అలికిడి అయింది
నిశ్శబ్దాన్ని చేదిస్తూ శబ్దం
ఎక్కడి నుంచో లీలగా ఏదో శబ్దం
నవ్వులా? ఏడుపులా ?
అస్పుస్టంగా ఏదో దృశ్యం
ఆలింగనాలా? తోపులాటలా?
చీత్కారాలా..చీదరింపులా
చిరాకా ..పరాకా...?
ఇంకా ఏదో వినిపిస్తోంది
మరో పదడుగులు వేసా
ఇంకా ఏదో హృదయ విదారకమైన శబ్దం
ఇంకా కళ్ళకు అస్పుస్టంగా ఏదో దృశ్యం
మరో యాబై అడుగులు వేసా
ఎవరో లబోదిబోమని ఏడుస్తున్నారు
నా గొంతు పిక్కటిల్లేలా అరిచి చెప్పా
ఆ ఏడుపులో నా అరుపులు
మరుగున పడిపోయాయి
నా స్వరపేటిక తెగిపోయింది
ఎవరో నాగొంతు కోస్తున్నారు
నా అరుపులు వినబడకుండా
నిజాలు చెబుతాను అనిభయమేమో
కొందరికేమో నిజాలు చెబుతా అని
మరికొందరికి నిజాలు నచ్చవు ..
మరి ఆ ఏడుపులెందుకో అర్దం కాదు
ఎవర్ని నమ్మించాలని
ఎవన్ని నిజాలు దాచినా దాగదు
ఎందుకంటే అది నిజం కాబట్టీ
ఏంటి అదినన్నేనా .. కాదేమో...?
కాని ఏదో అలికిడి అయింది
నిశ్శబ్దాన్ని చేదిస్తూ శబ్దం
ఎక్కడి నుంచో లీలగా ఏదో శబ్దం
నవ్వులా? ఏడుపులా ?
అస్పుస్టంగా ఏదో దృశ్యం
ఆలింగనాలా? తోపులాటలా?
చీత్కారాలా..చీదరింపులా
చిరాకా ..పరాకా...?
ఇంకా ఏదో వినిపిస్తోంది
మరో పదడుగులు వేసా
ఇంకా ఏదో హృదయ విదారకమైన శబ్దం
ఇంకా కళ్ళకు అస్పుస్టంగా ఏదో దృశ్యం
మరో యాబై అడుగులు వేసా
ఎవరో లబోదిబోమని ఏడుస్తున్నారు
నా గొంతు పిక్కటిల్లేలా అరిచి చెప్పా
ఆ ఏడుపులో నా అరుపులు
మరుగున పడిపోయాయి
నా స్వరపేటిక తెగిపోయింది
ఎవరో నాగొంతు కోస్తున్నారు
నా అరుపులు వినబడకుండా
నిజాలు చెబుతాను అనిభయమేమో
కొందరికేమో నిజాలు చెబుతా అని
మరికొందరికి నిజాలు నచ్చవు ..
మరి ఆ ఏడుపులెందుకో అర్దం కాదు
ఎవర్ని నమ్మించాలని
ఎవన్ని నిజాలు దాచినా దాగదు
ఎందుకంటే అది నిజం కాబట్టీ