తెరలు తెరలుగా
పడుతూనే వున్నాయి
చిరుజల్లులు
పూవుల్ని తాకుతూ కొన్ని,
రాళ్ళను తడుపుతూ కొన్ని,
పచ్చని ఆకులపై రాలేవి మరికొన్ని
ఏంటో తలల పై పడ్డ చిరుజల్లులు
రోడ్డు పైవెలుతున్న నీ పై చేరి
నీ పై జల్లిన తలంబ్రాల
ముత్యాల్లా మెరుస్తున్నాయి
గమ్యాన్ని చేరేలోగా
గాలివాటుకి
చేరే చిరుజల్లుల ముత్యాలో
ఏ మబ్బులో మొదలైనా
మట్టి తో పాటు నన్ను
ఒకేలా పలుకరిస్తున్నాయి
విధిగా తడుస్తూ
చెట్లూ , రోడ్లూ ఆకులు ,
అలమలతో పాటు
అప్పుడప్పుడూ నా యదను
తడిపే తీపి జ్ఞాపకాల్లా
చిరుజల్లు నన్ను
పూర్తిగా తడిపేస్తున్నాయి