ఎందుకు నువ్వు ప్రాణాలను తీస్తావు !
ఎందుకు నువ్వు మనసులోకి ప్రవేశిస్తావు!
ఎందుకు నువ్వు నిన్ను తప్ప అందరిని మర్చిపోయేలా చేస్తావు!
ఒకసారి మనసును మబ్బుల్లోకి ఎగరవేస్తావు ...
ఇంకోసారి నరకం చూపిస్తావు...
ఎందుకు ఇలా చేస్తావు...
ఏంటి నీ ప్రభావం...
ఏంటి నీ ఆనందం ...
ఎందుకు రక్తపు మడుగుల్లో కలుస్తావు ...
ఎందుకు ఆసిడ్ లా మారుతావు ...
ఎందుకు నీకు అంత క్రూరత్వం...
ఎందుకు నీకు అంత ప్రేమ!
ఓ ప్రేమ నీ సమాధానం ఇంకా రాదే !
...వనిత...