గుండె బరువు దించమంటూ..
కను రెప్ప జారిన చివరి బొట్టు
నీకోసం ఆత్రంగా జారిపోతుంది
నీ జ్ఞాపకాలు గుచ్చుకున్న ప్రతిసారి
ఆగలేక ఆత్రంగా బయటికొస్తున్నాయి
కన్నీరు నీకోసం వెతుకుతోంది
మనసులో బాధ తనని
తాను తాను కాల్చుకొంటూ
నిట్టూర్పులొదిలిన సెగ
వేడినిట్టూర్పులతో వేదిస్తోంది
జరిగిన ఘటనల సాక్షిగా
మనసు నిండా నింపుకుటూ..
మెరుపు వెలుగులో..
కనిపిస్తావేమో అని
తడుముకొంటున్నా
అనుభవాల శిధిలాలనూ
దాటుకొంటూ
గతాన్నీ తొక్కి ప్రస్తుతంలో
వెతుకుతున్నా
గతంచేసిన గాయాలను
లెక్కచేయకుండా
కనురెప్ప తెరచుకొని
మనసు భారాన్ని కన్నీటిలో
మోసుకుంటూ..
తలుపులు బిగిసిన గమ్యానికి
చేరాలనే ప్రయత్నాన్ని
నీవెందుకు కాదంటున్నావో తెలీదు
నా గెలుగు నీకిష్టంలేదుకదూ.
అందుకేనా అందర్ని గెలిపిస్తూ నన్నోడిస్తున్నావు
కను రెప్ప జారిన చివరి బొట్టు
నీకోసం ఆత్రంగా జారిపోతుంది
నీ జ్ఞాపకాలు గుచ్చుకున్న ప్రతిసారి
ఆగలేక ఆత్రంగా బయటికొస్తున్నాయి
కన్నీరు నీకోసం వెతుకుతోంది
మనసులో బాధ తనని
తాను తాను కాల్చుకొంటూ
నిట్టూర్పులొదిలిన సెగ
వేడినిట్టూర్పులతో వేదిస్తోంది
జరిగిన ఘటనల సాక్షిగా
మనసు నిండా నింపుకుటూ..
మెరుపు వెలుగులో..
కనిపిస్తావేమో అని
తడుముకొంటున్నా
అనుభవాల శిధిలాలనూ
దాటుకొంటూ
గతాన్నీ తొక్కి ప్రస్తుతంలో
వెతుకుతున్నా
గతంచేసిన గాయాలను
లెక్కచేయకుండా
కనురెప్ప తెరచుకొని
మనసు భారాన్ని కన్నీటిలో
మోసుకుంటూ..
తలుపులు బిగిసిన గమ్యానికి
చేరాలనే ప్రయత్నాన్ని
నీవెందుకు కాదంటున్నావో తెలీదు
నా గెలుగు నీకిష్టంలేదుకదూ.
అందుకేనా అందర్ని గెలిపిస్తూ నన్నోడిస్తున్నావు