. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, October 6, 2013

"చలం" "కలం" నుండి జాలువారిన ఓ "ప్రేమ లేఖ..(1)నిద్రకైనా విరామమెరుగని ఈ హృదయ యాత్ర నీ కోసమని మరువలేను .

ఎంత నీ నుంచి దూరం కావాలని ప్రయత్నించినా ఏదో విదాన ఏదో రూపాన , నా దృష్టిని మరల్చుకొంటున్నావు .

నీవు రావు , నన్ను పొనీవు .

మరల్చి , మత్తెక్కించి , స్వప్నలతో లాలించి , మధుర గానాలలో ఊగించి , ప్రపంచానికి వ్యర్ధున్ని చేసావు ..

దిగులు కళ్ళతో , వెర్రి చూపులతో , మరుపు మాటలతో , అన్ని విశ్వాసాలు నశించి తోవ తెలీక తిరుగుతున్నాడు ఈ ప్రేమ బైరాగి ..

అనాదిగా విన్న నీ పిలుపు , స్వప్నం లో అనుభవించిన నీ కుంతలాల కొనల స్పర్శ ; ఏ యుగాల అవతలి తీరానో సంయోగమనే వాగ్దానం , ఇంతే నాకు మిగిలిన ఆశలు .

నాకు వెర్రి .

ప్రియా ,నాకు సుఖం లేదు , శాంతి లేదు , ఆనందం లేదు, నువ్వు లేనే లేవేమో ..అంతం లేని ఇంత కాలమూ ,నన్ను నేనే వెతుక్కొంటున్నానెమో అని భయం వేస్తుంది ..

నీ కోసం వెతికి వెతికి అలసి , నీ చూపులు తమ లోకి తామే చూసుకొంటున్నాయి .
ప్రియా.. అని హృదయం తనని తానే గొణుక్కోఒటోఒది

ఎండమావుల సౌందర్యానికై తపించి , వొదిలి , ఎండి లయమయ్యే ఈ నిర్భాగ్యుణ్ణి చూసి దిక్కులే నవ్వాయి, చుక్కలే ఏడ్చాయి .

యోగులు హృదయాలలో వెలిగించుకొనే కాంతి నీ చిరునవ్వు .. నాకెట్లా దొరుకుతుంది ? ..లోకాన్ని వెతికే నాకు ?