. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, October 14, 2013

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(26)


1) బరువెక్కిన కను రెప్పల మధ్య
నిశిరాతిరిలో నిశ్శబ్ద భావనికి బందీలయ్యాము..

2) మనసు భారాన్ని మోసుకుంటూ..
తలుపులు బిగిసిన గమ్యానికి చేరుకోవాలని చూస్తున్నా

3) అనుభవాల శిధిలాలనూ దాటుకొంటూ

 గతాన్నీ తొక్కి ప్రస్తుతంలో వెతుకుతున్నా

4) నల్ల చీర కట్టిన రాత్రి..వెలుగుతో పోటీ పడాలని చూస్తుంది
వెన్నెలరాత్రి వేడి నిట్టూర్పుల సాక్షిగా నిజాలు కరిగిపోతున్నాఎందుకో

5) గమ్యమెప్పుడూ ప్రస్తుతానికి దూరమే ఎంత నడిచినా చేరలేము
దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది తరచి చూస్తే దూరంగా కనిపిస్తుంది

6) మనసు పొరల నెర్రల్లో ఇష్టమైన భావాలు ఇరుక్కున్నాయి
వాటిని తీసేకొద్దీ విరిగి గుచ్చుకుంటున్నాయి ఏంచేయను చెప్పు

7) వేదనగా మారి వ్యదగా గుండెను ముక్కలుగా
కొస్తున్న జ్ఞాపకాల కత్తులకు బలౌతూనే ఉన్నాయి కదా విరహ వేదనలో

8) ఆకాశంలో విహరించాలని కన్న కలలన్నీ కల్లేదురుగా
కన్నీరుగా మారిన క్షనాలకు కారనాలు వెతికి ఏం లాభం

9) కోపాన్ని దుప్పటిలో కప్పేసి.. కన్నీటితో
నీకై ఎదురు చూస్తున్నాను.. నిద్రలేని ఈ రాత్రుల్లలో

10) నీవు ఎప్పుడూ నింగివే నేను ఎన్నడూ నేలనే,
నింగి నేలల నడుమ మౌనం చినుకులై వర్షించేనా నా కలనెరవేరేనా..?

11) గతించిన గాయం తాలుకా గేయాన్ని వినిపించలేక
కరిగిపోయిన కాలాన్ని తిరిగి తెచ్చుకోలేక నేను పడే వేదన నీకు తెలుసా

12) నువ్వు నాతో లేక ఎన్నో నడిజాములు వెళ్ళిపోయినా
నీ సంభాషణల తాలూకు గుర్తులు జ్ఞప్తి వస్తుంటే మౌనంగా ఎలా ఉండగలను

13) మనిద్దరి ప్రేమ గురుంచి ఏదో రాయాలని కూర్చున్నాను
కాని అక్షరాను సరిగ్గా పేర్చలేక చెప్పాలనుకున్నది చెప్పలేక పోతున్నా

14) నీ మౌనంతో కాలిపోతున్న నా మది చిత్తి ఇంకా ఆరక ముందే
నా గాయం గుర్తులు ఇంకా మానక ముందే మరొక గాయం చేస్తున్నావు

 15) నీ నుంచి దూరమవడం చేతకాక, నిన్ను మరువడం ఇష్టం లేక
మనస్సనే ఈ కాగితం పై అర్ధం కాని, రాయలేని సిరాలా మిగిలిపోతూన్నాను

 16) నా జీవితంలో ఒక్కో ఘటన, ఒక్కో సంఘటన
ఎప్పటికీ అంతు చిక్కని ఇప్పటికీ అంతు బట్టని క్యాన్సర్ జబ్బులానే ఉంది

 17) నేను రాసే ఒక్కో అక్షరం..నేను చెప్పే ఒక్కో భావన
ఎప్పటికీ పూర్తిగాని అసంపూర్నంగా మిగిలిపోయిన ఓజీవితమే ఎప్పటికీ

 18) ప్రతి రాత్రి ఎక్కడి నుంచీ మోసుకొస్తాయో ఇంతేసి దిగులును
నీ ఆలోచనలను తోడినా ఊట బావిలా ఊరుతునే ఉంటాయి నీ జ్ఞాపకాలు!

 19) నేను ప్రేమించానా అని చేతులు దులిపేసుకున్నావు
కడుపులో దాచుకున్న ఎన్నో ప్రశ్నలకు సమాదనం చెప్పకుండా తప్పించుకోంటున్నావు

 20) నడిరేయి చిక్కటి చీకట్లలోనూ మనసు భాదలో
అదే అలజడిఅవే తలంపులు అవే కన్నీటి సుడులు మడులు

 21) మనసు భారమైన క్షణాన జ్ఞాపకాలు గుచ్చుకొని కన్నీరు ఉప్పొంగుతున్న
నిమిషాన దాచుకున్న మనసు ఆల్బం తెరచి తరచి చూస్తే అంతా నీవే ఉన్నావెందుకని

 22) అక్షరాలతో స్నేహం..పదాలతో ప్రేమ..భావాలతో భందం,
ఆలోచనలతో ఆత్మీయంగా రాసుకునే నా అక్షరాలు ప్రియమైన నేస్తాలు.

 23) నాలో నేను వెతుక్కునే ప్రయత్నం ఏవో రాస్తుంటా
నాతో నేను చెప్పుకునే కబుర్లే ఈ ఆక్షరాల అమరికలు

 24) నన్ను నేను ఓదార్చుకోవడానికి..నన్ను నేను తిట్టుకోడానికి
నన్ను నేను మెచ్చుకోడానికి..నన్ను నేనుగా స్వేకరించే నేస్తాలు నా అక్షరాలు

 25) వ్యదలో మరుగుతున్న కన్నీటి సెగలో
కాలిపోతున్నది నువ్వా? నీవు చేసిన బాసలా కాస్త చెప్పవూ

 26) కన్నీరు పన్నీరై ఎదలో ఎగిసిపడే అగ్గిశిఖలపై,
చిలకరిస్తే ఆమంటలు చల్లారేనా పిచ్చి బ్రమలుకాకపొతే..?

 27) కట్ట తెగిన కన్నీరు చెంపలపై జారి,
గుండెలో ఇంకిపోతే గాని మనసు భారం తగ్గుతుందేమో..?

 28) నీ కను రెప్పల్లో ఇరుక్కున్న ఆబద్దం అనే నలుసు ఒకేసారి
కన్నీటిలో కొట్టుకుపోతే ఎంత బాగుండు అప్పుడైనా స్వచ్చమైన నిజాన్ని తెల్సుకుంటావు

 29) నిజం అనే నా కలంతో
వాస్తం అనే ఇంకుతో రాస్తుంటే రక్తం చిందుతుందేమిటి..?

 30) అక్షరాలు మాట్లాడుతున్నాయి పదాలు బావాలు పలుకుతున్నాయి
వాక్యాలు వ్యాకరణం పొందిక లేక జీవితంలోని సత్యాలు తమలో దాచుకున్నాయి

 31) మరు జన్మ లో మనసిస్తానని అని మాటిస్తే మరణాన్నేకోరుకోనా
అందమైన చిరు చెంప పై చోటిస్తానని తను చెబితే కన్నీటి నై కరిగిపోనా

 32) చిగురాకులలో దాగిన లేలేత అందాన్ని
మురళిలో దాగిన రాగాన్ని మనసునుండి దూరం చేయగలమా

 33) నా కను పాప చాటున దాగిన నీ రూపం
గుండె చప్పుడులో కలిసింది నీ జ్ఞాపకం ఏంచేయను చెప్పు

 34) నింగిలో మాత్రమే ఉండే"జాబిలి" నా చేతిలో ఉన్నట్లుంది,
నాకోసం ఒక శ్వాస గా ఎదురుచూస్తున్నట్లు వుంది.. ఎంటి అంతా చీకటిగా ఉంది

 35) ఒంటరిగా ఉన్నా నాతో ఎవరో వున్నారనిపిస్తోంది,
చెప్పలేని గుసగుసలు వినిపిస్తున్నాయి...ఏంటి అన్నినిజాలుకావా...?

 36) మనసులో చోటుకోసం పరుగులుతీస్తున్నానాపేరు నీపెదవి
 తాకాలని ఆరాటపడ్డా కానీ ఆనోటితో అవమానాలు చేస్తున్నావేంటో

 37) వేయి యుగాల ప్రయాణంచేస్తున్నా నన్ను నేను వదలి
అక్కడికెళ్ళాకగానీ నాకర్థం కాలేదు నా వునికిని నీ దగ్గర వదిలి వచ్చానని

 38) రాలిపడ్డ మంచు పూలు దోసిట్లో ముత్యాలవుతాయి
నీ కళ్ళ మాటున చిరునవ్వు ఇంద్రధనుస్సు సంతకమవుతుంది

 39) నీ సమక్షంలో క్షణం గడిస్తే చాలు
నా కనురెప్పల చాటున చేరి ఓ స్వప్నం లిఖించుకుంటా

 40) ఎండిన కనుపాప వర్షించే ఆఖరి కన్నీటి బొట్టు
అవిరైపోతోంది ఎందుకు...నిజాల ఆర్తనాదం ఎవరికి వినిపించాలో తెలీక

 41) వికసించిన పువ్వు వాడిపోతుంది..కాని చిగురించిన మన స్నేహం
చిరకాలం మిగిలిపోతుంది...అబద్దం అద్బుతంగా ఉందికదూ "ఓయ్" నిజమని నమ్మేవు

 42) మెల్లగా నా కనుపాప నుండి జారుతోంది చూడు,
అందులో ఏ ఒక్క నీటి బొట్టు నీ మనసును తాకలేదా చెప్పవా ప్లీజ్

 43) నా కళ్ళు నీటిలో నీకోసం వూగిసలాడుతోంది,
కంటినుండి జారే ఒక్కో చుక్క నీకోసం వెతుకుతూ తడుముకుంటున్నా

 44) నా యదలో ప్రశాంతతను కొళ్ళగొడుతూ
తెలియని ఏ వాంఛ నన్ను కబళిస్తుంది నిప్పులకొలిమిలో తగల బెడుతుంది

 45) కరిగిపోయీ కాలంలో నిలవలేని క్షణాన్ని నేను
నీటిపై ఈ రాతలు నీ పిచ్చి మనసుకు అర్థం కాదేమో కదా...?

 46) క్షనంతో పోటీ పడలేను,..అలాగని రాజీ పడలేను.
కాని కొన్ని జీవితాలకు కన్నీరే ముగింపు అన్నదిమాత్రం నిఖార్సైన నిజం

 47) నీ జ్ఞాపకం నా స్వేచ్చకి సంకెళ్ళు వేసి,
కాలం నన్ను తన కౌగిట్లో ఒక కీలు బొమ్మగా మార్చిఆడుకొంటుంది

 48) నా ఆశ ఎడారి అని తెలిసినా
నా కళలకు సంకెళ్ళు వేయలేకపోతున్నా ఎందుకనో

 49) చల్ల గాలిలొ నీకోసం పరితపిస్తూ
నీ జ్ఞాపకాల తోటలో విహరిస్తున్నా మౌనంగా రోదిస్తూ

 50) నా హృదయం సాక్షిగా తుంపులు తుంపుల జ్ఞాపకాలూ గాఢమైన
దిగుళ్ళూ గుండె బరువుగా నీకోసం ఎదురు చూపులు కనుల ముందే చేజారే క్షణం

 51) ఇదిగో వినిపిస్తున్నా చివరి సందేశం శ్మశానం నుంచి
నా ఆకరు స్థానం నుంచి శవాన్నై మృత కలేబరాన్నై దివంగతునై దిగంబరునై

 52) ఏంటి ఇంతగా గుచ్చుకుంటున్నాయి నన్నుఇంత
భాదపెడుతున్నాయి మదిని గాయం చేసి నీవదిలిన జ్ఞాపకాలే కదా ఇవి

 53) ప్రేమ తీపి నిను మళ్ళీ నా వైపు లాక్కోస్తుందని తెలుసు
అప్పటివరకు నీ జ్ఞాపకాలను వాడిపోనివ్వను నా కన్నీటి సాక్షిగా

 54) కలలో కుడా నీ జ్ఞాపకాన్ని హత్తుకొని ఉండి
నన్నోదిలేసే క్షణం నీకు వీడుకోలు కుడా చెప్పలేకపోయా క్షమించవూ

 55) సిగరెట్ పొగ సుడులు తిరుగుతూ తెల్లటి దట్టమైన పొగ
రింగులు తిరుగుతుంది ప్రియా వయ్యారంగా ఎగిరే నీ కురుల ముంగురుల్లా

 56) గుండె నిండా పీల్చుకొని మనసులోని బాధల సుడుల్లా సిగరెట్ పొగ బయటకు వదులు తుంటే నా గతం కాలిపోతూ రాలిపోతుంది వర్తమానం

 57) ఏంటి ఈ ముళ్ళు నా మదినిండానిండా కలలో కన్నీరై
కంటినుడి కారిన కన్నీటి జ్ఞాపకలేనా ముళ్ళై గుచ్చుకుంటున్నాయి

 58) నీవు పలుకకపోతే నీ మౌనాన్నే
నా హృదయం నిండా నింపుకుని ఓర్చుకుంటాను

 59) అయ్యో ఎందుకు నా రాత్రులు అలా జారిపోతున్నాయి
నిదురలో తన ఉనికి నను తాకినా కలలు జారిపోతున్నాఎందుకో

 60) నిద్రలేని ఈ రాత్రుల్లలో కోపాన్ని
దుప్పటిలో కప్పేసి.. కన్నీటితో నీకై ఎదురు చూస్తున్నాను

 61) నీ జ్ఞాపకాలు నురగలై పొంగుతున్నట్లు...
అవి నాలోనే పేలుతున్నట్టు ప్రతి నిమిషం నాలోనేను రగిలిపోతున్నా

 62) నీ జ్ఞాపకాలు నాలోని అస్థిత్వాన్ని శోధించమంటున్నాయి
నేనేంటో తెలియని నన్ను నిర్దాక్షిణ్యంగా ఒంటరిని చేస్తున్నాయి

 63) నీజ్ఞాపకాలు నాకు ఎదురు పడుతూ
పదే పదే నా ఒంటరితనాన్ని ప్రశ్నిస్తున్నాయి

.64) అందమైన నీ కళ్ళని ఎంతసేపు చూసినా తనివి తీరదు
దగ్గరిగా చూసిన ఆ కళ్ళలో మెరుపులు మళ్ళీ చూడగలనో లేదో ...?

 65) నీ జ్ఞాపకాలతో తడిసిన నా కళ్ళు
నేను శాశ్వతంగా దూరమైనప్పుడు నీకళ్ళలో తడిచేరనీకు నేస్తామా..?

 66) రెప్పలు మూసుకుని నా కన్నుల్లో చీకటికి చోటిచ్చాను
ఆచీకట్లో చిరు దివ్వెవై వెలుగులు చిమ్ముతూ కనిపిస్తావని ..ఎక్కడున్నావో..?

 67) ఒక్కో అనుభవం నన్ను నాకు పరిచయం చేస్తూ జ్ఞాపకాలుగా నిక్షిప్తమవుతున్నాయి గుర్తొచ్చిన ప్రతీ సారీ గుబులు పుట్టిస్తున్నాయి

 68) నీ ఊహల్లో గెంతుతూ ఎగురుతూ కిందపడి..తగిలించుకున్న
గాయాన్ని భరించలేకపోయాను...ఆ నొప్పి ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది

 69) నాలో అలజడికి కారనమై ఎం సాదించావో కాస్త చెప్పవూ
అమె కళ్ళు నా గుండె లోతెంతో తెలియని ఏవో ప్రశ్నలు సంధిస్తున్నట్లున్నాయి.

 70) ఒకరితో కాలాన్ని పంచుకొని..అన్ని నిజంలా నమ్మించి
మరొకరి వంచన చేసి ఆనందిస్తున్నావని బరువెక్కిన హృదయంతో నేను.

 71) నా ప్రేమ సౌధం కుప్పకూలిపోయింది..నాలో గూడు
కట్టుకున్న ఆశలు పగిలిన అద్దపు ముక్కల్లా చాల్లాచెదరయ్యాయి

 72) ముత్యాల కలువలు, చెక్కిళ్ళు కూర్చిన కన్నీటి
దారాల్లో ఇమడలేక జారి కన్నులద్వారాల్లో కరిగి మాయమవుతున్నాయి

 73) మోడువారిన నా బ్రతుక్కు ఆశ చిగుర్లు కట్టావు కాని
ఏమనుకున్నావో ఏమో హృదయాన్ని సర్రున చించావెందుకనో

 75) నిన్ను ఇష్టపడ్డ క్షనం నుంచి నాకు నేను నడక
నేర్చిన శవమై జీవం వైపుగా దిగాలుగా నడవాలని విఫల పయత్నంలో నేను

76) మానిన గాయాల్ని రేపడం నీకు ఒక ఆట అని నిన్ను ప్రేమించేదాకా తెలీలేదు

 77) గుండెకు గాయాలు పూడ్చుకుంటూ నీ బాటన
గులాబీలు పర్చాలని నా జీవితాన్ని గులాబీ పూలను చేశాలే

 78) నీ జ్ఞాపకాల అనుభవాలు ఆ ముళ్ళు మనసు
నిండా ముళ్ళు నా లోనే దాచిపెట్టుకొని పైకి నవ్వాలంటే కష్టంగా ఉంది

 79) ఎన్ని బ్రతుకుల వర్తమానలని చేసి కరుగదీస్తావు విగత జీవుల్ని చేస్తావ్‌ ? ఎన్ని ఆనందాలను జ్ఞాపకాలుగా మారుస్తావు "ప్రేమ" ఇది నీ నైజమా నీ నిజరూపమా

 80) నీ ఆలోచనల ఆవిరి నా కళ్ళను ముసురుకుందో ఏమో
గుండెగొంతుకలో స్వరం మారి అపశృతులు పలుకుతున్న మౌనరాగాలు

 81) ఏకాంత వనం లో ఎద ఏదో రాగం ఆలపిస్తూండగా
ఆలోచనల్లో ఆవేదనలు కమ్ముకొన్నప్పుడు ...గుండె గాయాల్లో ఏదో అలికిడి

 82) పని వేళల్లో నేను పదిమందితో ఉంటాను,
కానీ ఎవరూలేని ఏకాంతంలో మాత్రం నీజ్ఞాపకాలతో ఉంటాను

 83) నీవు పలుకకపోతే నీ మౌనాన్నే నా హృదయం
నిండా నింపుకుని ఓర్చుకుంటాను అంతకు మించి ఏం చేయలేక..?

 84) ఆ గతించిన జ్ఞాపకం సజీవమై నీకోసం తడుముతుంది
నిలిచి పోయి గతం లోకి తొంగిచూస్తున్న మనసుకు నిజాలు తెల్సినా ఏం చేయలేమా

 85) నా వంకర టింకర అక్షరాలనే కోట్ల సార్లు చదువుకుంటున్నా
ప్రతి అక్షరం నాలోని ఆనందాన్ని ఆవేశాన్ని ఆవేదనను అనచుకొంటున్నా

 86) నీ తలపులెందుకో మనసును గజిబిజి చేస్తున్నాయి
ఈ రోజు ఎందుకంత స్పష్టంగా కలలోకి వచ్చి కలవర పెడుతున్నావు

 87) ఏంటో జీవితం అప్పటినీవులా లేవు
స్వప్నాల రెక్కలు కత్తిరిస్తున్నావు కనికరంలేకండా

 88) విభిన్న ఆలోచనలతో దారి తెలియక పరుగులు తీస్తుంటుంది

89) జ్ఞాపకం ఆవేశాలు అసహనాలు జారీ అయ్యాక అన్నీ తెలిసినా ఎదలో ఏదో వీడని అనుబంధం


89) నిన్నను మరచి ..నేటిలో గతంలోకి తొంగిచూస్తే..
ప్రస్తుతాన్ని పగులగొట్టి నాలో విషాదాన్ని ఎందుకునింపావు జాబిలమ్మా


90) నామనసు ప్రతిబింబంలో నీవు వేయి సార్లు జవున్మిస్తావు
నను కాదని నీ చూపు మరిలిన అనుక్షణం నేను లక్షసార్లు మరణిస్తూనే ఉన్నాను