ఎంతకని ఓర్చుకోను ,
ఎన్ని మాటలని పడను
ఎందరితో నీవు అవమానిస్తున్నా
భరిస్తున్నా భారంగా
ఎన్నాళ్లని నాలో నేను పోరాడను..
ఎడారిదారిలో గమ్యం
తెలియని బాటసారిలా
ఎండమావిలా అందని
మధురస్వప్నాల వెంట
ఆగని జీవనపయనం సాగిస్తూనే ఉన్నా
జాలిలేని కాలం వడివడిగా
పరిగెడుతూనే ఉంది.
ఇన్నాళ్ళూ,ఇన్నేళ్ళూ
ఓపికతో పరుగులు పెడుతున్నా
అలసిపోయిన మనసు
ఇక నావల్ల కాదంటోంది
నిన్నందుకోలేని నిస్సహాయతతో
నామీద నాకే జాలేస్తోంది
ఒక్కోసారి నామీద
నాకే అసహ్యం వేస్తుంది
కరిగేకాలం నన్ను చూసి
నవ్వుతుంటే కనురెప్పల నీడల్లో
జాలువారే కన్నీరు
నిశ్శబ్దపురాత్రిలో నాకు తోడౌతోంది
ఎన్ని మాటలని పడను
ఎందరితో నీవు అవమానిస్తున్నా
భరిస్తున్నా భారంగా
ఎన్నాళ్లని నాలో నేను పోరాడను..
ఎడారిదారిలో గమ్యం
తెలియని బాటసారిలా
ఎండమావిలా అందని
మధురస్వప్నాల వెంట
ఆగని జీవనపయనం సాగిస్తూనే ఉన్నా
జాలిలేని కాలం వడివడిగా
పరిగెడుతూనే ఉంది.
ఇన్నాళ్ళూ,ఇన్నేళ్ళూ
ఓపికతో పరుగులు పెడుతున్నా
అలసిపోయిన మనసు
ఇక నావల్ల కాదంటోంది
నిన్నందుకోలేని నిస్సహాయతతో
నామీద నాకే జాలేస్తోంది
ఒక్కోసారి నామీద
నాకే అసహ్యం వేస్తుంది
కరిగేకాలం నన్ను చూసి
నవ్వుతుంటే కనురెప్పల నీడల్లో
జాలువారే కన్నీరు
నిశ్శబ్దపురాత్రిలో నాకు తోడౌతోంది