. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, October 7, 2013

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(25)

1) ఇవే ఙ్ఞాపకాలు నా మనసునెందుకిలా బాధిస్తాయో
ఇవే క్షణాలు…ఇవే సాయంత్రాలు సంతోషాన్ని మోసుకొచ్చేవి మరిప్పుడు..?


2) అంతులేని ప్రశ్నలతో రాత్రులు మేలుకుని
ప్రతీక్షణాన్ని పరిశీలిస్తాను ఇద్దరికీ మధ్య భౌతిక దూరం మౌనమే కదా..?


3) మోయలేని సంకేతాలని గ్రహించే మనసుకి
మౌనంలో ఏ నిర్వచనాన్ని అందించాలో నాకెప్పటికీ అర్థం కాదు


4) చిమ్మచీకట్లో దారితెలియక తిరుగుతున్న
ఈ క్షణాన దారిచూపే దేవతలాంటి స్నేహం కావాలి


5) గుండె నిది అయితే "చప్పుడు" నాది కావాలి
నీ శ్వాస ఆగితే "మరణం" నాది కావలి..నువ్వు ఎక్కడ ఉన్న "నా నువ్వు గా" ఉండాలి


6) ఆశగా అమాంతం నీ లోనికి చొరబడాలని చూస్తాను
లోన ఇంకెవరో ఉంటారు అందుకే వాకిట నుండే వెనుదిరుగుతాను నిరాశగా


7) నీ జ్ఞాపకాలు అనుక్షణం వెంటాడుతూ నాతో
పోరాడతాయి నే పోరాడలేనని ఎదిరిస్తే నాకు దూరమై శిక్షిస్తాయి.


8) ఎవరి స్వార్ధం వారిది ..మనసులో వాళ్ళ స్వార్ధం
కోసం ఆదర్శాన్ని ఆశ్రయిస్తారు.. లేకపోతే స్వార్ధం కోసం ఆదర్శాన్ని వదిలేస్తారు.


9) చీకటిని అందంగా చూపే జాబిల్లి వెలుగులు జారిపోయాయి
నీవు లేని వెన్నెల చీకట్లు పరుచుకోక ..వెలుగులు ఎలా విరజిమ్ముతుంది


10) అందమైన భావనలు మనస్సులోనే ఉండకూడదు
అవి మదిని దాటి, కలంలో ఇంకులా మారి, ఎన్నటికి చెరిగిపోని శిలాక్షరాలవ్వాలి


11) నేను ఏకాంతంగా ఉన్న ప్రతిసారి ఒంటరితనం నన్ను కబళించడానికి
ప్రయత్నిస్తూ ఉన్నది కానీ నీ జ్ఞాపకాన్ని అడ్డుపెట్టుకొని నేను దానితో పోరాడుతున్నా


12) వేదనకు ఇది చాలదూ....పరిహసించిన పరిచయాలు
నిలేసిన నీటి కళ్ళూ నీ సాక్షిగా నన్ను వెక్కిరిస్తున్న అపహాస్యపు అనుభవాలు


13) ఏమీ మాట్లాడకూడదని మౌనంగా కూర్చుంటే
నిశ్శబ్దలో నీవు నాతో మాట్లాడిన గుస గుసలు వినిపిస్తున్నాయేంటి..?


14) రాత్రి నేను తాగింది ఇంకా దిగలేదేమో
ఇంకా నువ్వు నాతో నవ్వుతూ మాట్లాడీనట్టే అనిపిస్తుంది


15) ఒక్కోసారి కన్నీటిని కనిపించకుండా చేస్తున్నా కాని
లోపలి రగులుతున్న బాధ అనే అగ్గిని ఆర్పలేక ఇంకా తగలబడుతూనే ఉన్నా


16) నాలో నేను తడుముకుంటున్న ప్రతిసారి
అనుభవాల్ని అక్షరాల్లోకి తర్జుమా చేస్తూ అక్షరాలను పేరుస్తున్నాను


17) చీకటి కూడా వెలుగుకేసి నడుస్తుంటే
నాలోని నేదన నన్ను చీకట్లోనె ఉండమని శాశిస్తుంది


18) పువ్వుకి వాడిపోతానని తెలుసు
దారానికి చేరి దండలో అమరాలనే కోరుకుంటుంది


19) నీ మనసు గుడ్డిది అనుకుంటా నా మనసుని చదవలేక పోతుంది

20) స్నేహానికీ ప్రేమకీ మధ్యలో నన్నుపెట్టి
చావుకీ బతుక్కీ మధ్యలో నెట్టేసి ఏం వింత జరుగుతుందాని చూస్తున్నావా..?


21) నా గుండె ను నీవు చంపి రోజులు గడుస్తున్నాయి
నా ప్రేమ మొక్క మళ్ళీ చివురు తొడుగుతుందేమో అని నిత్యం కన్నీరు పోస్తూనే ఉన్నాను


22) నేను తలపుల తనువు కోసం ఆరాటపడుతున్నా ...
మన పరిచయం సముద్రంలో దిక్కు మొక్కులేని నావలా మారిందెందుకో..?


23) నీ జ్ఞాపకం పిడికెడు హృదయాన్ని మెలిపెట్టి చంపేస్తోంది
నీ మాటలు మువ్వల సవ్వడులై నాలో ఇప్పటికీ ప్రకంపనలు సృష్తిస్తున్నాయి


24) ప్రేమను చంపే దౌర్జన్యం సంకెళ్లు తెరచుకుంది
దుర్మార్గం ఒళ్లు విరుచుకుంది...అవమానం అక్కసు వెల్ల గక్కుతోంది


25) నా ప్రేమగుండెల్ని గుప్పెట్లో పట్టుకొని
గుబులు పొదల మాటునుండి బిత్తర చూపులు చూస్తున్నా నీవస్తావని


26) ఏకాంతంలో ఒకరికొకరం ఏకమైయ్యే తరుణంలో
మనసులు పలికే మూగభాష మదిలో గిలిగింతలు పెడుతుంది


27) మనపరిచయం కొన్ని జన్మలకు నేను నెమరు వేసుకుంటాను
ఈ జ్ఞాపకాలు చాలు ఈ మది గదికి లో నీకై చోటు ఎప్పటికీ ఉంటూందని నీకూ తెల్సు


28) నేను నీవు అలా ఒకరికోసం ఒకరం గా ఉన్నంత కాలం ఏదో దైర్యం
నీ కళ్ళు నన్ను వెదికినప్పుడు నాలో ఏదో మార్పు గుండెల్లో దడ ఎందుకనో..?


29) ఎన్నో వేల నిముషాల వృధా ప్రయాసలో నీకు నాకు మధ్య
పెనవేసుకున్న బంధానికి నేనెప్పుడు కాపలాగా ఉంటాను మరి నువ్వు?


30) రాత్రుల్లు నా కలల్లో నిన్నే చూడాలని రాసే ప్రతీ పదము నీకె అంకితమివ్వాలని..
నీ చిరునవ్వులోని పెదవి వొంపులో నేనుండాలని ప్రతిరాత్రి కలలు కంటూనే ఉన్నా


31) ఆ కారుమబ్బుల చాటున వర్షపు చినుకులా మౌనంగా ఏడ్చాను.
ప్రతీ క్షణం ధ్యాసలోనే గడుపుతున్నా కనుమరుగవుతున్న జ్ఞాపకాల వెంటపడుతూ..?


32) ఆ కారుమబ్బుల చాటున వర్షపు చినుకులా మౌనంగా ఏడ్చాను.
ప్రతీ క్షణం ధ్యాసలోనే గడుపుతున్నా కనుమరుగవుతున్న జ్ఞాపకాల వెంటపడుతూ..?


33) నీ ఒక్కో పలకరింపు లో మనసుపై యాసిడ్ దాడిలా చేసిన వెటకారాలు
నన్ను బాధించినా కన్నీరొలికినా ఏమి చేయలేని చేతకానితనం నన్ను వెక్కి రిస్తుంది


34) నీ ప్రతి పలకరిం గుండెకు ఓ తీయని వేటు గుండె ముక్కలు పొదివి పట్టుకుని
నన్ను మోసం చేసుకుంటూ తడబడుతూ గమ్యమెరుగని ప్రయాణం చేస్తున్నా నీకోసం


35) నీతో గడిపిన ఆ కొద్ది క్షణాల భారాన్నీ గుండెల్లో మోసుకుంటూ వెలుతున్నా
ఒంటరి పయనం లో మనసు అంతరాళాల్లోనించి ఆలోచనలు బద్దలై వేదిస్తున్నాయి


36) మనసు మార్చుకున్నావని అనుకున్నాను
మనిషివే మారి మనసుని మర్చి..మరొకరి చెంత చేరావుగా...?


37) నేను నీకోసం రాసే ప్రతీ కావ్యం లో నిన్ను వెతుక్కునేదానివి
ఇప్పుడేమో, నే రాసేది నీ కొసమే అని తెలిసినా వెటకారంగా మాట్లాడుతున్నావంట కదా..?


38) రోజులన్నీ గడిచిపోతూ కాలం నా దగ్గర ఆగిపోయింది
నేనేంటో తెల్సిన క్షనాలు జారిపోయాయిగా జాడనేది లేకుండా


39) నీ చూపు సోకని కాలంలో నిర్జీవంగా బ్రతుకుతూ
భారమైన గుండెతో నేను బందీనై బలౌవ్వటానికి రెడీ అవుతున్నా


40) నిజంకాని మమతలను ప్రోగు చేస్తూ
నిజమైన బంధాలు తుంచుకుంటున్నావు తెలుసా..?


41) గతమంటా ఓ సుదీర్గ ఒంటరి ప్రయాణం
నీలో నేను కరువై..గుండె బరువై ఇంకా నీకోసం వెతుకుతూనే ఉన్నా


42) అల్లకల్లోలం చెలరేగే మనసు లో గందరగోళం
ఏవో నీడలు ఏవో జాడలు నన్ను ప్రతిక్షనం వేదిస్తున్నాయి


43) మౌనానికి లిపి కనుక్కోవాలని చూస్తుంటే
మాటలు మూగబోతున్నాయి అక్షరాలు దొరక్క


44) గమ్యంలేని ప్రయాణాలు చేస్తున్నా
నీకోసం ఆశలేను ..నాకోసం నేను వెతుక్కుంటూ


45) ఒంటరితనం నిన్నై గడిచిపోయింది..నేడై నిలిచిపోయింది
రేపై నీకోసం వెతికి ఆశై అక్కున చేరుకుంటుందని ఆవేదనగా ఎదురు చూస్తున్నా


46) కాలం నన్ను ఎందుకో నన్ను ఒంటర్ని చేసింది
కవితలు రాసుకునేందుకేమో కన్నీరుని కలంలో పోసుకొమ్మని కలాన్ని మిగిల్చి ..


47) గతం గాలిలో కల్సిపోయింది..భవిత నన్ను వద్దంది….
ఈ నిముషమే పూర్తిగా నాకంటూ మిగిలింది నేనేంటో చెప్పుకోలేక


48) నీవు నానుంచే వెల్లినప్పుడు అనిపించింది
కాలాన్ని గదిలో పెట్టి తాళం వేయాలని అదే మనిద్దర్ని సాశ్వితంగా దూరం చేసింది


49) నీ సమక్షంలో నాకు కొన్ని క్షనాలు కావాలి
కనురెప్పల చాటున చేరి ఓ అందమైన స్వప్నం లిఖించడానికి


50) బ్రతుకుమీద ఆశను చూపించి...నమ్మించి మోసం చేసి
చావును కళ్ళముందు పెట్టిన నీస్నేహాన్ని ఎలా మరువను చెప్పు బుజ్జీ


51) మనసులో జ్ఞాపకాలు గుండెను సూలాల్లా గుచ్చుతున్నాయి
కన్నీళ్ళ సెగపెట్టి ఎక్కిళ్ళు పెట్టిస్తోన్న మనగతం గాలిలో దీపమైంది కదా ప్రియా


52) గుండెల్లో భాద బరువై మోయలేని భారమై
మనస్సు చేజారి ముక్కలై మనసుని గుచ్చి గుచ్చి బాధిస్తోంది


53) గుండె అగ్గి శిఖలై ఎగిసెగిసి పడుతుంటే
కళ్ళు గుమ్మరించిన కన్నీరు ఆవిరై నీదరి చేరుతుంది కదా ప్రియా ..?


54) ఒక్క క్షనం ఆవేశం .. మరుక్షనం ఆవేదన
గుండెగొంతుకలో ఆగిపోయిన మాటల ప్రవాహం సాక్షిగా నేనెవర్ని


55) నాలో ఆందోళన కమ్ముకుంది..ఆవేశం మరణించిది
గుండెకు గాయమై రక్తంలా చిందుతున్న జ్ఞాపకాల సాక్షిగా నాలోనేను దొరకడంలేదు


56) కన్న వారిని కళ్ళముందే పోగొట్టుకొని
‘నా’ అన్నా వారికీ దూరమైన నిర్భాగ్యున్ని నన్నిలాగే చావనీ ప్లీజ్...?


57) నిస్సత్తువతో కూడిన ప్రయాణం నాది
నిస్తేజంతో కూడిన భావన నాది....మరొకరి గెలుపుకోసం నన్నోడించావుగా...?


58) నిన్ను చేరేందుకు వేరే దారిలేక అక్షరంగా మారిపోయా అక్కున
చేర్చుకుంటావనుకుంటే మరొకరి అక్షరాలను మెడలో మాలగా వేసుకున్నావుగా...?


59) మనసుకు మంత్రం వేస్తావని గుండెల్లో చేరావు
ఎవరికోసమో ఆ మనసునే ముక్కలు చేశావు నీకిది న్యాయమా..?


60) నా మనసు గదిలో నేనొక్కన్నే
గుండెకు గాట్లు పెట్టి నవ్వమని కనిపించకుండా పోయావుగా..?


61) మనసు పలికే మౌన భాషకు భావమిచ్చిన బాపుబొమ్మా
కలల ఇలకు తెచ్చిన జాబిలమ్మా ఎక్కడున్నావో కాస్త చెప్పవమ్మా ..?


62) ఎందుకో ఈ ఉలికిపాటు నిదురరాని కంటిపాపలో
కలల అలలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి..అది నీవే కదూ..?


63) నా మనస్సులో చీకట్లు కమ్ముకున్నాయి
నా చితి మంటలతో అయినా ఆ చీకట్లు తొలగేనా కాస్త చెప్పవూ


64) నా ఆనందపు వెన్నెల కరువై చీకటి మిగిలింది
నా మది నింగిలోని జాబిలి మాయమయ్యి మనసును భాదపెట్టింది


65) నా మదిని కాగితంగా మార్చి నిన్ను కవితగా చేసి రాస్తున్నా
నిన్ను చేరుకోవాలని కాదు ఓడిపోయిన నేను నన్ను నేను ఓదార్చుకునేందుకు


66) వేదన పెట్టాలన్నా నీకు ఏదైనా సాధ్యమే చెలి
కవ్వించనూ గలవూ నవ్వించనూ గలవు మనస్సును ముక్కలు చేయగలవు


67) స్వచ్చమైన కన్నీటి లాంటి ప్రేమ నిజంగా ఉంటుందా
గుండెకు చిచ్చుపెట్టి నేను రోధిస్తుంటే కనులనుండి జారిపోయే కన్నీరేనా ప్రేమంటే...?


68) నా మౌనం నీదైనప్పుడు,
నిశబ్దాన్ని మించిన శబ్దం గుండెను చేరలేదేమొ కదా


69) గతకాలపు జ్ఞాపకాలను  చెత్తకాగితాలగా చేసి విసిరేశావుకదా..?

70) నా మనసనే పుస్తకం చదవడం మొదలు పెట్టి
మద్యిలో మనజ్ఞాపకాల పేజీలను చించేస్తున్నావెందుకనో చెప్పవూ


71) ఏటువైపు చూసినా నీజ్ఞాపకాలే..
ఏం చేయను పారిపోయిన కాలాన్ని పట్టలేనని తెలుసుకున్నాను


72) ఏమి రాయాలో తెలీక అక్షరాలు తడబడుతున్నాయి
మనస్సనే ఈ కాగితం పై అర్ధం కాని రాయలేని సిరాలా మిగిలిపోతూన్నాను


73) ఏమైందో నా హృదయానికి ఈరోజు ప్రతి పదం పదునెక్కుతోంది
మనసు వేడెక్కి గుండెల్లో సూటిగా అక్షరాలు గుచ్చుకుంటున్నాయి


74) గతాన్నంతా కాల్చేసాను...జ్ఞాపకాలన్ని చెరిపేసాను
అయినా ఎందుకీ అలజడి..ఏందుకీ ఆందోళన నేనేమైపోతున్నానో కాస్త చెప్పవూ


75) నిజమే నన్ను నేను వదిలేసాను...నా ఆత్మను చంపేశాను
నా ప్రేమను చంపేసాను...నీ సంతోషంకోసమేగా ఈ బలులు ఇచ్చింది నేను


76) నీ గుండెలో చోటిస్తానని నా మనసులో చోటిచ్చాను
ఇప్పుడు ఊపిరాడనీకుండా బయటపడనీకుండా నన్ను బంధించి నవ్వుకుంటున్నావా...?


77) మనసు గుప్పెళ్ళ నిండా నీ కోసం నేను కనే కలలే
గుండెల నిండా నీపై ప్రేమే...మరి ఇప్పుడు ఎక్కడున్నావో కాస్త చెప్పవూ..?


78) చేజారిపోయిన నిన్ను నేను ఉక్రోషంగా కన్నీళ్ళతో చుస్తే
చెక్కిళ్ళపై చారికలుగా మిగిలిన కన్నీళ్ళై గతం నన్ను వెక్కిరిస్తుందిలే


79) ఏదో చెయ్యాలనే తపనని ఏమి చెయ్యలేని
నిస్సహాయాతని వ్యక్తం చేస్తున్నాయి నీ జ్ఞాపకాలు


80) ప్రతి క్షణం నీ ఆలొచనలు నా గుండెల్లొ గుబులు రేపుతున్నాయి
గుండె బేజారి .. మనసు చేజారి ఒంటరిగా ఇంకా నీకోసం తడుముకొంటూనే ఉన్నా


81) అక్షరాలు చుర కత్తులు నువ్వు నన్ను తిట్టినపుడు
అక్షరాలు పువ్వులు నువ్వు నన్ను ప్రేమించినపుడు మరి మౌనంలో పలుకలేనప్పుడు


82) కను రెప్పలు మధ్య మూసుకుని దాచుకున్న స్వప్నాల్ని
కను రెప్పలు మూసి నా తలపులన్నీ నీ నుంచి దాచే వృధా ప్రయత్నం చేస్తున్నా


83) కంటి చివర వంపుల్లోంచి జారిన కన్నీటి చుక్క తో
నీ హృదయాన్ని తడి తపనలతో నన్నోదార్చమని వేడుకొంటూన్నా..


84) మెత్తని అడుగుల నిస్సబ్ధంలో
ఆక్రోశమనే ఆకులురాలుతూ మౌనం నిశ్శబ్ధాన్ని చేదిస్తోంది


85) ఆకాశంలో విడి విడిగా విసిరేసిన తెల్లని మబ్బుల్లా..
ఒక్కో సారి కలుసుకుంటూ ఎక్కువ సార్లు విడిపోతూ అసలు ఎప్పటికీ కలువలేని పట్టాల్లా


86) మన రెండు హృదయాల మధ్య చిల్లులతో వెలితిగా
గతం చేసిన గాయాలతో ప్రస్తుతాన్ని నేను జీర్నించుకోలేక ఒంటరిగా నీకోసం


87) ఏంటీ జీవితం ఎటు చూసిన హేళనలు ,
అక్కర్లేని సానుభూతులు మింగలేనంత చేదు అనుభవాలు


88) నీకు నాకు వైరం కొలవలేనంత మౌనం వెలుగే లేనంత చీకటి ఎందుకో
నువ్వున్న చోటుకి చేరుకోలేనని తెలిసి కూడా పిచ్చిగా పరుగులు తీస్తూనే ఉంటాను


89) చిలిపి రహస్యాలు వెచ్చని ఉపిరి శ్వాసలను
నీతో పంచుకునేంతవరకు తెలియనే ఆవేడిగాలుల అసలు రహస్యిం


90) గుండెగోడల్లో పేరుకపోయిన "ఇగో" లతో
మనల్ని మనం మర్చి..ఎవరికి వారిని మోసం చేసుకుంటామేమో..?


91) నీవు చెప్పిన ఊసులకు లిపిలేదనేగా నీదైర్యిం
నేనెప్పుడు అన్నాను తప్పించుకొంటున్నావు నీకేదైనా సాద్యిమే


92) కన్నీళ్ళే కత్తులై ప్రశ్నిస్తుంటే 
ఇక పన్నీరుకు చోటెక్కడ ఉందో కాస్త చెప్పవూ  

93) తనువంతా నెర్రెలిచ్చిన నేను నీకోసం వెతుకుతున్నా
తడబడే మాటలతో నాలో నేను తగలబడున్నానని తెల్సీ ఎంత హేపీగా ఉన్నావో


94) అడుగుతున్నప్పుడు ప్రశ్నచిన్నదిగానే ఉంటుంది
అది మనసులో రేపే అలజడి చెప్పేందుకే మాటలు వెతుక్కోవాలి మరి..?


95) నీ అంతరంగం ముందు ఆవిష్కరించిన అక్షరానికి మనస్సు స్పందిస్తుంది
నీ మౌనానికి అక్షరరూపమిచ్చి నిర్ణయం చేజారిన నిస్సహాయత నన్ను ఏడిపిస్తుంది


96) నామనసు ప్రతిబింబంలో నీవు వేయి సార్లు జవున్మిస్తావు
నను కాదని నీ చూపు మరిలిన అనుక్షణం నేను లక్షసార్లు మరణిస్తూనే ఉన్నాను


97) పగిలిన గుండెను ఓదార్చే నేస్తమా...
నాకోసం చూసిన ఎదురుచూపులను తిరిగి నా కివ్వవా


98) నాకు అందితే నీతో కొన్ని క్షణాలు గడిపే వరం
నిలుపుతాను నా హృదయాలయం లో నీ రూపం అన్ని జన్మలకు


99) రతి రొజు నిజాన్ని కన్నీటి పొరలతొ కప్పుతుంది జ్ఞాపకం
నేను ఊహించిన అద్బుతమైన నిజాలన్నీ అవిరౌతున్నాఎందుకో ..?


100) గుండెకు గుచ్చుకున్న తన జ్ఞాపకాల మువ్వలతొ...
తన జీవితం మీద తానే నిద్రపొయింది ఏం చేయాలో తెలీక