ఆ పలకరింపు ..తియ్యని పులకరింపై
ఓ శబ్ద తరంగాన్ని అలా మోసుకొచ్చి
చుట్టపుచూపులా వచ్చినట్టే వచ్చి
కనుచూపుమేరకు తరలిపోయింది
నాలోతట్టుకోలేని నిశ్శబ్దాన్ని మిగిల్చింది
కనురెప్పల కదలికలలో సవ్వడేది?
కన్నీటి సుడులలో హోరు
హృదయంలో నీ జ్ఞాపకాల అలజడి
మీరెవరన్నా విన్నారా?
ఒయ్ నిన్నే నీకూ వినిపిస్తుందా
నాకనిపిస్తోంది నిశ్శబ్దమే బాగుంది కదా
నిశ్శబ్దమే శాశ్వతం……..కాదంటావా
కాదని అనగలవా అంత టైం ఉందా నీకు
రాత్రుళ్ళు అందరూ
ఊహా లోలకానికి అతుక్కుపోయినట్టున్నారు
అవును కాదుల నడుమ
ఊపిరి సలపనంత ఊగిసలాట…
గడియారపు టిక్కుటిక్కులే మిగిలిందిక
గాడితప్పిన గతం సాక్షిగా
ఒకనాటి ఒప్పులన్నీ తప్పులయ్యాయిగా
ఏంటో ఈ చల్లని వెన్నెల చీకట్లో
నా నుదుటి స్వేదం
గుండెలపైకి జారి
నిశ్శబ్దాన్ని చిద్రం చేస్తుంది
ఆ చిన్న నిశ్శబ్దానికే గుండె బారం అవుతోంది
నిశ్శబ్దం చిన్న అలికిడి కూడా లేదు
చిరునవ్వుల సందడి నాకు దూరం
అయింది నన్నొదిలి దూరంగా
నా చుట్టూ నిశ్శబ్దపు రాజ్యం
రాజుని నేనే, దాసున్ని నేనే!
ఆలోచనల అలల్లో తీరం చేరితే
సామ్రాజ్యమంటాను!
ఆశల వలలో చిక్కుకుపోయి
సముద్రంలో చిక్కుకున్నాను
విరహవలయంలో చిక్కుకున్నా
చింద్రం అయిన మనస్సులో
ఏన్నో ఆలోచనల సుడులు
నాకు నేనుగా ..
ఓడిపోయిన ప్రస్తుతంలో
ఒంటరిగా జీవింఛలేక
ఇంకా నీపై ఆశచావక
ఎదురు చూస్తూనే ఉన్నా నీకోసం